Top 10 Trending Telugu Movie Songs of 2025 – Add These to Your Playlist Now!
Listen to the trending Telugu movie songs of 2025. Curated playlist of the latest hits.

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాలో మ్యూజిక్ విషయమై ఎప్పటికప్పుడు ఆయా మూవీస్ మేకర్స్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ విధంగా ఒక మూవీ యొక్క సక్సెస్ లో మ్యూజిక్ కూడా కొంత భాగం పాత్ర వహిస్తోంది. అటు సాంగ్స్ తో పాటు ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటే ఆడియన్స్ ఫ్యాన్స్ ఆయా సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అందుకే పెద్ద స్టార్స్ దగ్గరి నుండి చిన్న సినిమాల వరకు అందరూ కూడా తమ సినిమాల యొక్క సాంగ్స్ విషయంలో మాత్రం మరింత కేర్ తీసుకుంటున్న ఘటనలు చూస్తున్నాం. ఆ విధంగా పలు సాంగ్స్ కూడా ఎప్పటికప్పుడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో టాప్ లో నిలుస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఆ విధంగా 2025 టాప్ 10 తెలుగు మూవీస్ సాంగ్స్ లేవనేది ఇప్పుడు చూద్దాం.
టాప్ 10 ట్రెండింగ్ తెలుగు మూవీ సాంగ్స్ 2025 లిస్ట్ :
1. ప్రేమ వెల్లువ (HIT: The Third Case) :
తాజాగా నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మిక్కీ జీయర్ కంపోజ్ చేసిన ఈ అద్భుతమైన మెలోడియస్ సాంగ్ ని సిద్ శ్రీరామ్, నూతన మోహన్ అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యువతని నాని ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్ తో పాటు ఇతర సంగీత మాధ్యమాల్లో మంచి క్రేజ్ తో కొనసాగుతోంది.
2. సింగిల్ (Single) :
యువ సక్సెస్ఫుల్ నటుడు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగిల్. ఈ మూవీని లేటెస్ట్ గా రిలీజ్ అయిన సింగిల్ అనే పల్లవితోసాగే సాంగ్ యువతని ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలోని యాజిన్ నజీర్ అద్భుతంగా పాడిన శిల్పి ఎవరో అనే సాంగ్ బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసారు.
3. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ : (HIT: The Third Case)
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి కథానాయికగా శైలేష్ కొలను తీసిన హిట్ 3 మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలోని దాదాపుగా సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకోగా ఇందులోని అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ సహా పలు సంగీత మాధ్యమాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. హీరో క్యారెక్టర్ కి సంబందించిన ఈ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు.
2025 తెలుగు సినిమా పాటల ట్రెండింగ్ ప్లేలిస్ట్
4. రాబిన్ హుడ్ (Robinhood) :
నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల తీసిన రాబిన్ హుడ్ మూవీ ఇటీవల రిలీజ్ అయింది. ఇందులోని సాంగ్స్ అన్ని బాగానే క్రేజ్ అందుకున్నాయి. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ అయిన రాబిన్ హుడ్ సాంగ్ ని జివి ప్రకాష్ కుమార్, దివాకర్ కలిసి అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ యువతని ఎంతో అలరిస్తోంది.
5. దర్శనమే (Naari Naari Naduma Murari) :
యువ వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ నారి నారి నడుమ మురారి. ఈ మూవీ నుండి విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన దర్శనమే సాంగ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ యూట్యూబ్ తో సహా పలు మాధ్యమాల్లో బాగా క్రేజ్ అందుకుంటోంది.
6. బుజ్జి తల్లి (Thandel) :
యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ తండేల్. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఆల్బమ్ మొత్తం కూడా ఎంతో పాపులర్ అయింది. ముఖ్యంగా జావేద్ ఆలీ పాడిన బుజ్జి తల్లి సాంగ్ అయితే యువత మనసులని విశేషంగా తాకింది. సినిమా వచ్చి చాలా రోజులు అయినప్పటికీ ప్రస్తుతం ఈ సాంగ్ సంగీత మాధ్యమాల్లో మంచి క్రేజ్ తో కొనసాగుతుండడం విశేషం.
తాజా హిట్ పాటలు మరియు సంగీత దర్శకులు
7. చుట్టమల్లే (Devara Part 1) :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తీసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ రవిచంర్ అందించిన ఆల్బమ్ సూపర్ గా రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో చుట్టమల్లే సాంగ్ అన్ని భాషల్లో కూడా ఎంతో పాపులర్ అయింది. ఈ సాంగ్ ని శిల్ప రావు అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఇంకా ఈ సాంగ్ పలు మాధ్యమాల్లో బాగా క్రేజ్ తో కొనసాగుతోంది.
8. పీలింగ్స్ (Pushpa 2 The Rule) :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన పుష్ప 2 ది రూల్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ మూవీలోని సాంగ్స్ కూడా విశేషంగా పాపులర్ అయ్యాయి. అయితే ఇందులోని పీలింగ్స్ సాంగ్ యువత తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని శంకర్ బాబు కందుకూరి, లక్ష్మి దాసా అద్భుతంగా ఆలపించారు.
9. ఫియర్ సాంగ్ (Devara Part 1) :
టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీసిన దేవర మూవీతో పాటు అందులోని సాంగ్స్ కూడా ఎంతో ఆదరణ అందుకున్నాయి. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలోని ఫియర్ సాంగ్ యువతని ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ సాంగ్ ఇక పలు సంగీత మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. ఈ సాంగ్ ని అనిరుద్ స్వయంగా అద్భుతంగా పాడారు.
సంగీత ప్రియుల కోసం టాప్ 10 పాటలు
10. నా నా హైరానా (Game Changer) :
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ తీసిన గేమ్ చేంజర్ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ
సినిమా సక్సెస్ కానప్పటికీ సాంగ్స్ బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కార్తీక్, శ్రేయ ఘోషల్ కలిసి అద్భుతంగా ఆలపించిన నానా హైరానా సాంగ్ ఇంకా కూడా పలు సంగీత మాధ్యమాల్లో యువతని విశేషంగా అలరిస్తోంది.
What's Your Reaction?






