Telugu Cinema Latest News – Breaking Updates & Trends
Telugu Cinema Latest news, exclusive updates, movie releases, celebrity buzz, and Tollywood trends in one place, Catch all the latest

ఈ ఏడాది కొన్నాళ్లుగా మనం పరిశీలించినట్లయితే తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా రిలీజ్ సినిమాల్లో దాదాపుగా చాలావరకు బాక్సాఫీస్ వద్ద బాగా విజయవంతం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలుగా రిలీజ్ అయిన Mad Square, Little Hearts వంటివి ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొంది ఆడియన్సు ని అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమాలు ఎంతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద నిర్మాతలు, బయ్యర్లకు భారీగా కాసులు కురిపించాయి.
అలానే ఇటీవల రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన OG, రిషబ్ హీరోగా నటిస్తూ తెరకెక్కించిన Kantara Chapter 1, బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల Kishkindhapuri, యువ నటుడు తేజ సజ్జ తో కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన Mirai సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాగా లాభాలు కూడా అందించాయి. అయితే మరొక మూడు నెలల్లో పూర్తి కానున్న ఈ ఏడాది, అలానే ఆపైన త్వరలో మన ముందుకు రానున్న లేటెస్ట్ టాలీవుడ్ మూవీస్ యొక్క న్యూస్ అప్ డేట్స్ ని ఇప్పుడు చూద్దాం.
SSMB29 :
సరిగ్గా ఏడాదిన్నర క్రితం GunturKaaram మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ Mahesh Babu. దాని అనంతరం తొలిసారిగా పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు మహేష్. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేస్తోన్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29.
ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీ 2027 ద్వితీయార్ధంలో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక రానున్న నవంబర్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో పాటు టైటిల్ ని కూడా టీమ్ అనౌన్స్ చేయనుంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
తెలుగు సినిమా లేటెస్ట్ న్యూస్ అప్ డేట్స్ 2025
AA 22 :
Pushpa 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ Allu Arjun తాజాగా అట్లీ దర్శకత్వంలో ఒక భారీ మూవీ చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ భాగం కానున్నారు. బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటించే ఛాన్స్ ఉంది.
ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తుండగా దీనిని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ 2027 ప్రథమార్థంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఈ సినిమా ప్లేస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఒక మూవీ చేయాల్సి ఉండగా దాని స్థానంలోకి AA22 వచ్చి చేరింది.
Ntr Neel Movie (Dragon) :
టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ JrNtr హీరోగా ప్రస్తుతం కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్ రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఆల్మోస్ట్ అదే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. తాజాగా ఒక మీడియా మీట్ లో భాగంగా నిర్మాతలు నవీన్, రవిశంకర్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ, వచ్చే ఏడాది Dragon మూవీని ఆడియన్సు ముందుకి తీసుకురానున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఈ మూవీ 2026 జూన్ 25న రిలీజ్ కావాల్సి ఉండగా మరికొన్నాళ్లు వాయిదా పడే ఛాన్స్ కనపడుతోంది.
The Rajasaab :
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాక్టర్ రెబల్ స్టార్ Prabhas హీరోగా మారుతీ తీస్తున్న కామెడీ హర్రర్ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధర్నా ప్రేక్షకుల్లో కూడా ది రాజాసాబ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ తో పాటు ట్రైలర్ తో మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు.
తెలుగు సినిమా లేటెస్ట్ అప్ డేట్స్, న్యూస్, గ్యాలరీ
Ustaad Bhagat Singh :
ఇటీవల Hari Hara Veera Mallu, They Call Him OG సినిమాల ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే వీటిలో హరి హర వీర మల్లు డిజాస్టర్ కాగా OG విజయవంతం అయింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా సుజీత్ దీనిని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ అనంతరం మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో తమిళ నటుడు పార్థిపన్ కీలక పాత్ర చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో యువ అందాల కథానాయికలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈమూవీలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
Peddi :
మెగాపవర్ స్టార్ Ramcharan ఇప్పటికే ఈ ఏడాది Game Changer మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ ఘోరంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాని అనంతరం ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ అందుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన పెద్ది మూవీ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 సమ్మర్ కానుకగా మార్చి 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకురానున్నారు.
టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్స్, న్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్
The Paradise :
నాచురల్ స్టార్ Nani హీరోగా ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల తీస్తున్న యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీలో నటప్రపూర్ణ మంచు మోహన్ బాబు విలన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ ద్వారా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 26న రిలీజ్ కానుంది.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ కొన్నాళ్ల పాటు వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్. ఇక గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ పెద్ద హిట్ కావడంతో ది ప్యారడైజ్ మూవీ పై అంచనాలు మరింతగా ఏర్పడ్డాయి. ఇందులో జడల్ అనే విభిన్న పాత్రలో నాని కనిపించనున్నారు. సోనాలి కులకర్ణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
Mass Jathara :
మాస్ మహారాజ Raviteja హీరోగా శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ కమర్షియల్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ మాస్ జాతర. ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ తో పాటు టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అందరిలో బాగా అంచనాలు ఏర్పరిచాయి. రవితేజ ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయన నుండి ఫ్యాన్స్ తో ఆడియన్సు కోరుకునే అన్ని అంశాలతో దర్శకుడు భాను దీనిని తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. ఇటీవల వరుసగా పరాజయాలతో కొనసాగుతున్న హీరో రవితేజ కి మాస్ జాతర మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ తో బ్రేక్ ఇవ్వడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, న్యూస్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, గ్యాలరీస్ కోసం ఎప్పటికప్పుడు మా తెలుగు మూవీ మీడియా సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.
What's Your Reaction?






