They Call Him OG Worldwide Collection: Pawan Kalyan Creates All-Time Record!

They Call Him OG worldwide box office collection: Check total gross, share, and Pawan Kalyan’s latest Tollywood records.

They Call Him OG Worldwide Collection: Pawan Kalyan Creates All-Time Record!

పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా ఇటీవల యువ దర్శకుడు సుజీత్ తీసిన మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ The Call Him OG. ఈ మూవీలో Ojas Gambheera అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించగా ఆయనకు జోడీగా యువ అందాల నటి Priyankam Mohan నటించింది. 

పవన్ కళ్యాణ్ ‘దే కాల్ హిమ్ OG’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం!

అంతకముందు Hari Hara Veera Mallu మూవీ దేవర ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన పవన్ కళ్యాణ్, ఆ మూవీతో భారీ డిజాస్టర్ చవిచూశారు. దానితో అందరిలో OG మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. పైగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని పవన్ కళ్యాణ్ ఓజి మూవీని తెరకెక్కిస్తుండడంతో మూవీ సూపర్ హిట్ ఖాయం అని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. 

ఇక ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఓజి మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఫైనల్ గా ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ ఫస్ట్ డే నుండే హిట్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు హీరోయిన్ ప్రియాంక ఆకట్టుకునే అందం, అభినయం, సంగీత దర్శకుడు థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 

దర్శకుడు సుజీత్ మూవీని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. తాము ఎన్నో ఏళ్ళ నుండి తమ అభిమాన పవర్ స్టార్ ని ఏ విధంగా అయితే చూడాలనుకున్నారో దర్శకుడు సుజీత్ అదే స్థాయిలో ఆయనని అద్భుతంగా చూపించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

దే కాల్ హిమ్ OG సినిమా టోటల్ కలెక్షన్స్ – పవన్ పవర్ మళ్లీ చూపించాడు!

అలానే ఈ సినిమాలో పలు సీన్స్ ని ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రవి కె చంద్రన్ తో పాటు మనోజ్ పరమహంస అద్భుతంగా చిత్రీకరించారు. పలు కీలక సీన్స్ అయితే థియేటర్స్ లో ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ ని అందించాయి. నిర్మాత డివివి దానయ్య ఖర్చు విషయంలో ఎక్కడదా కూడా కంప్రమైజ్ కాకుండా ఓజి మూవీకి భారీ ఖర్చు చేయగా, ఆ ప్రతి రూపాయి మనకు తెరపై ఎంతో గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ సీన్ తో పాటు పలు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకోగా, ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 

ఆ స్థాయిలో దర్శకుడు సుజీత్ ఆ సీన్స్ ని తెరకెక్కించారు. ఇక సెకండ్ హాఫ్ లో కూడా మూవీ ఆకట్టుకునే రీతిన సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత యావరేజ్ స్థాయిలో ఉందని మిశ్రమ స్పందన లభించింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో కీలక పాత్రలు చేసారు. ముఖ్యంగా మూవీలో ఒమీ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించిన ఇమ్రాన్ నటన కూడా అందరినీ అలరిస్తుంది. 

సత్య దాదా ని అనుక్షణం కాపాడే రక్షకుడిగా పవన్ తన పాత్రలో అలరించే పవర్ఫుల్ డైలాగ్స్, స్టైల్ తో అదరగొట్టారు. ఆయన పలు సీన్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ తో మోత మ్రోగించారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు పవర్ఫుల్ గా సాగిన క్లైమాక్స్ సీన్స్ కి కూడా అందరి నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఓజి మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా రూ. 300 కోట్ల మేర ఇది రాబట్టింది. ఇక ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం Netflix లో ఓజి మూవీ ఓటిటి ఆడియన్సు ముందుకి వచ్చింది. ఓటిటి లో కూడా తమ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే ఓజి మూవీ టోటల్ ఏరియా వైజ్ కలెక్షన్ డీటెయిల్స్ ని ఇక్కడ అందించాము. 

They Call Him OG Total Worldwide Collection 

నైజాం - రూ. 52.35 కోట్లు

సీడెడ్ - రూ. 17.81 కోట్లు

ఉత్తరాంధ్ర - రూ. 16.40 కోట్లు

ఈస్ట్ - రూ. 12.18 కోట్లు

వెస్ట్ - రూ. 8.40 కోట్లు

గుంటూరు - రూ. 11.04 కోట్లు

కృష్ణా - రూ. 9.73 కోట్లు

నెల్లూరు - రూ. 4.79 కోట్లు

టోటల్ కలెక్షన్స్ - రూ. 132.70 కోట్లు షేర్ (రూ. 199.80 కోట్లు గ్రాస్)

కర్ణాటక - రూ. 10.27 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 4.30 కోట్లు

ఓవర్సీస్ - రూ. 32.19 కోట్లు

ఓజి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ - రూ. 179.47 కోట్లు షేర్ (రూ. 298.70 కోట్లు గ్రాస్)

OG మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్ & బాక్సాఫీస్ రికార్డ్స్ 2025

మొత్తంగా ఓజి మూవీ టోటల్ బాక్సాఫీస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ మనం పరిశీలిస్తే ప్రీ రిలీజ్ పరంగా రూ. 174 కోట్లు జరుపుకున్న ఈ మూవీ, రూ. 5 కోట్ల వరకు కొద్దిపాటి లాభాలను అందుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలానే పవన్ కళ్యాణ్ కెరీర్ లో నార్త్ అమెరికా తో పాటు ఓవర్సీస్ లో కూడా ఓజి బాగా పెర్ఫార్మ్ చేసింది. మొత్తంగా ఈ మూవీ విజయం తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉండడంతో పాటు కెరీర్ పరంగా పవన్ కు ఇది మంచి బూస్టప్ ని అందించింది. 

ప్రస్తుతం హరీష్ శంకర్ తో Ustaad Bhagat Singh మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో Raashi Khanna, Sreeleela హీరోయిన్స్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలిపేందుకు టీమ్ సిద్ధం అవుతోంది. మరి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్ తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్, రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా తెలుగు మూవీ మీడియా వెబ్ సైట్ ని ఫాలో అయి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow