Tollywood Movie Reviews – Honest & Fast Updates

Read genuine Tollywood movie reviews, ratings, and viewer reactions. Get instant updates on new releases from the Telugu film industry on Telugu Movie Media

Tollywood Movie Reviews – Honest & Fast Updates

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా వరుసగా పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తూ వారికి చక్కటి వినోదాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించి వారి ఫ్యాన్స్ కి నిర్మాతలకి ఆనందాన్ని అందించాయి. మరి ఆ విధంగా ఈ ఏడాదిలో ఇటీవల వచ్చిన సినిమాల యొక్క రివ్యూస్ ఇప్పుడు చూద్దాం 

Game Changer OTT (Game Changer Movie Review)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో సముద్రఖని, రాజీవ్ కనకాల, శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు చేయగా ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గేమ్ ఛేంజర్ పై మొదటి నుండి మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ముఖ్యంగా ఈ మూవీలో రెండు పాత్రల్లో చక్కటి నటన కనబరిచారు రామ్ చరణ్. అలానే కీలక పాత్ర చేసిన అంజలి కూడా బాగా పెర్ఫార్మ్ చేసారు. ఇక ఫస్ట్ డే నుండి నెగవిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ గా రూ. 200 కోట్ల మేర గ్రాస్ ని కొల్లగొట్టింది. 

టాలీవుడ్ మూవీ రివ్యూలు – నేడు రిలీజ్

Daaku Maharaaj OTT (Daaku Maharaaj Review)

బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ దీనిని తెరకెక్కించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా దీనిని గ్రాండ్ గా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇక ఈ మూవీలో మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మరొక్కసారి తన పవర్ఫుల్ యాక్టింగ్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఇక ఈ మూవీ కూడా ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 140 కోట్ల గ్రాస్ ని అందుకుంది. 

Sankranthiki Vastunam OTT (Sankranthiki Vasthunam Review)

విక్టరీ వెంకటేష్  హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా కీలక పాత్రల్లో నరేష్, సాయి కుమార్, వీటివి గణేష్ నటించారు. ఇక ఇందులో వెంకటేష్ కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పర్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫస్ట్ డే నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ నో దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడంతో ఈ పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఆడియన్స్ వెంకీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో థియేటర్స్ లో ఎంజాయ్ చేశారు. ఇక ఈ మూవీ ఓవరాల్ గా రూ. 300 కోట్ల వరకు గ్రాస్ ని అందుకుంది. 

Court OTT (Court Movie ReviewT elugu)

యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా యువ దర్శకడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన లేటెస్ట్ కోర్ట్ యాక్షన్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీని నాచురల్ స్టార్ నాని గ్రాండ్ గా నిర్మించగా కీలక పాత్రల్లో శివాజీ,శుభలేఖ సుధాకర్, రోహిణి, ప్రియదర్శి, సాయి కుమార్ నటించారు. అయితే చిన్న సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కోర్ట్ మూవీ ఫస్ట్ డే నుండే ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్ సొంతం చేసుకుని ముందుకు దూసుకెళ్లింది. ఇక ఈ మూవీ దాదాపుగా అన్ని సెంటర్స్ లో కూడా ఆడియన్సు ని మెప్పించి ఓవరాల్ గా రూ. 50 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అందుకుంది. 

డైరెక్షన్, స్క్రీన్‌ప్లే & నటీనటులు

Hit 3 The Third Case OTT (Hit 3 The Third Case Movie Review)

నాచురల్ స్టార్ నాని హీరోగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ 3. ఇటీవల వచ్చిన హిట్ సిరీస్ లోని రెండు సినిమాల అనంతరం రిలీజ్ అయిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుని పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాచురల్ స్టార్ నాని యాక్టింగ్ కి అందరి నుండి మంచి పేరు లభించింది. కెజిఎఫ్ సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్రలో నటించారు. ఇక ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మించాయి. ఓవరాల్ గా ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 114 కోట్ల గ్రా అందుకుంది. 

టెక్నికల్ అంశాలు మరియు మ్యూజిక్

Single OTT (Single Movie Review)

యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ అలానే డ్రాగన్ మూవీ ఫేమ్ ఇవానా హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగిల్. ఈ మూవీని యువ దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించగా గీత ఆర్ట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ముఖ్యంగా ఈ మూవీలో హీరో శ్రీవిష్ణు అలానే కమెడియన్ వెన్నెల కిషోర్ ల కామెడీ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే, ఆ విధంగా వీరిద్దరూ నవ్వులు పూయించారు. ఇక అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసిన సింగల్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 35 కోట్లు కలెక్ట్ చేసింది.    

కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ తెలుగు మూవీ న్యూస్, లేటెస్ట్ రివ్యూస్, గాసిప్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ చూస్తూ ఉండండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow