Pawan Kalyan Elections Impact on His Movie Career

How Pawan Kalyan's political journey is affecting His Movie Career in 2025.

Pawan Kalyan Elections Impact on His Movie Career

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అటు సినిమాలు ఇటు రాజకీయాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ తన రాజకీయ కార్యక్రమాలతో ఏమాత్రం తీరిక లేకుండా పలు పనులు చేస్తూ కొనసాగుతున్నారు. 

మరోవిప్పు ఆయన చేతిలో ప్రస్తుతం మొత్తంగా మూడు సినిమాలు ఉన్నాయి. అవి సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి, మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ గారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న తమిళ మూవీ తేరి రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్. 

పవన్ కళ్యాణ్ – రాజకీయాలు vs సినిమాలు

వీటితో పాటు ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మాణంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత గ్రాండ్ గా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్న హరి హర వీర మల్లు పార్ట్ 1. అయితే ఈ మూడు సినిమాలకు సంబందించి ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది. వాస్తవానికి వీటిలో హరి హర వీర మల్లు మూవీ ఈ ఏడాది మే 9 న సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది. 

ఆ సినిమాకు సంబంధించి తన పార్ట్ యొక్క బ్యాలెన్స్ షూట్ నిమిత్తం పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా కేటాయించారు. ఐతే అనుకోకుండా కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం బారిన పడడంతో పవన్ ఆ బాధలో ఉండి పోయారు. అందుకే ఆ పార్ట్ షూటింగ్ వాయిదా పడింది. 

పవన్ కళ్యాణ్ సినిమాల విడుదలలు వాయిదా?

కాగా మే మొదటి వారంలో ఆ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి చేస్తానని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరోవైపు ఓజి మూవీ కూడా దాదాపుగా ఎనభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంది. అందులో పవన్ షూటింగ్ భాగం ఒక ఇరవై రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. హరి హర వీర మల్లు అనంతరం ఓజి షూటింగ్ లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. 

ఆ తరువాత జూన్ లేదా జులై లో హరి శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. కాగా వీటిలో హరి హర వీర మల్లు అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఓజి మూవీ కూడా థియేటర్స్ లో భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకి రానుందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. 

పవన్ కళ్యాణ్ అభిమానుల స్పందన

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ మూడు సినిమాల పై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

వాస్తవానికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ వలన సినిమాలకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ తాను మాత్రం ఇకపై ఎక్కువగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అట. అయితే ఈ మూడు సినిమాల అనంతరం కూడా పవన్ సినిమాలు చేయనున్నారు, కానీ ఎవరెవరితో ఎప్పుడు చేస్తారు అనేది మాత్రం క్లారిటీ రావడానికి చాలానే సమయం పడుతుంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow