Single Movie Review: Sree Vishnu's Comedy-Drama Delivers Laughs with Heart

Sree Vishnu's "Single" offers a delightful blend of humor and emotion. With standout performances and engaging storytelling, it's a must-watch for Telugu cinema enthusiasts.

Single Movie Review: Sree Vishnu's Comedy-Drama Delivers Laughs with Heart

శ్రీ విష్ణు సింగిల్ : ఇంటిల్లిపాది చూదగ్గ ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్ 

Telugumoviemedia.com Rating : 3. / 5

మూవీ పేరు : సింగిల్ ( #Single )

విడుదల తేదీ : 9 మే 2025

నటీనటులు : శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు 

దర్శకత్వం : కార్తీక్ రాజు 

నిర్మాతలు : విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి

సంగీతం : విశాల్ చంద్రశేఖర్ 

ఫోటోగ్రఫి : ఆర్, వేల్రాజ్ 

శ్రీవిష్ణు 'సింగిల్' మూవీ సమీక్ష – హాస్యంతో కూడిన చిత్రం

తాజాగా యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా సింగిల్. ఇక ఇటీవల కెరీర్ పరంగా మంచి పేరుతో పాటు సక్సెస్ లతో కొనసాగుతున్నారు శ్రీవిష్ణు. ఇటీవల ఆయన నటించిన సామజవరగమనా, స్వాగ్ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో సింగిల్ పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకోవడంతో ఇది మంచి వినోదాత్మకంగా సాగె చిత్రం, కాబట్టి తప్పకుండా చూడాలని పలువురు ఆడియన్స్ ఎదురుచూడసాగారు. మొత్తంగా నేడు మంచి అంచనాల నడుమ నేడు రిలీజ్ అయిన Single మూవీ కథ, కథనాలు ఎలా ఉన్నాయి, పూర్తి రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. Single Movie Review  

కథ : 

ముందుగా కథ ప్రకారం ఒక బ్యాంకు ఉద్యోగి అయిన విజయ్ (Sree Vishnu) తన తొలిచూపులోనే పూర్వ నెట్టెం (Ketika Sharma) తో ప్రేమలో పడతాడు. అనంతరం ఆమె ప్రేమను ఎలాగైనా పొందాలని పలు ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఆదే సమయంలో హరిణి (Ivana) అతడి వెంట పడుతుంది, అతడిని ప్రేమిస్తుంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు అసలు హరిణి ఎవరు అనేది విజయ్ కి అలానే విజయ్ ఎవరు అనేది పూర్వ కి తెలుస్తుంది. మరి ఆ తరువాత విజయ్ జీవితంలో ఏమి జరిగింది. తనని ప్రేమించిన హరిణి ని విజయ్ ప్రేమించి వివాహం చేసుకుంటాడా, లేక తాను ప్రేమించిన పూర్వని వివరం చేసుకుంటాడా, ఆపై కథ ఎలా సాగింది అనేది మొత్తం కూడా సింగిల్ మూవీలో వెండితెర పై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఈ మూవీ ద్వారా మరొక్కసారి తనలోని ఆకట్టుకునే కామెడీ కోణంతో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు యువ నటుడు శ్రీ విష్ణు. గతంలో అల్లూరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ గా నటించి అలరించిన శ్రీ విష్ణు, అనంతరం సామజవరగమనా ద్వారా తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం సింగిల్ మూవీలో ఆయన పండించిన హాస్యం నటన, డైలాగ్స్ యువతని అలానే అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఆయనకు కామెడీ కింగ్ వెన్నెల కిషోర్ కూడా జత కలవడంతో వారిద్దరి కామెడీ సీన్స్ వెండి తెర పై ఎంతో బాగున్నాయి. ఇక తన పాత్ర యొక్క పరిధి మేరకు కేతిక శర్మ ఆకట్టుకోగా, ఇవాన కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. వారి మధ్య సన్నివేశాలు బాగానే పండాయి. వీరితో పాటు వీటివి గణేష్ కనిపించే సీన్స్ కూడా మనకు మంచి నవ్వు తెప్పిస్తాయి. 

కథా నేపథ్యం – స్నేహితుల మధ్య హాస్య ప్రయాణం

మైనస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కథలని ఒక దర్శకుడు ఎంచుకొన్నపుడు దానికి కొంత బలమైన పాయింట్ కూడా ఎంచుకుని ఉంటె కథనం మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది, అది ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది. అయితే అదే ఈ మూవీలో మిస్ అయింది. సినిమా చాలా వరకు నార్మల్ కథ కథనాలతో సాగుతుంది అంతే. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ కూడా మొదట ప్రారంభం అయినపుడు మంచి హాస్యం, ఎంటర్టైన్మెంట్ తో సాగుతూ మెల్లగా పస తగ్గుతుంది. రెండు భాగాలూ మనకు అలానే అనిపిస్తాయి. హీరోయిన్స్ గా నటించిన కేతిక శర్మ, ఇవానా ఇద్దరూ బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ హీరోతో పాటు వారికి ఉండే కనెక్టివిటి సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుంటే బాగుండేదనిపించింది. ఇక సాంగ్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ కనిపించే సీన్స్ బాగానే ఉన్నాయి. 

సాంకేతిక అంశాలు – సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

సాంకేతిక విభాగం : 

దర్శకుడు కార్తీక్ రాజు ఈ మూవీ యొక్క కథని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ విధానంలో ముందుకు నడిపిన విధానం అంతా బాగున్నప్పటికీ 
దానికి మరింత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. కొందరు ఆడియన్స్ అయితే దీనిని సామజవరగమనా తో కంపేర్ చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఆ మూవీ మరింత ఎక్కువ మార్కులు అందుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, అలానే ఎడిటింగ్ విభాగం పని తీరు కూడా బాగుంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మూవీ అలానే తక్కువ రన్ టైం ఉంది కాబట్టి అంతకంటే కట్ చేయాల్సిన సీన్స్ అని ఏమి అనిపించవు. సాంగ్స్ మరింత క్యాచీగా ఉంటె బాగుండేది. నిర్మాతల యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా మొత్తం మంచి ఇంట్రెస్టింగ్ ఫీల్ ఇస్తుంది.  

తీర్పు :   

మొత్తంగా శ్రీ విష్ణు కథానాయకుడిగా యువ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సింగిల్. ఇంటిల్లిపాది సరదాగా వెళ్లి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం అని చెప్పాలి. అయితే బలమైన ఎమోషన్స్, యాక్షన్, ఎలివేషన్స్ వంటి అంశాలు కోరుకునే వారికి ఇది పర్వాలేదనిపిస్తుంది. ఇక ఎక్కడా కూడా అసభ్యత లేకుండా సున్నితంగా హాస్యంతో సినిమాని నడిపారు. ఓవరాల్ గా వీలైతే ఈ వారాంతంలో ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో చూసి ఆనందించండి. అలానే ఇటువంటి మరిన్ని తెలుగు మూవీ న్యూస్, రివ్యూస్ కోసం మా Telugu Movie Media వెబ్ సైట్ ని చూస్తూ ఉండండి, థాంక్యూ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow