Top 10 Tollywood Heroines List | Best Actresses in Telugu Cinema 2025

Discover the top 10 heroines of Tollywood in 2025. From established stars to rising talents, explore the best actresses in Telugu cinema. Get the latest updates on their careers, movies, and more.

Top 10 Tollywood Heroines List | Best Actresses in Telugu Cinema 2025
తెలుగు సినిమా  పరిశ్రమలో ఇప్పటివరకు అనేక మంది నటీమణులు హీరోయిన్స్ గా వచ్చి మంచి పేరు దక్కించుకున్న వారు ఉన్నారు. కాగా వారిలో మరికొందరు  అయితే భారీ స్థాయి క్రేజ్, ప్రేక్షకాదరణ తో ప్రేక్షకాభిమానులు హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమా పరిశ్రమలోని హీరోయిన్స్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 10 హీరోయిన్స్ గురించి మనం చెప్పుకుందాం. 
1. అనుష్క శెట్టి :- (Anushka Shetty)
స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క శెట్టి ఆ తరువాత నాగార్జున తోసహా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కి యోగా లో శిక్షణ ఇవ్వడం, అనంతరం దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెని చూడడం జరిగిందట. ఆ తరువాత నాగార్జున, సోను సూద్ లతో తాను తీయదల్చిన సూపర్ మూవీలో అనుష్క కి షాషా అనే పాత్ర అఫర్ చేసారు పూరి. అప్పట్లో ఆ సినిమా పర్వాలేదనిపించే విజయం సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా ఛాన్స్ లు అందుకుంటూ దూసుకెళ్లిన అనుష్కకి ఆపైన సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ, అరుంధతి స్టోరీ చెప్పడం జరిగింది. స్టోరీ విన్న తరువాత కొంత ఆలోచన చేసిన అనుష్క, అనంతరం యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. రిలీజ్ తరువాత అరుంధతి అప్పట్లో అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా అనుష్క కి భారీ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టింది. అక్కడి నుండి తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు అందుకుంటూ కొనసాగిన అనుష్క అనేక సక్సెస్ లు అందుకున్నారు. ఇటీవల బాహుబలి సినిమాలో దేవసేనగా నటించి అందరి నుండి బాగా పేరు అందుకున్న అనుష్క ఇటీవల భాగమతి, నిశ్శబ్దం సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 
2. సమంత :-  (Samantha Ruth Prabhu)
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో దాదాపుగా ఎక్కువ శాతం సక్సెస్ రేట్ కలిగిన నటి ఎవరు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సమంత. తొలిసారిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలో జెస్సి పాత్రతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సమంత, ఆ తరువాత నుండి అనేక బడా సినిమాల్లో ఛాన్స్ లు అంధకుని పలు సక్సెస్ లతో దూసుకెళ్లారు. ఆపిన అటు తమిళ్ లో కూడా స్టార్ నటుల సరసన పౌ సినిమాలు చేసి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న సమంత, ఇటీవల ఓ బేబీ, యు టర్న్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ తో ఆమె చేస్తున్న శాకుంతలం సినిమా  చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. 
3. తమన్నా :- (Tamannaah Bhatia)
టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ గా పేరు గాంచిన తమన్నా భాటియా తొలిసారిగా మంచు మనోజ్ హీరోగా రూపొందిన శ్రీ మూవీ ద్వారా నటిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం శేఖర్ కమ్ముల అంతా కొత్త వారితో తీసిన హ్యాపీ డేస్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి ఆ సినిమా ద్వారా భారీ సక్సెస్ దక్కించుకున్న తమన్నా అక్కడి నుండి ఒక్కొక్కటిగా తెలుగులో అవకాశాలు అందుకున్నారు. ఆపైన ఎందరో టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా నటించి విజయాలు దక్కించుకున్న తమన్నా, అటు తమిళ్, హిందీ లో కూడా కొన్ని సినిమాలు చేసి తద్వారా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల అక్కడక్కడా కొన్ని సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ లో కూడా యాటిక్ చేస్తున్న తమన్నా పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె బుల్లితెరపై మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్స్ | 2025లో బెస్ట్ తెలుగు సినీ నటి

4. పూజా హెగ్డే :- (Pooja Hegde)
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా ఛాన్స్ లతో దూసుకెళ్తున్న నటి పూజా హెగ్డే. తొలిసారిగా నాగ చైతన్య తో విజయ్ కుమార్ కొండా తీసిన ఒక లైలా కోసం మూవీతో హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ముకుందా అలానే హృతిక్ రోషన్ తో ఆమె చేసిన మోహెన్జదారో సినిమాలు కూడా ఫ్లాప్స్ గా నిలిచి ఆమె కెరీర్ ని కొంత ఇబ్బందుల్లోకినెట్టాయి. ఆ తరువాత అల్లు అర్జున్ తో డీజే సినిమా చేసిన పూజా తద్వారా  విజయం దక్కించుకున్నారు. అయితే అదే టైం లో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత మూవీ లో యాక్ట్ చేసి దానితో సూపర్ హిట్ కొట్టిన పూజా, ఆపైన సూపర్ స్టార్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో గడ్డలకొండ గణేష్ తో పాటు ఇటీవల అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో వంటి వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తున్నారు. 
5. రష్మిక మందన్న :- (Rashmika Mandanna)
రష్మిక మందన్న తొలిసారిగా చలో సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రంగప్రవేశం చేసింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. అనంతరం విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, ఆపైన మహేష్ తో సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు చేసిన రష్మిక వాటితో అధ్ పెద్ద బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకుల్లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు రష్మిక కి యువతలో విశేషమైన కే క్రేజ్ ఉంది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా ఇటీవల తెలుగు కొద్దిగా నేర్చుకుని తన సినిమాలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్న రష్మిక ఇటీవల నితిన్ హీరోగా వెంకీ కుడుములు తీసిన భీష్మ, అలానే కార్తీ హీరోగా రూపొందిన సుల్తాన్ సినిమాలతో రెండు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆమె పుష్ప సినిమా చేస్తున్నారు. 
6. కాజల్ అగర్వాల్ :- (Kajal Aggarwal)
టాలీవుడ్ కి లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా తెరంగేట్రం చేసిన కాజల్, ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర మూవీ లో నటించి దానితో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అక్కడి నుడి ఇటు తెలుగుతో పాటు కాజల్ కి అటు తమిళ్ లో కూడా వరుసగా ఛాన్స్ లు దక్కించుకుని తద్వారా పలు సూపర్ హిట్స్ కొట్టారు. ఇక ఆ తరువాత నుండి హీరోయిన్ గా మరింతగా దూసుకెళ్లిన కాజల్ కి యువతలో విశేషమైన ఆదరణ ఉంది. ఇక ఇటీవల గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య, అలానే లోకనాయకుడు కమల్ హాసన్ తో ప్రముఖ దర్శకుడు శంకర్ తీస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఇండియన్ 2 లో కూడా యాక్ట్ చేస్తున్నారు. మొదటి నుండి కూడా తన ఆకట్టుకునే అందంతో పాటు తనకు లభించిన పాత్రల్లో అద్భుతమైన యాక్టింగ్ చేసే కాజల్ తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమి  లేవని,అయితే తనకు వచ్చిన పాత్రలకి పూర్తి న్యాయం చేయాలనేదే తన భావన అని అంటూ ఉంటారు. 

2025లో టాప్ టాలీవుడ్ హీరోయిన్స్ పూర్వం మరియు ప్రస్తుతాలు

7. కీర్తి సురేష్ :- (Keerthy Suresh)
యంగ్ హీరో రామ్ తో చేసిన నేను, శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, ఆ సినిమా తో మంచి సక్సెస్ కొట్టారు. కిశోరె తిరుమల ఎంతో ఆకట్టుకునేలా తీసిన ఈ సినిమాలో తన నటన, అందంతో  అందరినీ ఆకట్టుకున్నారు కీర్తి సురేష్. ఇక ఆ తరువాత నాని తో నేను లోకల్ సినిమాలో యాక్ట్ చేసి మరొక హిట్ కొట్టిన కీర్తి ఆపైన ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేసారు. అయితే అనంతరం నాగ అశ్విన్ తీసిన మహానటి మూవీలో దిగ్గజ సీనియర్ నటి సావిత్రి పాత్రలో నటించి అందరినీ మెప్పించి ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు కీర్తి. ఇక తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకునేలా యాక్ట్ చేసే కీర్తి సురేష్ కి అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తో సర్కారు వారి పాట, రజినీకాంత్ తో అన్నాత్తే సినిమాలు చేస్తున్నారు కీర్తి సురేష్. 
8. రాశి ఖన్నా :- (Raashii Khanna)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా అక్కినేని ఫామిలీ హీరోలు నటించిన మనం సినిమా ద్వారా చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా, ఆ మూవీ సక్సెస్ అనంతరం యువ నటుడు నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన లవ్ ఫామిలీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుస లాడే మూవీ మూవీతో మంచి సక్సెస్ కొట్టారు. అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన రాశి, ఆపైన పలు సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. ఇక కెరీర్ లో మొదటి నుడి అటు రొమాంటిక్ రోల్స్ తో పాటు ఇటు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటిగా తనకంటూ ప్రేక్షకాభిమానుల్లో ప్రత్యేమైన గుర్తింపుని దక్కించుకున్న రాశి ఖన్నా, ఇటీవల వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే, అలానే ఇటీవల నాగ చైతన్య తో వెంకీ మామ వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఇక అటు తమిళ్ లో కూడా  పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన రాశి ఖన్నా ప్రస్తుతం మరిన్ని ఛాన్స్ లతో దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా ఆమె గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే మూవీ చేస్తున్నారు. 

2025 టాలీవుడ్ నటీమణులు వారి సినిమా కెరీర్ పై సమగ్ర విశ్లేషణ

9. శృతి హాసన్ :- (Shruti Haasan)
కమల్ హాసన్ కూతురిగా ఫస్ట్ టైం సిద్దార్ధ హీరోగా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు మూవీ ద్వారా టాలీవుడ్ కి తెరంగేట్రం చేసిన శృతి హాసన్ సినిమాలో తన అందంతో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. ఆపైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె యాక్ట్ చేసిన గబ్బర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి హీరోయిన్ గా ఆమెకు పెద్ద బ్రేక్ ని అందించింది. ఇక అక్కకి నుండి ఇటు తెలుగు తో పాటు అటు తమిళ్, అలానే హిందీ భాషల్లో కూడా పలు సినిమా ఛాన్స్ లు అన్ధకున్న శృతి హాసన్, ఆపైన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు అలానే ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమాలు చేసారు. ఇక అటు తమిళ్ లో సూర్య, ధనుష్ వంటి స్టార్స్ తో కూడిన యాక్ట్ చేసిన శృతి హాసన్ తన కెరీర్ లో ఫస్ట్ టైం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక దీనితో పాటు తమిళ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న లాభం సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు శృతి. 

10. రకుల్ ప్రీత్ సింగ్ :- (Rakul Preet Singh)
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ తో పాటు అవకాశాలతో కూడా దూసుకెళ్తున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ కూడా ఒకరు అనే చెప్పాలి ఇక తన కెరీర్ ని తొలిసారిగా కెరటం సినిమా ద్వారా ప్రారంభించిన రకుల్, ఆ తరువాత వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, అలానే లౌక్యం వంటి సూపర్ హిట్స్ తో అందరి నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి తెలుగు లో వరుసగా ఛాన్స్ లు సొంతం చేసుకున్న రకుల్, అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా పలు అవకాశాలతో దూసుకెళ్లారు. తెలుగులో దాదాపుగా అందరు స్టార్ నటులతో కూడా యాక్ట్ చేసిన రకుల్ ప్రస్తుతం కమల్ తో శంకర్ తీస్తున్న ఇండియన్ 2 మూవీలో కూడా నటిస్తున్నారు .ఇక ఇటీవల వైష్ణవ్ తేజ్ తో క్రిష్ తీసిన కొండపొలం సినిమాలో నటించిన రకుల్ ఆ సినిమా ద్వారా మంచి విజయం అందుకున్నారు. ఇక లేటెస్ట్ గా ఆమె పలు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఛాన్స్ లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow