Thandel Movie Review in Telugu
Thandel Movie Review in Telugu యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన లవ్ యాక్షన్ ఎమోషనల్ పేట్రియాటిక్ డ్రామా మూవీ తండేల్. మొదటి నుండి అందరిలో

'తండేల్' రివ్యూ : ఆకట్టుకునే లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్
సినిమా పేరు : తండేల్
రేటింగ్ : 3.5 / 5
తారాగణం : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి, పృథ్వీ, ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్ళై, కరుణాకరన్, కల్ప లత తదితరులు
సంగీతం : దేవిశ్రీప్రసాద్
నిర్మాత : బన్నీ వాసు
దర్శకుడు : చందూ మొండేటి
యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా యువ దర్శకుడు చందూ మొండేయ్ దర్శకత్వంలో రూపొందిన లవ్ యాక్షన్ ఎమోషనల్ పేట్రియాటిక్ డ్రామా మూవీ తండేల్. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ దీనికి సమర్పకులుగా వ్యవహరించగా బన్నీ వాసు ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
చిన్నప్పటి నుండి ఒకరంటే మరొకరికి ఎంతో ప్రాణంగా ఇష్టపడే రాజు (Naga Chaitanya) సత్య (Sai Pallavi) ఇద్దరూ కూడా యుక్త వయసుకు వచ్చాక ప్రేమిచుకుని పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. వృత్తి రీత్యా చేపల వేటకు తరచు వెళ్తుండే రాజు, ఒకానొక సమయంలో చేపల వేటకు తన బృందంతో కలిసి వెళ్లి కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పాకిస్థాన్ కోస్టల్ గార్డ్స్ కి చిక్కుతాడు. అక్కడి నుండి రాజు మరియు అతడి బృందం పాకిస్థాన్ వారి నుండి ఎలా బయటపడింది. మరి ఇంతకీ రాజు, సత్య కలిశారా, చివరికి వారిద్దరికీ వివాహం జరిగిందా అనేది మొత్తం కూడా తండేల్ మూవీలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా తండేల్ మూవీలో ప్రధానంగా మాట్లాడుకోవల్సినది హీరో నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి. గతంలో ఈ ఇద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ మంచి విజయం అందుకోవడంతో పాటు ఇద్దరూ కూడా ఆ మూవీలో ఎంతో ఆకట్టుకున్నారు. ఇక తండేల్ లో అయితే ఇద్దరి పెర్ఫార్మన్స్ నభూతో నభవిష్యతి అని చెప్పకతప్పదు.
కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాల్లో అటు నాగ చైతన్య ఇటు సాయి పల్లవి ఢీ అంటే ఢీ అనే మాదిరిగా తమ మార్క్ అద్భుత నటనతో మన హృదయాలను కదిలిస్తారు. ఇక ఇతర ముఖ్యం పాత్రల్లో కనిపించిన బబ్లు పృథ్వీ రాజ్ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అలానే మరొక ముఖ్య పాత్రలో నటించిన తమిళ నటుడు కరుణాకరన్ పాత్ర బాగుంది, ఆయన నటన కూడా సూపర్ అని చెప్పాలి. మరొక కీలక పాత్ర చేసిన దివ్య పిళ్ళై పాత్ర కూడా అలరిస్తుంది, ఆమె కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా అందరు నటీనటుల పెర్ఫార్మన్స్ తండేల్ లో అద్భుతం అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
నాగచైతన్య సాయి పల్లవి పెర్ఫార్మన్స్
దేవిశ్రీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
గ్రాండ్ విజువల్స్
ప్రీ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా స్లో పేస్ లో సాగడం
విశ్లేషణ :
ఇక తండేల్ గురించి విశ్లేషణాత్మకంగా చెప్పుకోవాలి అంటే అటు హీరోయిన్ నాగ చైతన్య, ఇటు హీరోయిన్ సాయి పల్లవి అద్భుత నటనతో పాటు దర్శకుడు చందూ మొండేటి సినిమాని ఆద్యంతం ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కించిన తీరు కూడా సూపర్ ని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొద్దిగా స్లో పేస్ లో సాగినప్పటికీ వెనువెంటనే పుంజుకుంటుంది.
సినిమాలో ఎక్కడ కూడా అనవసరపు సన్నివేశాలు లేకపోవడం, తాను చెప్పాలనుకున్న కథ ని ఆకట్టుకునే కథనంతో ఆయన ఆడియన్స్ కి దానిని కనెక్ట్ చేసిన తీరు ఎంతో బాగుంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు పలు కీలక సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి బ్యాక్ బోన్ గా చెప్పుకోవాలి. ఇక విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి. నిర్మాత బన్నీ వాసు హై ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి మరొక ప్లస్ అని చెప్పాలి. మొత్తంగా తండేల్ అందరినీ అలరిస్తుంది.
తీర్పు :
తాజాగా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాగ చైతన్య తండేల్ మూవీ యాక్షన్, లవ్, ఎమోషనల్ అంశాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అక్కడక్కడా కొద్దిగా నెమ్మదించే సీన్స్ తప్ప ఓవరాల్ గా అయితే ఈ మూవీని ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆనందించవచ్చు
What's Your Reaction?






