Latest Telugu Horror Movies 2025: Best Scary Films You Shouldn’t Miss

Explore the latest Telugu horror movies released in 2025. Check out the best scary films, story highlights, and audience reviews

Latest Telugu Horror Movies 2025: Best Scary Films You Shouldn’t Miss

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఓటిటిలో కంటెంట్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో కూడిన సిరీస్ లు సినిమాలకు ప్రేక్షకులు ఆకర్షితులు అవుతున్నారు. ఇక ఎక్కువగా హర్రర్ జానర్ మూవీస్ కి మొదటి నుండి అందరిలో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా హర్రర్ ప్రధానంగా సాగే డెవిల్ మూవీస్, థ్రిల్లర్, మిస్టరీలకు మరింత క్రేజ్ ఉంది. మరి ఆ విధంగా రూపొందిన లేటెస్ట్ 2025 టాప్ 10 హర్రర్ జానర్ మూవీస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది.

1. భ్రమయుగం : (Bramayugam)

మలయాళంలో అక్కడి మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇటీవల గత ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి బాగా సక్సెస్ సాధించింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ మూవీలో అర్జున్ అశోకన్, సిద్దార్థ, ఆకాష్ చంద్రన్, అమల్డా లీజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

పానన్ కులానికి చెందిన ఒక జానపద గాయకుడు తన బానిసత్వం నుండి తప్పించుకుని దారి తప్పుతాడు. అనంతరం ఒక ఒక ఇంటికి చేరుకొని అక్కడి ఊహించని ఘటనల అనంతం పూర్తిగా చిక్కులో ఇరుక్కుంటాడు. మరి అనంతరం ఆ మర్మ ప్రదేశం నుండి అతడు ఎలా బయటపడ్డాడు అనేది మొత్తం సినిమాలో చూడాలి. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈమూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటిటిలో అందుబాటులో ఉంది.

2. ది రాజా సాబ్ : (The Raja Saab)

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రద్దీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా మారుతీ తెరకెక్కిస్తున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్. 

ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగటివ్ పాత్ర చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర వర్క్ పెండింగ్ ఉన్న కారణంగా దీని మరికొన్ని నెలలపాటు వాయిదా వేశారు. త్వరలో ఈమూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. 

3. శబ్దం : (Sabdham)

ఇటీవల అరివళగన్ వెంకటాచలం దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ థ్రిలర్ మూవీ శబ్దం. ఈ మూవీలో ఆది పినిశెట్టి, లక్ష్మి మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రూబన్ అనే పారానార్మల్ సైంటిస్ట్ బ్రతికున్న వారికి చనిపోయిన వారికి మధ్య ఒక వారధిగా పనిచేస్తూ ఉంటాడు. 

తాజా తెలుగు హారర్ సినిమాల జాబితా

అనుకోకుండా చనిపోయి అశాంతి చెందిన ఆత్మల యొక్క చివరి కోరిక నెరవేర్చుకోవడానికి అతడు శాంతిని కనుగొనడంలో సహాయం చేస్తాడు. అయితే అతడు ఒక ప్రతీకార ఆత్మని ఎదుర్కొన్నప్పుడు అది వినాశనానికి కారణం అవుతుంది. ఆకట్టుకునే తీరున తెరకెక్కిన ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో పలు భాషల్లో అందుబాటులో ఉంది. 

4. ల్యాంప్ : (Lamp) 

అవంతిక, నాగేంద్ర సిహెచ్, కోటి కిరణ్, మధు ప్రియ, రాకేష్ మాస్టర్ తదితరులు కీలక పాత్రల్లో తెరక్కిన లేటెస్ట్ హర్రర్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ల్యాంప్. రాజశేఖర్ రాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 

ఒక పోలీస్ అధికారి, ఇన్వెస్టిగేటివ్ డిటెక్టీవ్ ఇద్దరూ కలిసి కొన్నాళ్లుగా జరుగుతున్న వరుస సామూహిక హత్యల మిస్టరీని చేధిస్తారు. అయితే ఆ హత్యల కేసు ఛేదించడంలో ఒక  ల్యాంప్ ముఖ్యమైన క్లూగా ఉపయోగపడుతుంది. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ త్వరలో ఓటిటిలోకి రానుంది. 

5. కింగ్స్టన్ : (Kingston) 

తమిళ యువ నటుడు జివి ప్రకాష్ కుమార్ హీరోగా కమల్ ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ కింగ్స్టన్. ఈ మూవీలో భవాని శ్రీ, ఉమేష్ కె ఆర్ భన్సాల్, విపిన్ అగ్నిహోత్రి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేశారు. ప్యారెలెల్ యూనివర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ 1982లో ఒక తీరా ప్రాంతంలోని పారానార్మల్ సంఘటన ద్వారా శాపకారస్థమవుతుంది. 

కాగా ఆ శాపాన్ని ఛేదించడానికి ఒక సముద్ర స్మగ్లర్ అయిన కింగ్స్టన్ ఏవిధమా ప్రయత్నించాడు అనేది ఈ మూవీ ప్రధాన కథ. ప్రస్తుతం ఈ మూవీ జీ 5 లో పలు పాన్ ఇండియన్ భాషల్లో అందుబాటులో ఉంది. 

6. మా : (Maa) 

బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మైథలాజికల్ హర్రర్ యక్షన్ మూవీ మా. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందింది. ముఖ్యంగా అతీంద్రియ శక్తుల నుండి తన బిడ్డని రక్షిండుకోవడానికి ఒక తల్లి చేసే ప్రయత్నమే ఈ మూవీ. 

ఈ చిత్రం మంచి చెడుల మద్య అలానే కాలాతీత యుద్ధం జరగడం, ఆ సమయంలో వెన్ను వణికే కొన్ని భయంకరమైన హర్రర్ సీన్స్ నడుమ ఈమూవీ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో చాలా సీన్స్ హర్రర్ మూవీ ప్రియులని బాగా అలరిస్తాయని అంటోంది టీమ్. ఇక జూన్ లో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తంగా ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

2025లో విడుదలైన బెస్ట్ హారర్ మూవీస్

7. వడక్కన్ : (Vadakkan) 

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిలర్ మూవీ వడక్కన్. ఈ మూవీలో కిశోర్ కుమార్, శృతి మీనన్, మెరైన్ ఫిలిప్, కలేష్ రామానంద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఏ సాజీద్ తెరకెక్కించారు. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాగానే సక్సెస్ అయింది. 

హెల్సింకి ట్రావెల్స్ కి చెందిన ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన ఒక వ్యక్తి కేరళలో ఫిక్షనల్ ఐలాండ్ అయిన బ్రహ్మగిరిలో చిత్రీకరిస్తున్న ఒక రియాలిటీ షో సందర్భంగా జరుగుతున్న వరుస మరణాలను వాటి వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి వెళ్తాడు. ఆ ఐలాండ్ లోజరిగే పలు ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లింగ్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.

8. భవాని వార్డ్ 1997 : (Bhavani Ward 1997)

తాజాగా రిలీజ్ అయిన హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భవాని వార్డ్ 1997. ఈ మూవీలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. జీడీ నరసింహ తెరకెక్కించిన ఈ మూవీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.ఈ మ్యుజికల్ హర్రర్ డ్రామాలో యువ ప్రేమికులైన అజయ్, దియా ఇద్దరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

దియాని భవాని వార్డ్ లో ఒక దెయ్యం ఆవహించడం, దానితో అజయ్ ఏవిధంగా పోరాడాడు, చివరికి ఏమి జరిగింది అనే ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో ఈ మూవీ రూపొందింది. మొత్తంగా ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ మూవీ బాగానే ఆడియన్స్ ని ఆకట్టుకుంది.  

9. గార్డ్ : (Guard Revenge Love Story) 

రివెంజ్ లవ్ స్టోరీఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీలో విరాజ్ రెడ్డి, మిమి లియొనార్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జగ పెద్ది తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చింది. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ మొత్తం కూడా ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరించడం విశేషం. 

ఒక బిల్డింగ్ లో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డ్ కొన్ని అతీంద్రియ శక్తులని ఎదుర్కొంటాడు. అవి ఒక వైద్యుడితో ప్రేమకు దారి తీసి చివరికి ఆ భవన పురాతన రహస్యాల ద్వారా వారి ప్రాణాలకి ముప్పు కలిగిస్తాయి. ఇది ఈ మూవీ యొక్క ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఈమూవీ రూపొందింది. 

హర్రర్ మూవీస్ పై ప్రేక్షకుల స్పందనలు మరియు కథ సారాంశాలు

10. శివశంభో : (Shiva Shambho) 

సుమన్, తనికెళ్ళ భరణి, విజయరంగరాజు, కేశవర్ధిని సరస్వతి ప్రధాన పాత్రల్లో రేణిగుంట నర్సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ యాక్షన్ చిత్రం శివ శంభో. దుర్గం చెరువు అనే ఒక ప్రశాంతమైన గ్రామంలో చీకటి శక్తులు, పాత రహస్యాలు తిరగబడి ప్రశాంతంగా బ్రతుకుతున్న ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. 

అయితే ఆ దుష్టశక్తుల యొక్క తాంత్రిక కుతంత్రాన్ని వారి దత్తపుత్రిక శాంభవి, ఆ మహాశివుని యొక్క శక్తితో వాటిని ఏవిధంగా అంతమొందించింది అనేది ఈ మూవీ యొక్క ప్రధాన కథాంశం. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ అందుకుని థియేటర్స్ లో కొనసాగుతోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow