Sai Pallavi Intro BGM in Amaran – Fans Go Crazy for Her Entry Scene

Sai Pallavi’s intro BGM in Amaran is winning hearts. Her entry scene with powerful background score creates next-level excitement for fans

Sai Pallavi Intro BGM in Amaran – Fans Go Crazy for Her Entry Scene

తొలిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకి ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీకి ఇచ్చారు సాయి పల్లవి. అంతకముందు ఆమె మలయాళంలో హీరోయిన్ గా నటించిన ప్రేమమ్ మూవీ పెద్ద విజయం అందుకుని నటిగా ఆమెకు అక్కడ బాగా పేరు తీసుకువచ్చింది. ఇక అంతకంటే ముందు తెలుగు ఛానెల్ ఈటివిలో ప్రసారం అయిన ఢీ డ్యాన్సింగ్ లో పార్టిసిపెంట్ గా నిలిచి తన అదరగొట్టే డ్యాన్స్ తో అందరినీ అలరించారు సాయి పల్లవి. 

Sai Pallavi Intro Bgm Amaran

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయం, డ్యాన్స్ తో అలరించారు సాయి పల్లవి. ఆ మూవీ అప్పట్లో పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు నటిగా ఆమెకు పేరు తీసుకువచ్చింది. అయితే ఆ తరువాత నాచురల్ స్టార్ నాని తో ఆమె చేసిన మూవీ ఎం సి ఏ. ఈ మూవీ కూడా రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకుంది. ఆపైన యువ నటుడు శర్వానంద్ తో పడి పడి లేచే మనసు మూవీ చేసారు. 

ఆ తరువాత మరొక్కసారి నానితో కలిసి సాయి పల్లవి చేసిన మూవీ శ్యామ సింగ రాయ్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఇక వాటి అనంతరం నాగ చైతన్య హీరోగా మరొక్కసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమె చేసిన మూవీ లవ్ స్టోరీ. ఈ మూవీ కూడా సక్సెస్ అయి హీరోయిన్ గా సాయి పల్లవి క్రేజ్ ని తెలుగులో మరింతగా పెంచింది అని చెప్పాలి. ఆపై రానా దగ్గుబాటితో తొలిసారిగా సాయి పల్లవి చేసిన మూవీ విరాట పర్వం. 

అమరన్ లో సాయి పల్లవి ఇంట్రో BGM – అభిమానులు ఫిదా

ఈ మూవీ కూడా బాగా ఆడింది. అందులో వెన్నెల పాత్రలో తన సహజ నటనతో ఆ పాత్రకి జీవం పోశారు సాయి పల్లవి. ఇక ఇటీవల మరొక్కసారి యువ నటుడు నాగచైతన్యతో ఆమె చేసిన మూవీ తండేల్. ఈ మూవీ కూడా విజయవంతం అయింది. ఇక వీటితో పాటు అటు తమిళ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ కొనసాగారు సాయి పల్లవి. సూర్య తో ఎన్ జి కె, ధనుష్ తో మారి 2, లేడీ ఒరిఎంటేడ్ మూవీ గార్గి కూడా చేసారు. 

అయితే గార్గి లో మరొక్కసారి తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆమె ఇటీవల తొలిసారిగా శివ కార్తికేయన్ తో కలిసి చేసిన బయోగ్రఫికల్ యాక్షన్ ఎమోషనల్ పేట్రియాటిక్ మూవీ అమరన్. ఈ మూవీని యువ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. ఇక ఈ మూవీని తమిళ ప్రతిష్టాత్మక సంస్థలు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ ఫిలిమ్స్ ఇండియా సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. 

Amaran Movie Sai Pallavi Entry Scene

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో అశువులు బాసిన ప్రముఖ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందగా ఆయన పాత్రలో శివ కార్తికేయన్ చక్కగా నటించి అలరించారు. అయితే ఆయన భార్య ఇందు రెబెకా వర్గేసే పాత్రలోకి సాయి పల్లవి నటించారు. ముఖ్యంగా ఈ మూవీలోని కీలకమైన ఎమోషనల్ సీన్స్ లో సాయి పల్లవి నటన అదరహో అని చెప్పాలి. ఆ విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు ఆమె. 

ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అటు శివ కార్తికేయన్ కూడా ఆకట్టుకున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ మూవీని తెరకెక్కించిన తీరు అద్భుతం. ఇక నిర్మాతలు అయిన కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, వివేక్ కృష్ణాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మూవీని గ్రాండియర్ గా భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించి పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకువచ్చారు. 

ఎంట్రీ సీన్ లో మ్యూజిక్ ఎఫెక్ట్ & ఫ్యాన్స్ రియాక్షన్స్

కాగా గత ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయిన అమరన్ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని తెలుగు, తమిళ్, హిందీ భాషల ప్రేక్షకుల ఆదరణ అందుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇక ఈ మూవీ రూ. 100 కోట్ల వ్యయంతో రూపొంది ఓవరాల్ గా క్లోజింగ్ లో వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని నిర్మాతలు, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎన్నో లాభాలు అందించింది. 

Amaran Movie Review Telugu

అయితే ఈ మూవీలో జివి ప్రకాష్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో రంగులే సాంగ్ తో పాటు సాయి పల్లవి ఎంట్రీ సీన్ తో పాటు పలు సీన్స్ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులు, అభిమానులు ఆ మ్యూజిక్ కి ఎంతో కంకెట్ అవుతారు. ఆ విధంగా ఈ మూవీ యొక్క సక్సెస్ కి సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక అమరన్ మూవీకి సి హెచ్ సాయి అందించిన విజువల్స్ కూడా ఎంతో గ్రాండియర్ గా ఉన్నాయి. 

Sai Pallavi Bgm in Amaran

పలు యాక్షన్ సీన్స్ లో విజువల్స్ ఎంతో రిచ్ ఉండడంతో పాటు ఆడియన్స్ కి మంచి వీనుల విందుని అందిస్తాయి. మొత్తంగా ప్రధాన పాత్రధారుల యొక్క నటన, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ వంటివి అన్ని కూడా అమరన్ భారీ విజయానికి కారకాలు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా అమరన్ మూవీ ఎంతో భారీ విజయఢంకా మ్రోగించింది. ఆ విధంగా అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా హీరో శివ కార్తికేయన్ మరింత మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నారు. 

అమరన్ మూవీపై అంచనాలు పెంచిన సాయి పల్లవి

అలానే హీరోయిన్ సాయి పల్లవి కూడా హీరోయిన్ గా అమరన్ తో మరింతగా గొప్ప పేరు సొంతం చేసుకున్నారు. అయితే అమరన్ అనంతరం ప్రస్తుతం పలు భాషల్లో పలు క్రేజీ ఆఫర్స్ తో కొనసాగుతున్న సాయి పల్లవి, తాజాగా బాలీవుడ్ తో పాటు భారతీయ చీర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే ఇతిహాస గాథ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సీత పాత్రలో నటిస్తున్నారు. కిజిఎఫ్ సినిమాల ఫేమ్ యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని నితీష్ తివారి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Sai Pallavi New Movie Bgm

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow