Little Hearts Review – Mouli’s Fun-filled College Comedy Hits the Right Note

Little Hearts review: A vibrant teen rom-com starring Mouli & Shivani Nagaram delivers consistent laughs and relatable youth romance with quirky memes and deadpan humor

Little Hearts Review – Mouli’s Fun-filled College Comedy Hits the Right Note

లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ (Little Hearts Movie Review) : అలరించే కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ

సినిమా పేరు : లిటిల్ హార్ట్స్ 

విడుదల తేదీ : 5 సెప్టెంబర్ 2025

రేటింగ్ : 3. 5 / 5

నటీనటులు : మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నగరం, రాజీవ్ కనకాల, సత్య కృష్ణన్, అనిత చౌదరి, ఎస్ ఎస్ కాంచి, జై కృష్ణ తదితరులు 

దర్శకత్వం : సాయి మార్తాండ్

నిర్మాత :  ఆదిత్య హాసన్

సంగీతం : శింజిత్ యర్రమిల్లి 

ఫోటోగ్రఫీ : సూర్య బాలాజీ 

ఇటీవల పలు షార్ట్స్ ఫిలిమ్స్ లో నటుడిగా తనకంటూ యువతలో ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాడు యువ నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్. ఇక తాజాగా అతడు హీరోగా యువ దర్శకుడు సాయి మార్తాండ్ దర్శకత్వంలో 90's వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ గ్రాండ్ గా నిర్మించిన లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో యువతలో మంచి ఇంప్రెషన్ అందుకున్న ఈమూవీ నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

లిటిల్ హార్ట్స్ : టచ్‌చేసే యూత్ ప్రేమ కథ, ఆకట్టుకునే సరదా కామెడీ

కథ

తమని పెంచిన తల్లితండ్రులు కోరిన విధంగా చదువులు చదవలేక ఇద్దరు యువతీ యువకులైన అఖిల్ (మౌళి) కాత్యాయని (శివాని) ఇద్దరూ కూడా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు. ఆ విధంగా ఇద్దరి మధ్యన స్నేహం మొదలవడం, ఆ తరువాత అది ప్రేమగా మారడం జరుగుతుంది. ఆ క్రమంలో అప్పటికే ఒక వ్యక్తితో బ్రేకప్ అయిపోయిన కాత్యాయనికి అఖిల్ విషయంలో ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఇంతకీ అది ఏమిటి, మరి వీల్లద్దరి ప్రేమని వారి తల్లితండ్రులు ఒప్పుకున్నారా, అసలు వీళ్ళ చదువులు మరి ఏవిధంగా ముందుకు సాగాయి అనేది మొత్తం కూడా మనం వెండితెరపై చూడాల్సిందే. 

Little Hearts Telugu Movie

ప్లస్ పాయింట్స్ :

గతంలో 90's వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ ఎంతో కనెక్ట్ అయ్యారు. ఆ సిరీస్ లో శివాజీ కుమారుడిగా నటించి తన నటనతో అందరినీ మెప్పించిన మౌళి తొలిసారిగా లిటిల్ హార్ట్స్ ద్వారా ప్రధాన నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముఖ్యంగా తన పాత్రలో ఎంతో చక్కగా సహజంగా పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్నాడు మౌళి. అతడి కామెడీ టైమింగ్, డైలాగ్స్ అయితే మరింత బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చిన ఒక సాంగ్ ఎపిసోడ్ అయితే ఎంతో బాగా కుదిరింది.

Little Hearts Rating

ఇక హీరోయిన్ గా నటించిన యువ నటి శివాని నగరం కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు అలరించే అందం, అభినయంతో ఆకట్టుకుందని చెప్పాలి. ఇటీవల వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో మంచి పేరు అందుకున్న శివాని ఈ మూవీతో మరొక మెట్టు ఎక్కేసిందని చెప్పాలి. పలు కీలక సీన్స్ లో ఆమె నటన ఎంతో బాగుంది. అయితే వీరిద్దరితో పాటు ముఖ్యంగా మౌళి స్నేహితుడిగా కనిపించే జై కృష్ణ ఈ మూవీకి మరొక బలంగా చెప్పవచ్చు.

Little Hearts Review Telugu

అతడి సీన్స్, కామెడీ టైమింగ్ ఎంతో బాగుంది. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో కూడా అతడి సీన్స్ ఎంతో హిలేరియస్ గా అనిపిస్తాయి. ఇక వీరితో పాటు రాజీవ్ కనకాల ఎప్పటిమాదిరిగానే మరొక్కసారి తన పాత్రలో అదరగొట్టారు. తన కొడుకు చదువు కోసం ఎంతో తపన పడే బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఇక ఇతర పాత్రల్లో నటించిన ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ కూడా ఆకట్టుకున్నారు. సెకండ్ హాఫ్ లో చాలా వరకు కథనం మనకు సరదాగా సాగుతుంది. ముఖ్యంగా మనకు పాత రోజులని గుర్తు చేస్తూ సాగుతుంది. 

మైనస్ పాయింట్స్

వాస్తవానికి ఇటువంటి కథల్లో బలమైన స్టోరీ లైన్ అయితే ఉండదు, సరదాగా సాగిపోయే లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కథానుసారం కథనం ముందుకు సాగుతుంది. బలమైన ఎమోషన్స్ కనెక్టివిటీ కావాలనుకునేవారికి ఇది పెద్దగా నచ్చదు. అయితే కథలో పెద్దగా కొత్తదనం ఉండకపోవడంతో పాటు అక్కడక్కడా మాత్రం కొద్దిగా సాగతీతగా అనిపిస్తుంది.

మౌళి డైలాగ్ డెలివరీ, షివాని నగరం యాక్టింగ్, కామెడీ

కొన్ని కామెడీ సీన్స్ రిపీట్ చేసినట్లు అనిపించి సినిమా ల్యాగ్ ఫీల్ వస్తుంది. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం నుండి తీసుకున్న ఈ సినిమా యొక్క టైం లైన్ ప్రకారం యూనిట్ వారు కొన్ని టెక్నీకల్ గా ఆ టైం యొక్క డీటెయిల్స్ ని మిస్ అయినట్లు మనకు అనిపించకమానదు. పెద్దగా ట్విస్ట్ లు అలానే టర్న్ లు లేకుండా సాగె ఈ కథలో ఎమోషన్స్ ఉండవు, మొత్తంగా కామెడీ ప్రధానంగానే సాగుతుంది. ఎక్కువగా సరదా సినిమాలు కోరుకునేవారికి ఇది ఎంతో నచ్చుతుంది. 

సాంకేతిక వర్గం

ముఖ్యంగా మూవీలో ఫోటోగ్రాఫర్ సూర్య బాలాజీ అందించిన విజువల్స్ ఎంతో ఫ్రెష్ గా కొన్ని చోట్ల రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాత ఆదిత్య హాసన్ తన బడ్జెట్ యొక్క పరిధి మేరకు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో లిటిల్ హార్ట్స్ మూవీని గ్రాండ్ గానే నిర్మించారు. సంగీత దర్శకుడు శింజిత్ ఎర్రమిల్లి అందించిన సాంగ్స్ తో పాటు అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విభాగం కూడా బాగానే వర్క్ చేసింది.

ETV Win Film Review

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకడు సాయి మార్తాండ్ గురించి. సినిమాని ఆద్యంతం చక్కని ఆకట్టుకునే కామెడీ సరదాగా ఎంటర్టైనర్ గా నడిపించి థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి మంచి ఫీల్ ని అందిస్తారని చెప్పాలి. స్ట్రాంగ్ ఎమోషన్స్, యాక్షన్ వంటివి లేకపోయినా తీసుకున్న పాయింట్ ని పెద్దగా హంగులు లేకుండా మొత్తం ఎంతో చక్కగా సరదాగా నడిపారు. యువత ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. 

లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ – మౌళి స్టన్నింగ్ కామెడీ అదిరిపోయింది

తీర్పు

ఇక మొత్తంగా నిన్న ఆడియన్స్ ముందుకి వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఆద్యంతం సరదాగా కామెడీ ప్రధానంగా సాగె ఎంటర్టైనర్ అని చెప్పకతప్పదు. అయితే భారీ యాక్షన్, ట్విస్ట్ లు, ఎమోషన్స్ వంటివి లేకుండా ఒక చక్కటి సరదాగా సాగె సినిమా చూసాము అనే ఫీల్ మనకు అందిస్తుంది. దర్శకుడి ప్రతిభతో పాటు యువ నటుడు మౌళి నటన తో పాటు ప్రధానపాత్రధారులు అందరూ కూడా ఆకట్టుకుంటారు. మరి తప్పకుండా ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా ఈ వారం మీ ఫ్యామిలీతో కలిసి మీ సమీప థియేటర్ లో చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. 

Mouli Tanuj Prasanth Little Hearts

మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, న్యూస్, రివ్యూస్, గ్యాలరీస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow