Latest Telugu Movie News & Updates – Daily Buzz
Find all the latest news about Telugu movies including reviews, cast updates, trailers, and more. Daily entertainment updates on Telugu Movie Media

ఇటీవల వచ్చిన బాహుబలి (Baahubali The Beginning) (Baahubali The Conclusion) సిరీస్ సినిమాల అనంతరం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏడాదికేడాది ఎంతో ఎత్తుకు దూసుకెళుతోంది. ఆ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు ఎన్నో భారీ బాక్సాఫీస్ రికార్డ్స్ సృష్టించాయనేది మనకు అందరికీ తెల్సిందే.
అనంతరం వాటి బాటలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR), పుష్ప 2 (Pushpa 2), సలార్ (Salaar Part 1 Ceasefire), దేవర (Devara Part 1), కల్కి 2898 (Kalki 2898 AD) ఏడి సినిమాలు కూడా ఎంతో గొప్ప విజయాలు సొంతం చేసుకుని మన టాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి చాటాయి. ఆ విధంగా ఈ ఏడాది కూడా పలు చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో పాటు పలు భారీ పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.
న్యూస్ మూవీ – తాజా తెలుగు విడుదల
ఇక ఇటీవల సంక్రాంతి నుండి మొన్నటి శ్రీరామనవమి వరకు ఇటీవల పలు తెలుగు సినిమాలు రిలీజ్ అయి ఆడియన్స్ కి మంచి వినోదం అందించాయి. మరి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో ముందుగా జూన్ 5న కమల్ హాసన్ (Kamal Haasan), మణిరత్నం ల కలయికలో రూపొందుతున్న థగ్ లైఫ్ (Thug Life) మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రలో శింబు నటిస్తున్నారు. ఇప్పటికే థగ్ లైఫ్ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. దీని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) రిలీజ్ కానుంది.
ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తుండగా హీరోయిన్ గా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) నటిస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేసుకున్న హరి హర వీర మల్లు మూవీ జూన్ 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
కథ, నటీనటులు, దర్శకత్వం
దాదాపుగా మూడేళ్ళ అనంతరం వస్తున్న మూవీ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ భారీ విజయం అందుకోవడం ఖాయం అని ఎంతో ఆశగా ఉన్నారు. అయితే ఈ మూవీ అనంతరం జూన్ 20న నాగార్జున (Nagarjuna Akkineni), ధనుష్ (Dhanush) ల కుబేర (Kubera) మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల లవ్ స్టోరీ మూవీ ద్వారా ఆడియన్స్ ,ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేర మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
కుబేర నుండి నేడు రిలీజ్ అయిన ట్రాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుని అంచనాలు విపరీతంగా పెంచేసింది. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నాగార్జున, ధనుష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా కుబేర మూవీ పై బాగా అంచనాలు ఉన్నాయి.
ఇక దీని అనంతరం మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర (Mass Jathara) మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ఎంతో రెస్పాన్స్ అందుకుంది. ఆపై రిలీజ్ కానున్న మూవీ కింగ్డమ్ (Kingdom).
ఈ మూవీలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం సమకూరుస్తుండగా నాగ వంశీ దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ జులై 5న రానుంది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా కింగ్డమ్ మూవీ పై ఇన్నోవా అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత హను మాన్ (Hanu Man) తో పెద్ద విజయం సొంతం చేసుకున్న తేజ సజ్జ (Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ మిరాయ్ (Mirai) ఆగష్టు లో రిలీజ్ కానుంది.
ప్రేక్షకుల స్పందన మరియు కలెక్షన్లు
దీని యొక్క ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి బాగా రెస్పాన్స్ అందుకుంది. మంచు మనోజ్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఆగష్టు నెలలోనే రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) ల వార్ 2 మూవీస్ కూడా రిలీజ్ కానున్నాయి. కాగా ఇవి రెండు సినిమాలు ఆగష్టు 14న విడుదల కానున్నాయి.
వార్ 2 (War 2) నుండి తాజాగా ఎన్టీఆర్ (Jr Ntr) బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని సినిమా పై అంచనాలు అమాంతంగా పెంచేసింది. కియారా అద్వానీ (Kiara Advani) తో హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు గ్రాండ్ గా దీనిని నిర్మిస్తున్నారు.
ఇక కూలీ (Coolie) మూవీలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), శృతి హాసన్ (Shruti Haasan), అమీర్ ఖాన్ (Aamir Khan) కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి.
కాగా ఈ రెండు సినిమాల అనంతరం సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి (They Call Him OG) తో పాటు సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు (Sambarala Yeti Gattu), నటసింహం బాలకృష్ణ అఖండ 2 (Akhanda 2) సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల పై అందరిలో మంచి క్రేజ్ ఉంది.
ముఖ్యంగా ఓజి తో అఖండ 2 పై అయితే భారీ స్థాయిలో ఊహకందని స్థాయిలో ఆయన హీరోల ఫ్యాన్స్ లో మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉన్నాయి. ఇక అక్టోబర్ 2న ఇటీవల భారీ విజయం అందుకున్న కాంతారా సీక్వెల్ అయిన కాంతారా ఏ లెజెండ్ మూవీ రిలీజ్ కానుంది.
దీని పై కన్నడ ఫ్యాన్స్ తో పాటు తెలుగు, హిందీ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మల్లిడి వశిష్ట ల విశ్వంభర (Vishwambhara), ప్రభాస్ (Prabhas) మారుతీ ల ది రాజాసాబ్ (The Rajasaab) మూవీస్ కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
కాకపోతే షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాల యొక్క రిలీజ్ డేట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇకపై రాబోయే రోజుల్లో మన తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమాలతో పాటు మరికొన్నిటితో మంచి ఐఫీస్ట్ లభించనుందని చెప్పాలి. కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కోసం మా Telugu Movie Media చూస్తూ ఉండండి.
What's Your Reaction?






