Bigg Boss Telugu Season 9: Start Date, Contestants List, Host & Latest Updates

Bigg Boss Telugu Season 9 latest updates: Expected start date, host confirmation, contestant list rumors, voting details, and everything fans should know.

Bigg Boss Telugu Season 9: Start Date, Contestants List, Host & Latest Updates

ప్రస్తుతం భారతదేశంతో మొత్తం కూడా బిగ్ బాస్ షో అన్ని భాషల ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తూ భారీ టిఆర్పి రేటింగ్స్ తో క్రేజ్ తో కొనసాగుతోంది. ఇక మన తెలుగులో ఇప్పటికే 8 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కొనసాగింది బిగ్ బాస్ షో. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభ తేదీ ఎప్పుడు?

వాస్తవానికి ప్రారంభం నాటి నుండి బిగ్ బాస్ షో పై పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నప్పటికీ మరోవైపు మెజారిటీ ఆడియన్స్ యొక్క క్రేజ్ తో ఈ షో అడ్డంకులు లేకుండా సాగుతోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పై ప్రస్తుతం మన ఆడియన్స్ లో మరింతగా అంచనాలు ఉన్నాయి. 

ఇక ఇటీవల ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నిఖిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. వాస్తవానికి బిగ్ బాస్ షో తెలుగులో సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయి డిసెంబర్ సమయంలో ముగుస్తుంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ లేటెస్ట్ బజ్ ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం మే చివరి వారంలో ప్రారంభం కానుందని అంటున్నారు.  

దానికి కారణం ఈసారి సమ్మర్ సీజన్ లో ఆడియన్స్ ని అలరించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని టాక్. అయితే దీని పై షో నిర్వాహకుల నుండి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక ఈ సీజన్ 9 కి కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నాచురల్ స్టార్ నానిల్లో ఒకరు హోస్ట్ గా వ్యవహరిస్తారు అంటూ ఇటీవల పలు  హల్చల్ చేసాయి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ వివరాలు

అయితే అవేవి కూడా నిజం కాదని, ఈ సీజన్ 9 కి కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునే హోస్ట్ గా ఉండనున్నారని, త్వరలో దానికి సంబంధించి కూడా అఫీషియల్ ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఈసారి మూవీస్ స్టార్స్, టివి స్టార్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ని కూడా ముందు కంటే ఎక్కువమందిని తీసుకునే ఛాన్స్ ఉందట. 

అలానే ఈసారి షోని మరింత ఆసక్తికరంగా నడిపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ మేకర్స్ తమ టీమ్ తో పక్కాగా అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. 

సీజన్ 9లో పాల్గొనే పోటీదారుల ఊహల జాబితా

మరోవైపు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ యొక్క పేర్ల పరిశీలనా కూడా ప్రారంభం అయిందని, మూవీ, టివి స్టార్స్ తో పాటు ఈసారి కూడా పల్వుయూరు యూట్యూబ్ లో పేరుగాందించిన ఒకరిద్దరు కూడా పాల్గొన అవకాశం ఉందని టాక్. 

ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ స్టార్ మా ఈసారి ఈ షో ని మరింత గ్రాండియర్ గా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని వినికిడి. మొత్తంగా త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ తో పాటు షో కి సంబందించిన మరిన్ని అప్ డేట్స్ కోసం తరచు మన సైట్ చూస్తూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow