Are Mahesh Babu and Sudheer Babu Related? Here’s the Family Connection
Are Mahesh Babu and Sudheer Babu related in real life? Discover their family connection and how they are linked in the Telugu film industry.

టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ లో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ అనంతరం వచ్చిన కృష్ణ, కెరీర్ బిగినింగ్ నుండి నటుడిగా ఆడియన్స్ లో ముఖ్యంగా అప్పటి యువత, మాస్ లో విపరీతమైన క్రేజ్ తో ఎన్నో భారీ విజయాలతో దూసుకెళ్లారు.
ఇక కృష్ణ నుండి సినిమా వస్తుంది అంటే యువత, మరీ ముఖ్యంగా కాలేజీ యూత్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసేవారు, అలానే టికెట్స్ కోసం కూడా ఎంతో పెద్ద క్యూలు ఉండేవట. ఆ విధంగా కృష్ణ సూపర్ స్టార్ గా ఎన్నో ఏళ్ళు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దూసుకెళ్లారు.
మహేశ్ బాబు మరియు సుధీర్ బాబు మధ్య ఉన్న బంధం ఏంటి?
అనంతరం ఆయన కుమారుడిగా అప్పట్లో హీరోగా రంగప్రవేశం చేసిన దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu), ఫస్ట్ మూవీ సామ్రాట్ తో గొప్ప విజయం అందుకున్నారు. అయితే దాని అనంతరం ఆయన సినిమాల సెలక్షన్ లో కొంత లోపం వలన అవి చాలావరకు ఆశించిన స్థాయి సక్సెస్ లు అందుకోలేకపోయాయి.
దానితో సినిమాలు పూర్తిగా ఆపేసారు రమేష్ బాబు. అయితే 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మొదటి చిత్రం రాజకుమారుడుతోనే బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించారు. వాస్తవానికి అంతకముందు కొన్నేళ్ల క్రితమే బాలనటుడిగా మహేష్ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
ఇక హీరోగా రెండవ చిత్రం నుండి కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొన్న సూపర్ స్టార్ మహేష్, ఆపైన కొన్ని సినిమాల ద్వారా యాక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడంతో పాటు కోట్లాది ఫ్యాన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.
అనంతరం కెరీర్ పరంగా ఎన్నో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నమహేష్ బాబు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు తగ్గ తనయుడిగా తనకు తాను నిరూపణ చేసుకున్నారు.
కుటుంబ సంబంధం వివరాలు
ఇక మహేష్ బాబు సినిమా న్యూస్ రిలీజ్ లోనే కాదు రీ రిలీజ్ లోను థియేటర్స్ వద్ద పెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది అంటే ఆయన అనంతమైన క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 లో హీరోగా నటిస్తున్నారు సూపర్ స్టార్.
ఇక ఆ తరువాత వారి ఫ్యామిలీ నుండి వచ్చిన ఘట్టమనేని మంజుల (Manjula Ghattamaneni) షో వంటి డాక్యుమెంటరీ తీసి నేషనల్ అవార్డు ఆనందుకున్నారు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో నాని (Nani), పోకిరి (Pokiri) సినిమాలు ఆమె నిర్మించి, ప్రస్తుతం అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటిస్తున్నారు. అలానే ఆమె భర్త సంజయ్ కూడా పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించడం చూడవచ్చు.
ఇక వీరిద్దరి తరువాత సమంత (Samantha Ruth Prabhu), నాగచైతన్య హీరో హీరోయిన్స్ గా గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే (Ye Maaya Chesave) సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు సుధీర్ బాబు. ఆ మూవీని ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థ పై మంజుల గ్రాండ్ గా నిర్మించగా అది రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
కాగా ఈ మూవీలో సమంత సోదరుడిగా కనిపించి ఆకట్టుకున్నారు సుధీర్. అంతకముందు మహేష్ బాబు రెండవ సోదరి ప్రియదర్శినిని వివాహం చేసుకున్నారు సుధీర్. ఐతే ఆపైన రెజీనా హీరోయిన్ గా ఎస్ ఎం ఎస్, శివ మనసులో శృతి మూవీ ద్వారా పూర్తి స్థాయి హీరోగా ఆడియన్సు ముందుకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు, ఆ మూవీతో మంచి పేరు సొంతం చేసుకున్నారు.
అనంతరం మారుతీ తీసిన ప్రేమకథా చిత్రం హీరోగా సుధీర్ బాబుకు మరింత పేరు, సక్సెస్ ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత వరుసగా పలు అవకాశాలు అందుకున్న సుధీర్ బాబు, సమ్మోహనం, వి, శ్రీదేవి సోడా సెంటర్, హరోం హర సినిమాల విజయాలతో మరింత క్రేజ్ అందుకున్నారు.
ఇద్దరి కెరీర్‌లకు ఈ బంధం ఎలా ఉపయోగపడింది?
ఇక ఆ మధ్యలోనే బాలీవుడ్ (Bollywood) లో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరోగా శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) హీరోయిన్ గా తెరకెక్కిన తెలుగు మూవీ వర్షం (Varsham) యొక్క రీమేక్ బాఘీ (Baaghi) లో విలన్ గా కూడా నటించి మెప్పించారు సుధీర్ బాబు. ఇక ప్రస్తుతం భారీ పాన్ ఇండియన్ మూవీ జటాధర (Jatadhara) చేస్తున్నారు సుధీర్. అయితే మొదటి నుండి తన బావ సుధీర్ బాబు సినిమాలకు తనవంతుగా కొంత మద్దతు అందిస్తూ ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
అయితే సుధీర్ కూడా మరోవైపు నటుడిగా మంచి టాలెంట్ కలిగినప్పటికీ మరింత మంచి క్రేజీ ప్రాజక్ట్ కోసం చూస్తున్నారు. అయితే సుధీర్ బాబు సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయనకు అద్భుతమైన టాలెంట్ ఉందని, కానీ సరైన దర్శకుడి చేతిలో సరైన పాత్ర పడితే తప్పకుండా ఆయన నటుడిగా మరొక రేంజ్ కి వెళ్లడం ఖాయం అని ఇటీవల చెప్పడం చూసాము.
ఇక సుధీర్ కి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అమితమైన ప్రేమ. ఆయన నటించిన పలు సినిమాల ఫంక్షన్స్ కి విచ్చేసే సుధీర్, ఎంతో చక్కగా బావ గురించి మాట్లాడుతుంటారు. మొత్తంగా బావ బావమరుదులైన మహేష్, బాబు సుధీర్ బాబు ఇద్దరూ కూడా కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలతో దూసుకెళ్లి మరింత క్రేజ్ అందుకోవాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






