Pawan Kalyan OG Movie Review – Critics & Audience Talk
Read Pawan Kalyan OG Movie Review with critics ratings, audience talk, box office response, and full analysis of Sujeeth’s action-packed Tollywood film.

పవన్ కళ్యాణ్ ఓజి మూవీ రివ్యూ (PawanKalyan OG Movie Review) : ఆకట్టుకునే స్టైలిష్ యాక్షన్ డ్రామా మూవీ
మూవీ పేరు : OG (They Call Him OG)
విడుదల తేదీ : 25 సెప్టెంబర్ 2025
Telugu Movie Media OG Review & Rating - 3.5 / 5
నటీనటులు : Pawan Kalyan, Priyanka Mohan, Emraan Hashmi, Prakash Raj, Shriya Reddy, Arjun Das తదితరులు
దర్శకత్వం : సుజీత్
నిర్మాత : డివివి దానయ్య
సంగీతం : ఎస్ థమన్
ఫోటోగ్రఫి : రాయి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటర్ : నవీన్ నూలి
టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల Hari Hara Veera Mallu మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. Nidhhi Agerwal హీరోయిన్ గా నటించిన ఈ మూవీని జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక దానితో ఆయన తదుపరి మూవీ OG పై Pawan Kalyan ఫ్యాన్స్ కి విపరీతంగా అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా రూపొందిన ఓజి ఫస్ట్ గ్లింప్స్ నుంచే భారీ హైప్ సొంతం చేసుకుంది. సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్ ఈ మూవీని ఏ విధంగా తీశారో ఈ మూవీ ఎలా ఉందో అనేది మొత్తం కూడా ఇప్పుడు OG Movie Review లో పూర్తిగా చూద్దాం.
పవన్ కళ్యాణ్ ఓజి మూవీ రివ్యూ
కథ :
ఈ కథ 1993 సమయంలో ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో ముంబై పోర్ట్ కి దాదా అయిన సత్యదాదా (ప్రకాష్ రాజ్) వద్ద పని చేస్తూ ఆయనకు ఎంతో అండగా ఉంటాడు ఓజాస్ గంభీర Ojas Gambheera (పవన్ కళ్యాణ్). అనంతరం కొన్ని కారణాల వలన అతడు ఆయనకి దూరం అవుతాడు. ఆ తరువాత ఆ పోర్ట్ పై పలువురి కన్ను పడుతుంది. అసలు ఇంతకీ సత్య దాదా దగ్గర గంభీర ఏవిధంగా చేరాడు, ఎందుకు సడన్ గా దూరం అయ్యాడు, మరోవైపు ఒమీ అని పిలవబడే ఓంకార్ వర్ధమాన్ (ఇమ్రాన్ హష్మీ) తాలూకు కంటైనెర్ సత్యదాదా పోర్టుకి వచ్చి ఎలా మాయం అయింది, ఇంకోవైపు అర్జున్ (అర్జున్ దాస్) ఎందుకని గంభీరని చంపాలనుకుంటాడు, అసలు ఈ మధ్యలో ఏమి జరిగింది, ఇంతకీ ఈ గంభీర ఎవరు అతడి గతం ఏమిటి అనేది మొత్తం కూడా మనం తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీ ద్వారా చాలా ఏళ్ళ నుండి తన అభిమానులు తనని ఏవిధంగా పవర్ఫుల్ రోల్ లో చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా అదిరిపోయే పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించి తన అలరించే నటనతో అందరినీ ఆకట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పాత్రలో కనిపించే పవర్ఫుల్ లుక్స్, స్టైల్, స్వాగ్ వంటివి థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఫుల్ ఐ ఫీస్ట్ అందిస్తాయి అని చెప్పడంలో యామాత్రం సందేహం అవసరం లేదు. ఇక థమన్ మ్యూజిక్ అనగా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ అదరగొట్టాడు.
విజువల్స్ పరంగా కూడా ఆకట్టుకున్నాయి. దర్శకుడు సుజీత్ పవన్ కు వీరాభిమాని కావడంతో చాలావరకు ఫ్యాన్స్ కోరుకునే అన్ని యాక్షన్ మాస్ అంశాలు ఓజి లో పొందుపరిచి మూవీని తెరకెక్కించాడు. భారీ నిర్మాణ విలువలు అందరు పాత్రధారుల నటన సినిమాలో బాగున్నాయి. డిఫరెంట్ స్టయిల్స్ లో వచ్చే యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఎంతో బాగుంటాయి.
సమురాయ్ గా గ్యాంగ్ స్టర్ గా చేసే కటానా ఫ్యాన్స్ తెరకెక్కించిన తీరు బాగుంది. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ ఉన్నంతసేపు ఆమె మెప్పించి ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ కలిగి ఉంటుంది. నటుడు ఇమ్రాన్ హష్మీ తో పాటు ప్రకాష్ రాజ్ నెగటివ్ రోల్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
వాస్తవానికి ఇటువంటి మాస్ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీస్ తీసేటప్పుడు కథ పెద్దగా బలంగా లేనప్పటికీ అందులోని లోతైన ఎమోషన్స్ కనుక పండితే సినిమాకి ఫ్యాన్స్ అయినా ఆడియన్సు అయినా క్యూలు కడతారు. ఓజి మూవీలో అవి లోపించాయి. చాలా వరకు పాత్రలు వస్తూ వెళ్తూ ఉండడంతో కొంత కన్ఫ్యూజన్ తో పాటు చాలా పాత సినిమాల్లో చూసిన రొటీన్ ఫ్లాష్ బ్యాక్ కూడా నిరాశపరుస్తుంది. చాలా వరకు సినిమాలో సీన్స్ సాధారణ ప్రేక్షకుడు కూడా ఊహించదగిన విధంగా ఉంటాయి.
మొత్తంగా చెప్పాలి అంటే OG Movie Review Telugu రొటీన్ యాక్షన్ డ్రామా మూవీ విత్ యాకూజాలు అండ్ సమురాయ్ పాయింట్ అంతే. పెద్దగా థ్రిల్ ఫీల్ అయ్యే ట్విస్ట్ లు అండ్ టర్న్ లు ఏమి ఉండవు. పాత్రల మధ్య కోర్ ఎమోషన్స్ మిస్ అవ్వడం కూడా మైనస్ అని చెప్పాలి. సాంగ్స్ ప్లేస్ మెంట్ కొంత బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ లో పదే పదే రిపీట్ అయినట్లు అనిపిస్తుంది.
ఓజి క్రిటిక్స్ రేటింగ్స్ & ఆడియన్స్ టాక్
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా ఓజి మూవీలో గ్రాండ్ గా ఉన్న నిర్మాణ విలువలు సినిమా యొక్క ఒక ముఖ్య బలం. గ్రాండియర్ సన్నివేశాలు, యాక్షన్ బ్లాక్ లు, ఫైట్స్ ని ఎంతో బాగా చూపించారు ఫోటోగ్రాఫర్స్ రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ తో పాటు కొన్ని కీలక సీన్స్ తెరపై ఫ్యాన్స్ కి మంచి ఐ ఫీస్ట్ అందిస్తాయి. ఇక సంగీత దర్శకుడు ఓజి మూవీకి ప్రాణం పెట్టారు అని చెప్పకతప్పదు. ఎలివేషన్స్, హీరో మాస్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాకి ఒకరకంగా అది మరొక ప్రధాన బలం అనాలి. అలానే నవీన్ నూలి ఎంతో చక్కగా తక్కువ నిడివితో కావలసిన సీన్స్ వరకు మాత్రమే కట్ చేసిన ఎడిటింగ్ కూడా బాగుంది.
ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు సుజీత్ విషయానికి వస్తే మొదటి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన సుజీత్ తనకు రాసుకున్న కథతో తీసిన ఈ ఓజి మూవీ ద్వారా ఎన్నో ఏళ్ళ ఫ్యాన్స్ యొక్క నిరీక్షణకు తెరదించారు. తామందరం ఇటువంటి పవన్ కళ్యాణ్ ని కదా తెరపై చూడాలనుకుంది అనే కోరిక ఆయన ద్వారా పూర్తి అయింది. సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎలివేషన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా పక్కాగా కేర్ తీసుకున్నాడు. అయితే ఫస్ట్ హాఫ్ బాగా రాసుకున్న సుజీత్ సెకండ్ హాఫ్ లో మాత్రం తడబడ్డాడు. ఆ డోస్ ఫ్యాన్స్ కి ఇంకా పూర్తిగా సరిపోలేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. అయితే ఈ మూవీ సాధారణ ప్రేక్షకుల తో పాటు ఫ్యామిలీ ఆడియన్సు కి ఎంతవరకు చేరువ అవుతుందిఆ అనేది చూడాలి.
ఓజి బాక్సాఫీస్ రెస్పాన్స్ & అనాలిసిస్
తీర్పు :
ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ They Call Him OG Review Telugu గురించి చెప్పాలి అంటే ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో ఆకలిగా ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి దర్శకుడు సుజీత్ ఫుల్ మీల్స్ ని అయితే అందించాడు. ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో తడబడింది. కానీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా కొంత ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ వంటివి ఈమూవీలో బాగున్నాయి. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లుక్స్, స్టయిల్స్, యాక్టింగ్ అయితే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్. ఎక్కడో సినిమా కొంత సైడ్ ట్రాక్ లోకి వెళ్తుందన్నట్లు అనిపించినా ఓవరాల్ గా అయితే చూడొచ్చు. వీలైతే ఈవారం ఏమీ సమీప థియేటర్స్ లో ఓజి మూవీ తప్పకుండా చూసి ఆనందించండి
ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్, తారల ఫొట గ్యాలరీస్ కోసం ఎప్పటికప్పుడు మా తెలుగు మూవీ మీడియా సైట్ చూస్తూ ఉండండి
What's Your Reaction?






