OG vs Akhanda 2 – Pawan Kalyan and Balakrishna Box Office Clash
Big box office clash between Pawan Kalyan’s OG and Balakrishna’s Akhanda 2. Who will win the Tollywood mass battle this festive season?

టాలీవుడ్ (Tolllywood) సినిమా పరిశ్రమలో ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి అందరికీ మంచి వినోదాన్ని అందించాయి. ఇక గడచిన ఐదు నెలల్లో సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam), డాకు మహారాజ్ (Daaku Maharaaj) మొదలుకుని ఇటీవల మ్యాడ్ స్క్వేర్, సింగల్ వరకు సక్సెస్ అందుకుని బయ్యర్స్ కి ప్రొడ్యూసర్స్ కి బాగానే లాభాలు తీసుకువచ్చాయి.
అయితే రానున్న ఈ ఎనిమిది నెలల్లో ముఖ్యంగా దసరా పండుగ అత్యంత కీలకం. మనకు ఏడాదిలో వచ్చే అన్ని పండగల్లోకి ప్రారంభంలో సంక్రాంతికి అలానే దసరాకి సినిమాల యొక్క రిలీజ్ లతో సందడి నెలకొని ఉంటుంది. కాగా రానున్న ఈ ఏడాది దసరా పండుగకి టాలీవుడ్ స్టార్ నటులైన నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ల సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.
OG vs అఖండ 2 – పవన్ vs బాలయ్య పోటీ
అవి ఒకటి అఖండ 2 (Akhanda 2) కాగా మరొకటి ఓజి (OG). ఈ రెండు సినిమాల పై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ముందుగా అఖండ 2 గురించి మాట్లాడుకుంటే, 2021 డిసెంబర్ రిలీజ్ అయి అతి పెద్ద విజయం నమోదు చేసిన అఖండ మూవీకి ఇది అఫీషియల్ సీక్వెల్ అనేది తెలిసిందే.
దీనిని బోయపాటి శ్రీను తీస్తుండగా అందాల యువ నటి సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట,రామ్ ఆచంట గ్రాండ్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న అఖండ 2 మూవీ ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకుంది.
హిమాలయాల్లోని కొన్ని కీలక ప్రాంతాలతో పాటు మన దేశంలోని పలు ప్రదేశాల్లో ఈ మూవీ యొక్క షూటింగ్ చేస్తోంది టీమ్. బాలకృష్ణ ఇందులో కూడా రెండు పాత్రల్లో కనిపించనుండగా అఘోర పాత్ర ఫస్ట్ పార్ట్ కంటే మరింత పవర్ఫుల్ గా ఉండనున్నట్లు టాక్. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఆ పాత్రని ఎంతో అద్భుతంగా రాసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అఖండ నుండి తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ అందరినీ ఆకట్టుకుని సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరేలా చేసింది. మరోవైపు దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ, సంగీత దర్శకుడు థమన్ సహా టీమ్ మొత్తం కూడా అఖండ 2 ని పక్కాగా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి గ్రాండ్ గా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
టాలీవుడ్‌లో ఓజి vs అఖండ 2 బాక్సాఫీస్ పోరు
బాలకృష్ణ నటిస్తున్న ఏఈ మూవీని పాన్ ఇండియన్ రేంజ్ లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తుండడంతో పాటు అఖండ మూవీ ఇటీవల హిందీలో ప్రదర్శితమై అక్కడి ఆడియన్స్ ని కూడా అలరించడంతో అన్ని భాషల్లో దీనిని సక్సెస్ చేసేందుకు టీమ్ కృషి చేస్తోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న మూడు సినిమాల్లో సుజీత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామా యాక్షన్ మూవీ ఓజి (They Call Him OG) కూడా ఒకటి.
ఈ మూవీ పై మొదటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీకి కూడా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఓజి మూవీకి సంబంధించి కొద్దిపాటి మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ చేస్తోంది టీమ్. అలానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా కానిస్తున్నారు.
Balakrishna Akhanda 2 Release Date
ఈ మూవీలో ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ కనిపించనుండగా ఆయనకు జోడిగా నటి ప్రియాంక మోహన్ (Priyanka Mohan) కనిపించనున్నారు. పవన్ కు ఎంతో పెద్ద అభిమాని అయిన సుజీత్ దీనిని ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ని ఎంతో అలరించేలా ప్రతి విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.
విడుదల తేదీలు, అభిమానుల అంచనాలు
మరోవైపు సంగీత దర్శకుడు థమన్ కూడా ఓజి మూవీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయమై ఎంతో శ్రద్ధ తీసుకున్నారట. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని విపరీతంగా మూవీ పై అంచనాలు పెంచేసింది. ఇక తమ మూవీని కూడా పక్కాగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేసేలా టీమ్ కసరత్తు చేస్తోంది.
అయితే వచ్చిన చిక్కు ఏమిటంటే అటు అఖండ 2 ఇటు ఓజి మూవీస్ రెండూ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ టీమ్స్ నుండి అధికారిక ప్రకటనలు రావడంతో పవన్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ కొంత ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి ఈ రెండు సినిమాల పై వారి ఫ్యాన్స్ తో పాటు సినిమా పరిశ్రమలో కూడా చెప్పలేనంత క్రేజ్ ఉంది.
మరి నిజంగానే ఈ రెండు అదే రోజున రిలీజ్ అవుతాయా అంటే అవుననని అంటున్నారు. మరోవైపు రెండు సినిమాల నిర్మాతలు కూడా ప్రస్తుతం వెనక్కు తగ్గే ఆలోచనలో లేరని టాక్. వాస్తవానికి ఈ డేట్ ని మొదట అఖండ 2 లాక్ చేయగా తాజాగా ఓజి టీమ్ కూడా అదే డేట్ న రిలీజ్ అంటూ అనౌన్స్ చేసారు. అయితే వీటి విడుదలకు మరొక మూడు నెలల సమయం ఉండడంతో అప్పటికి పరిస్థితులు మారే అవకాశం ఉందని అనేవారు కూడా లేకపోలేదు.
అయితే రెండు సినిమాలు దసరా కానుకగా ఒకే రోజు రిలీజ్ అయినా పెద్ద సమస్య ఏమి లేదని, ఏ సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఆ సినిమా చూస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంతకీ అటు ఓజి ఇటు అఖండ 2 రిలీజ్ విషయం ముందు ముందు ఎలా సాగుతుంది, పక్కాగా ఇవి రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా ఈ రెండు సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకోవాలని మా టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






