Kantara Chapter 1 Review Telugu – Audience & Critics Talk

Kantara Chapter 1 Review Telugu with critics ratings, audience talk, kantara box office collection, and analysis of Rishab Shetty’s mythological action drama.

Kantara Chapter 1 Review Telugu – Audience & Critics Talk

Kantara Chapter 1 Review - కాంతారా చాప్టర్ 1 రివ్యూ : ఆకట్టుకునే యక్షన్ విజువల్ గ్రాండియర్ ఎంటర్టైనర్ 

సినిమా పేరు : Kantara Chapter 1

విడుదల తేదీ : 2 అక్టోబర్ 2025

Kantara Chapter Rating - 3.75 / 5 

నటీనటులు : Rishab Shetty, Rukmini Vasanth, Jayaram, Rakesh Pujari   

దర్శకత్వం : రిషబ్ శెట్టి 

నిర్మాత : విజయ్ కిరగందూర్ 

సంగీతం : అజనీష్ లోకనాథ్ 

ఫోటోగ్రఫి : అరవింద్ ఎస్ కశ్యప్

కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ తెలుగు 

సరిగ్గా మూడేళ్ళ క్రితం ఎన్నో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న మూవీ Kantara. ఈ మూవీని రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించగా యువనటి Sapthami Gowda హీరోయిన్ గా నటించారు. Hombale Films సంస్థ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ తెలుగులో కూడా పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. 

అనంతరం దానికి సీక్వెల్ గా రూపొందిన కాంతారా చాప్టర్ 1 మూవీ నిన్న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చింది. వాస్తవానికి అంతకముందు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన వరుస పోస్టర్స్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులని ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. 

కాంతారా ని మించేలా మరింత గ్రాండియర్ గా భారీ స్థాయిలో టీమ్ దీనిని రూపొందించింది. ముఖ్యంగా కాంతారా చాప్టర్ 1 కోసం యావత్ టీమ్ మొత్తం కూడా ఎంతో శ్రమపడిందని, తప్పకుండా మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు హీరో దర్శకుడు రిషబ్ శెట్టి. అయితే మొత్తంగా నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ ఎంతమేర ఆడియన్సు ని ఆకట్టుకుని, దీని టాక్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా పూర్తి Kantara Chapter 1 Review Telugu  చూద్దాం. 

కథ

కాంతారా మూవీ ముగింపు నుండే చాప్టర్ 1 ప్రారంభం అవుతుంది. అయితే ఆ సన్నివేశంలో పంజుర్లి జాతర తరువాత అడవిలోకి వెళ్లిన తన తండ్రి అదృశ్యం అవ్వడంతో ఆయన ఏమయ్యారని తెలుసుకునే ఆసక్తి అతడి కుమారుడు శివ (చిన్నప్పటి రిషబ్ శెట్టి) లో ఏర్పడుతుంది. 

నిజానికి ఆయన అలా మాయం అవ్వడం వెనుక ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ప్రకారం అప్పట్లో కాంతారా చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం, వారి వంశం ఆధీనంలోనే ఆ అడవి ఉంటుంది. అయితే అదే ప్రాంతంలో బర్మ (రిషబ్ శెట్టి) ప్రజల కోసం రాజ్యంలోకి వెళ్లి వ్యాపారం చేయడం, ఆ సమయంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు, ఆ తరువాత కనకవతితో బర్మ దగ్గరవడం కూడా జరుగుతుంది. 

OG Review Rating

అసలు ఇంతకీ బర్మ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, మధ్యలో కనకవతి ఎవరు, కాంతారా కోసం బర్మ ఏమి చేసాడు, చివరిగా ఈ కథ ఎటు మలుపు తిరిగి ఏమి జరిగింది అనేది మొత్తం కూడా వెండితెర పై చూయాల్సిందే. 

ప్లస్ పాయింట్స్

ముఖ్యంగా ఈ మూవీలో ఆకట్టుకునే కథ తో పాటు దర్శకుడు, హీరోగా నటించిన రిషబ్ శెట్టి యాక్టింగ్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మరొక్కసారి తన నటన ఉగ్రరూపాన్ని ప్రదర్శించి అందరినీ అలరించారు రిషబ్. 

ఇప్పటికే కాంతారా మూవీలో ఆయన పతాక సీన్స్ లో చేసిన యాక్టింగ్ కి మంచి పేరు రావడంతో పాటు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అదే విధంగా పతాక సీన్స్ తో పాటు పలు ముఖ్య సీన్స్ లో ఆయన నటన నభూతో నభవిష్యతి. ఇక కీలకమైన యువరాణి కనకవతి పాత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించి ఆకట్టుకున్నారు హీరోయిన్ రుక్మిణి వసంత్. 

కాంతారా చాప్టర్ 1 రివ్యూ రేటింగ్

ముఖ్యంగా ఇందులో ఆమె పాత్ర, చేసిన పెర్ఫార్మన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక మూవీలో సంస్కృతి, సంప్రదాయాలను ముడిపెట్టి సాగిన కథనం, గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. రాజు పాత్ర చేసిన జయరాం సీన్స్ బాగున్నాయి, ఆయన నటన కూడా ఆకట్టుకుంటుంది. అలానే విలన్ గా చేసిన గుల్షన్ దేవయ్య కూడా అలరించారు. 

దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రదర్శించిన పనితామా కూడా బాగుంది. అటు అక్కడక్కడా కామెడీ సీన్స్, యాక్షన్, ఎమోషనల్, డివోషనల్ సీన్స్ ని మిళితం చేసి ఎక్కడికక్కడ సినిమాని ఇంట్రెస్టింగ్ గా నడిపారు. ఫస్ట్ హాగ్ బాగానే సాగిన ఈ మూవీ సెకండ్ హాఫ్ మరింత ఆకట్టుకుంటుంది. 

మైనస్ పాయింట్స్

దాదాపుగా ఈ మూవీలో పెద్దగా మైనస్ లు లేవనే చెప్పాలి. కాకపోతే సినిమా పై ఉన్నంత హైప్ అక్కడక్కడా సీన్స్ లో కొంత అందుకోక సాగతీతగా అనిపిస్తాయి. అలానే హీరో రిషబ్ శెట్టి, విలన్స్ మధ్య సీన్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుంటే బాగుండేది. అంతేతప్ప దాదాపుగా సినిమా మొత్తం ఎంతో ఆకట్టుకునే రీతిన సాగుతుంది. 

సాంకేతికవర్గం :

ముఖ్యంగా దర్శకుడు రిషబ్ శెట్టి అన్ని అంశాల పై పెట్టిన శ్రద్ధ, కథ కథనాల్ని నడిపిన తీరు సూపర్ అని చెప్పకతప్పదు. మొదట కాంతారా చూసిన ప్రేక్షకులు, ఈ మూవీ యొక్క ట్రైలర్ అనంతరం ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుందనే అనుమానం కొంత వ్యక్తపరిచారు. 

Telugu Movie Release Dates

అయితే ఆ అనుమానాలను పూర్తిగా పటాపంచలు చేస్తూ యక్షన్, ఎమోషనల్, గ్రాండియర్ డివోషనల్ ఎంటర్టైనర్ గా ఆయన దీనిని తెరకెక్కించి మెప్పించారు. ఆ విధంగా రచయితగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 కి పూర్తి న్యాయం చేసారు. ఇక ఫోటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ కెమెరా పనితనం సూపర్ అని చెప్పాలి. పలు కీలక యాక్షన్ సీన్స్ ని ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. 

కాంతారా చాప్టర్ 1 పబ్లిక్ టాక్

ఎడిటర్ సురేష్ మల్లయ్య కూడా కథ, కథనాలకు సరిగ్గా సరిపోయే విధంగా సీన్స్ ని కరెక్ట్ గా కట్ చేసారు. రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడా తప్ప కథనం పెద్దగా బోర్ కొట్టదు. సంగీత అర్షకుడు అజనీష్ లోకనాథ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, మరీ ముఖ్యంగా సినిమాలోని కీలక సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అలరిస్తుంది. చివరిగా హోంబలె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ భారీ స్థాయిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పెట్టిన ఖర్చు ప్రతి రూపాయి మనకు తెరపై కనపడుతుంది. 

తీర్పు :

మొత్తంగా రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డివోషనల్ గ్రాండియర్ ఎంటర్టైనర్ మూవీ కాంతరా చాప్టర్ 1 నేడు రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రిషబ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్ తో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్ అలరించే అందం అభినయం, యాక్షన్ సీన్స్, ఎమోషనల్, డివోషల్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్ వంటివి ప్లస్ పాయింట్స్. అయితే అక్కడక్కడా కొద్దిగా కథనం నెమ్మదించినప్పటికీ ఈ మూవీ మీ టికెట్ ధరకు పూర్తి న్యాయం చేస్తుంది. వీలైతే తప్పకుండా ఈమూవీని మీమీ సమీప థియేటర్స్ లో కుటుంబం సహా చూసి ఆనందించండి. 

మరి ఇటువంటి లేటెస్ట్ తెలుగు సినిమా అప్ డేట్స్, టాలీవుడ్ న్యూస్, రివ్యూస్, గాసిప్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవ్వండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow