Mahesh Babu's Upcoming Projects – You’ll Be Surprised Who He’s Teaming Up With!

Explore the upcoming projects of Superstar Mahesh Babu, including directors, co-stars, and release dates.

Mahesh Babu's Upcoming Projects – You’ll Be Surprised Who He’s Teaming Up With!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అందాల యువత కథానాయిక శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి మరొక కీలక పాత్ర చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సినిమాలు

అయితే మొదటి రోజు నుండి నెగటివ్ టాక్ అందుకున్నప్పటికీ గుంటూరు కారం మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్డం క్రేజ్ తో సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపుగా అనేక ఏరియాల్లో ఈ మూవీ బ్రేకివేన్ తో పాటు లాభాలు అందుకోవడం విశేషం. ఆ మూవీ అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం మూడవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది .ఈ షెడ్యూల్ లో దాదాపుగా 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో జక్కన్న అండ్ టీమ్ ఒక భారీ బోట్ యాక్షన్ సీన్ ని హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరించనుందట. ఈ సీన్ మూవీలోని ప్రధాన హైలైట్స్ లో ఒకటి అని అంటున్నారు. 

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ కానుకగా మార్చి చివర్లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ తో పాటు అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో నభూతో నభవిష్యతి అనే స్థాయిలో ఉంటుందట. ఇక కొన్నాళ్ల అనంతరం SSMB 29 మూవీ టీమ్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బల్గెరియా, కెన్యా వంటి దేశాలకు వెళ్తుందని, అక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. 

దర్శకులు, నటీనటులు మరియు విడుదల తేదీలు

కాగా ఈ మూవీలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నల్లజాతీయుడైన నటుడు మెయిన్ విలన్ గా కనిపించనున్నట్లు టాక్. ఈ మూవీలో హీరో,విలన్ పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయట. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం ఖాయం. 

అయితే ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరితో సినిమాలు చేస్తారు అనేది ప్రస్తుతం అందరిలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న విషయం. హీరోగా మహేష్ బాబు గ్లోబల్ గా రేంజ్ మార్కెట్, క్రేజ్ సొంతం చేసుకుంటారు కాబట్టి ఇకపై ఆయన నుండి వచ్చే సినిమాలు గ్లోబల్ ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా ఒకింత ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్న అల్లు అర్జున్, ప్రభాస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం SSMB29 అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగాతో ఒక భాయీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తారనే వార్తలు కొన్నాళ్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విరివిగా వినిపిస్తున్నాయి. 

ఫ్యాన్స్‌కి ఆశాజనకమైన సమాచారం

అలానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఆయన లిస్ట్ లో ఉన్నారట. త్వరలో రామ్ చరణ్ తో ఒక భారీ మూవీ తెరకెక్కించేందుకు సిద్దమవుతున్న సుకుమార్, దాని అనంతరం సూపర్ స్టార్ మహేష్ కోసం పాన్ వరల్డ్ యాక్షన్ ప్రాజక్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. వీరితో పాటు కోలీవుడ్ యంగ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది .మరి పక్కాగా SSMB 30 మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరితో చేస్తారు అనేది తెలియాలి అంటే దాదాపుగా మరొక రెండేళ్ల వరకు ఆగక తప్పదు.      

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow