Telugu Cinema Review: Latest Movie Reviews & Audience Talk
Telugu Cinema Reviews with honest analysis, ratings, box office collections, audience reactions. Complete Tollywood movie updates here.

ఇటీవల కొన్నాళ్లుగా వరుసగా వస్తున్న తెలుగు సినిమాలు (Telugu Cinema) అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి ఆడియన్సు కి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాగా ఆడియన్సు ముందుకి వచ్చిన Little Hearts వంటివి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుని మంచి లాభాలు అందుకున్నాయి.
ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన Game Changer, Daaku Maharaaj, Sankranthiki Vasthunam సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయం అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించింది. ముఖ్యంగా ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ ని దక్కించుకుని అటు దర్శకుడు అనిల్ రావిపూడి, ఇటు హీరో విక్టరీ వెంకటేష్ ల కెరీర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఆ విధంగా ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల్ని అలరించిన పలు సినిమాల యొక్క రివ్యూస్ ని వివరంగా చూద్దాం.
1. Little Hearts Review Telugu :
యువ నటీనటులు మౌళి, శివాని నగరం హీరో హీరోయిన్స్ గా రూపొందిన ఈ మూవీని 90's వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మించగా యువ దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించారు. ముఖ్యంగా ఈమూవీలో మౌళి తో పాటు యువ నటుడు జైకృష్ణ డైలాగ్స్, కామెడీ పంచెస్ యువతని అలానే అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి.
యువ సంగీత దర్శకుడు శింజిత్ ఎర్రమిల్లి అందించిన సాంగ్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ మూవీకి పెద్ద బలంగా నిలిచాయి. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్యకృష్ణన్, అనిత చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు అటు నార్త్ అమెరికాలో సైతం విశేషంగా ఆడియన్సు ని అలరించి భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా లిటిల్ హార్ట్స్ మూవీ రూ. 26.50 కోట్లు కొల్లగొట్టి టీమ్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించింది.
2. Kishkindhapuri Review Telugu :
యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ యాక్షన్ జానర్ మూవీ కిష్కింధపూరి. ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్, తణికెళ్లభరణి, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తాజా తెలుగు సినిమా రివ్యూలు – ప్రేక్షకుల స్పందన
చైతన్ భరద్వాన్ సంగీతం అందించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించారు. అయితే మంచి అంచనాల నడుమ ఇటీవల రిలీజ్ అయిన కిష్కింధపూరి అందరి అంచనాలు దాటి బాక్సాఫీస్ వద్ద ఆడియన్సు యొక్క మెప్పు సొంతమ్ చేసుకుని బ్లాక్ బస్టర్ కొట్టింది.
ముఖ్యంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ ల నటనతో పాటు కీలక పాత్ర చేసిన శాండీ మాస్టర్ పెర్ఫార్మన్స్, దర్శకుడు కౌశిక్ టేకింగ్, హర్రర్ అంశాలు, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ మూవీ యొక్క భారీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఓవరాల్ గా చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మొత్తంగా వరల్డ్ వైడ్ రూ. 22 కోట్లు కలెక్ట్ చేసి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి పేరు తీసుకువచ్చింది.
3. Mirai Review Telugu :
గత ఏడాది ప్రారంభంలో Hanu-Man మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Mirai. ఈ మూవీని యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా అందాల యువ నటి రితిక నాయక్ హీరోయిన్ గా నటించారు.
మంచు మనోజ్ విలన్ గా చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఇటీవల రిలీజ్ అనంతరం సూపర్ హిట్ గా నిలిచింది మిరాయ్ మూవీ. ఈ మూవీలో శ్రియ శరణ్, జయరాం, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.
లేటెస్ట్ తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్స్, కలెక్షన్
ఇక ఈ మూవీలో హీరో తేజ సజ్జ, శ్రీయ శరణ్, మంచు మనోజ్ ల ఆకట్టుకునే నటన తో పాటు అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ లొకేషన్స్, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చక్కటి టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ప్రధాన సక్సెస్ కారణాలుగా నిలిచాయి. తక్కువ బడ్జెట్ తో ఎంతో బాగా రూపొందిన మిరాయ్ మూవీ అమెరికాలో కూడా బాగా కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా రూ. 111 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి హీరోగా తేజ ఖాతాలో మరొక విజయాన్ని అందించింది.
4. OG Review Telugu :
ఇటీవల నటించిన Hari Hara Veera Mallu భారీ డిజాస్టర్ అనంతరం టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తాజా సీనియా ఓజి. ఈ మూవీలో ఓజాస్ గంబీర అనే పాత్రలో పవన్ కళ్యాణ్ నటించగా ఆయనకు జోడీగా యువ అందాల కథానాయిక ప్రియాంక మోహన్ నటించారు.
యువ రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈమూవీని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎంతో గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మించింది. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన సుజీత్ తీసిన ఈ మూవీ ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ ని అందుకుని బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే జనరల్ ఆడియన్సు కి బాగానే నచ్చిన OG మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం మరింతగా నచ్చేసింది.
ఆ విధంగా పలు యాక్షన్ సీన్స్, ఫైట్స్, ఎలివేషన్స్ సీన్స్ తో మూవీని చక్కగా తీశారు దర్శకుడు సుజీత్. మొత్తంగా ఈ మూవీలో థమన్ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్టింగ్, ప్రియాంక మోహన్ ఆకట్టుకునే అందం, విజువల్స్, భారీ నిర్మాణ విలువలు వంటివి బలాలుగా చెప్పాలి. ఇక ఓజి మూవీ ఓవరాల్ గా రూ. 300 కోట్ల మేర వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని హీరోగా పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది.
5. Idli Kottu Review Telugu :
కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ హీరోగా నిత్యా మీనన్, షాలిని పాండే హీరోయిన్స్ గా ధనుష్ స్వయంగా తీసిన తాజగా ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఇడ్లి కొట్టు. ఈ మూవీని వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ సంస్థల పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ కలిసి గ్రాండ్ గా ఈ మూవీని నిర్మించారు.
అరుణ్ విజయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు చేసిన ఇడ్లి కొట్టు మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అయితే మొదట రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫస్ట్ సాంగ్, టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక ఇటీవల థియేటర్స్ లో పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ని అందుకుంది. అయితే తెలుగులో మొత్తంగా యావరేజ్ టాక్ వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న ఇడ్లి కొట్టు మూవీ అటు తమిళనాడులో మాత్రం బాగానే కలెక్షన్ రాబడుతోంది.
తెలుగు సినిమా రివ్యూస్, రేటింగ్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్
ముఖ్యంగా తండ్రి కోసం అలానే ఆయన జ్ఞాపకమైన ఇడ్లి కొట్టుని తాను నడపడం ఎంతో తపనతో కష్టపడే కొడుకు పాత్రలో ధనుష్ నటన ఎంతో బాగుంటుంది. ఇక కీలక పాత్రలు చేసిన సత్య రాజ్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ కూడా ఎంతో చక్కగా యాక్ట్ చేసి అలరించారు. ఈ మూవీ ద్వారా మరొకసారి సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో మెప్పించారు హీరోయిన్ నిత్యా మీనన్. జేవీ ప్రకాష్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ వంటివి కూడా ఈ మూవీలో బాగున్నాయి. ఇప్పటికే ఇడ్లి కొట్టు మూవీ రూ. 55 కోట్ల మేర కలెక్షన్ తో కొనసాగుతోంది.
6. Kantara Chapter 1 Reivew Telugu :
సరిగ్గా మూడేళ్ళ క్రితం కన్నడలో రూపొంది ఆ తరువాత కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ప్రతి భాషలో రిలీజ్ అయి సంచలన విజయం సొంతం చేసుకున్న మూవీ kantara. ఈమూవీని హీరో రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించారు. అయితే ఆ మూవీ సక్సెస్ అనంతరం తాజాగా దానికి సీక్వెల్ అయిన కాంతారా చాప్టర్ 1 థియేటర్స్ లో రిలీజ్ అయింది.
ఇక ఈ మూవీలో కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా బి. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు. భారీ సినిమాల నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈమూవీ రిలీజ్ రోజు నుండే అన్ని భాషల ఆడియన్సు నుండి సూపర్ హిట్ టాక్ ని సంపాదించింది. ఆ విధంగా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్ పరంగా రూ. 650 కోట్ల మార్క్ ని దాటేసింది.
యాక్షన్, ఎమోషనల్ డివోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన కాంతారా చాప్టర్ 1 లో హీరో రిషబ్ శెట్టి అద్భుత నటన, హీరోయిన్ రుక్మిణి వసంత ఆకట్టుకునే అందం, అభినయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్, ఇతర నటీనటుల పెర్ఫార్మన్స్ భారీ నిర్మాణ విలువలు వంటివి ప్రధాన ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి. మొత్తంగా ప్రస్తుతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కొనసాగుతున్న ఈ మూవీ ఓవరాల్ గా ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.
What's Your Reaction?






