SSMB29: Rajamouli-Mahesh Babu Movie Latest Update
SSMB29 latest update: Rajamouli and Mahesh Babu’s jungle adventure movie wraps Nairobi schedule with Priyanka Chopra joining

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేసి ఎన్నో ఏళ్ళ పాటు తిరుగులేని మాస్ సూపర్ స్టార్ గా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లని సొంతం చేసుకున్నారు.
అయితే తొలిసారిగా హీరోగా రాజకుమారుడు మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కెరీర్ పరంగా ఇప్పటివరకు 28 సినిమాలు చేసారు. నటుడిగా ప్రతి సినిమాతో ఎంతో కొంత వైవిద్యం ఉండేలా ప్లాన్ చేసే Superstar Mahesh Babu తొలి సినిమా నుండి నటుడిగా ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన అభినయంతో కోట్లాది ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇక ఆయన న్యూ రిలీజ్ లతో పాటు రీ రిలీజ్ సినిమాలకు కూడా మరొక ఏ హీరోకి లేనంతటి గొప్ప క్రేజ్ ఉంటుంది.
ఇక ఆయన సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే డే 1 సునామీ ఓపెనింగ్స్ మొదలుకుని దాదాపుగా ప్రతి థియేటర్స్ లో అతిపెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ విధంగా ఊహకందని రేంజ్ లో పాపులారిటీ, ఫ్యాన్స్, ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు మహేష్. ఇటీవల చివరిగా ఆయన ఆడియన్సు ముందుకి వచ్చిన మూవీ గుంటూరు కారం.
ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ Trivikram Srinivas తెరకెక్కించగా హీరోయిన్స్ గా యువ అందాల భామలు శ్రీలీల Sreeleela మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary నటించారు. అనౌన్స్ మెంట్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ వాస్తవానికి మొదటి రోజు అర్ధరాత్రి నుండి నెగటివ్ టాక్ ని అందుకుంది.
మహేష్ బాబు – రాజమౌళి కొత్త సినిమా SSMB29 అప్‌డేట్
అయినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ఫుల్ స్టార్డం, కోట్లాదిమంది ఫ్యాన్స్ తో పాటు అన్నివర్గాల ఆడియన్స్ లో ఆయనకు ఉన్న విపరీతమైన క్రేజ్ ముందు ఆ నెగటివిటీ నిలవలేకపోయింది. ఓవరాల్ గా చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ అవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి లాభాలు కూడా తెచ్చిపెట్టింది ఈ మూవీ. మొత్తంగా Guntur Kaaram మూవీతో మరొక్కసారి రూ. 125 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని స్టార్ గా అన్ని అడ్డంకులు తట్టుకుని బాక్సాఫీస్ రికార్డులని బద్దలుకొట్టడంలో తనకు తిరుగులేదని మరొక్కసారి నిరూపించుకున్నారు మహేష్.
ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మించగా సంగీత దర్శకుడు థమన్ మంచి సాంగ్స్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. మొత్తంగా దాదాపుగా ఏడాదిన్నర క్రితం అనగా 2024 సంక్రాంతికి రిలీజ్ అయింది Guntur Kaaram మూవీ. ఇక అప్పటి నుండి తమ అభిమాన సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూడసాగారు.
ఆ తరువాత కొన్ని నెలల అనంతరం మహేష్ బాబుతో RRR డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 గ్రాండ్ గా ప్రారంభం అయింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా ఈమూవీకి ప్రస్తుతం కేవలం మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా GlobeTrotter అయిన SSMB29 మూవీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.
నిజానికి అసలు ఎన్నో ఏళ్ళ క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబుతో SS Rajamouli మూవీ ఫిక్స్ అయింది. కానీ అప్పటి నుండి ఇద్దరూ కూడా పలు కమిట్మెంట్స్ కారణంగా మూవీ చేయలేకపోయారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ తో రాజమౌళి సినిమా చేయాల్సింది. ఇక ప్రస్తుతం SSMB 29 మూవీని కూడా ఆయన నిర్మాణంలోనే చేసేందుకు సిద్ధమయ్యారు జక్కన్న.
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ గ్లోబల్ మూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా దేవా కట్ట డైలాగ్స్ రాస్తున్నారు. అలానే బాలీవుడ్ ప్రముఖ నటి అటు హాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసిన Priyanka Chopra తో పాటు మలయాళ స్టార్ నటుడు దర్శకుడు Prithviraj Sukumaran ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. వీరిద్దరూ ఈ మూవీలో నటిస్తున్నారు అనేది నిజమే కానీ వారు ఎటువంటి పాత్రలు చేస్తున్నారు అనేది మాత్రం ఎవరికీ తెలియని విషయం.
ఇటీవల ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుండి ప్రీ లుక్ ని రిలీజ్ చేసింది టీమ్. ఆ లుక్ లో మహేష్ బాబు ఒక విభిన్న షర్ట్ తో పాటు మేడలో శివుడు, నంది, రుద్రాక్ష, త్రిశూలం కలిగిన లాకెట్ ధరించి ఉండడం చూడవచ్చు. వాస్తవానికి తనకు మొదటి నుండి ఎంతో పెద్ద రేంజ్ లో ఒక అడ్వెంచర్ మూవీ చేయాలి అనేది కోరిక అని గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు రాజమౌళి.
Globe Trotter మూవీ కథ, తారాగణం & అంచనాలు
ఇక మహేష్ బాబు ప్రీ లుక్ ని మనం పరిశీలిస్తే ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ తో పాటు కొంత మైథలాజి టచ్ కలిగిన మూవీ అని కూడా అనిపించకమానదు. ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన పాత్రలన్నిటి కంటే ఇందులోని పాత్ర ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు వినూత్నంగా ఉండేలా డిజైన్ చేశారట జక్కన్న.అలానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ అందరికీ కూడా ఆయన పాత్ర నచ్చేలా డిజైన్ చేశారట. ఈ మూవీ కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ Globe Trotting Action Adventure SSMB 29 మూవీలోని పలు కీలక పాత్రధారుల యొక్క ఎంపిక కోసం Hollywood లో ప్రసిద్ధి గాంచిన CAA (Creative Artists Agency) సంస్థతో కూడా టీమ్ ఒప్పందం కుదుర్చుకుందట. ఒక ప్రముఖ హాలీవుడ్ విలన్ ఇందులో మహేష్ ని ఢీ కొట్టనున్నట్లు టాక్. అతడి పాత్ర కూడా హీరో పాత్రకి తగ్గట్లుగా చాల వయొలెంట్ గా ఉంటుందట. మొత్తంగా ఇప్పటివరకు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ, ఒడిశా, తాజాగా నైరోబి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో హైదరాబాద్ లో ఎంతో భారీ వ్యయంతో వేసిన కాశి సెట్ లో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుందట.
అలానే సౌత్ ఆఫ్రికా తో పాటు నైరోబి, టాంజానియా వంటి ప్రాంతాల్లో మరికొంత షూటింగ్ చేయాల్సి ఉందని టాక్. ఖర్చు పరంగా ఈ మూవీకి భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకి పెట్టనంత ఖర్చు చేస్తున్నారని అలానే దీనిని మొత్తంగా వరల్డ్ వైడ్ గా 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్టైలింగ్, కాస్ట్యూమ్స్ అందిస్తున్న ఈ మూవీ కోసం గతంలో తాను పని చేసిన కొందరు టెక్నీకల్ టీమ్ ని జక్కన్న మార్చినట్లు టాక్.
ఇక మహేష్ బాబు కూడా ఇందులో మరొక సర్ప్రైజింగ్ గెటప్ లో కూడా కనిపించనున్నారు అని తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. నవంబర్ లో SSMB 29 మూవీ యొక్క ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ ని కూడా ప్రకటించి అదే సమయంలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేలా ప్లాన్ చేశారట. ఒక పెద్ద ఈవెంట్ ద్వారా దీనిని అనౌన్స్ చేయనున్నారు అనే టాక్ కూడా వస్తోంది. కానీ అది టీమ్ నుండి అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
కాగా ఈ మూవీలో నటిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ కూడా నెగటివ్ పాత్రలు చేస్తున్నారని, మహేష్ బాబు సరసన హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని, ఒక హాలీవుడ్ భామ ఆయనతో జోడీ కడుతుందని కూడా సమాచారం. మొత్తంగా అయితే గ్లోబల్ గా ఎంతో క్రేజ్ కలిగిన ఈమూవీకి సంబంధించి ఇంకా పూర్తిగా అనౌన్స్ మెంట్ కూడా రాకముందే ఈ విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో మీడియా మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
అసలు వీటిలో ఏదో నిజమో ఏది అబద్దమో తెలియాలి అంటే రానున్న నవంబర్ వరకు వెయిట్ చేయాలి. ఇక ఇటీవల తాను తీసిన RRR మూవీలోని Naatu Naatu సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కొట్టిన జక్కన్న అండ్ టీమ్ తాజా సినిమాని అంతకు మించి మరిన్ని అవార్డులు అందుకునేలా కూడా దీనిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతోందట. అలానే శ్రీ దుర్గ ఆర్ట్స్ సంస్థతో పాటు ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ కూడా ఈ ప్రతిష్టాత్మక మూవీలో భాగం కానుందని తద్వారా వరల్డ్ వైడ్ అత్యధిక భాషల్లో అత్యధిక రిలీజ్ కి వీలు ఉంటుందని టీమ్ ఈ విధంగా ఆలోచన చేస్తోందట.
మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం కోట్ల కళ్ళతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎటువంటి చైనా న్యూస్ వచ్చినా సరే అది ఇట్టే క్షణంలో ట్రెండింగ్ లోకి వచ్చి వైరల్ అవుతోంది అంటే మూవీ పై అందరిలో ఏ స్థాయిలో అంచనాలు క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుతున్న సమాచారం ఈ Globe Trotter మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2027 [ప్రథమార్ధంలో ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేలా టీమ్ ప్లాన్ సి చేస్తోందని వినికిడి.
గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ విడుదల తేదీపై తాజా వార్తలు
వచ్చే ఏడాది మధ్యకల్లా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అక్కడి నుండి మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పేరు గాంచిన పలు హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ లో జరుగుతాయని అంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా ఇంతటి గ్రాండియర్ మూవీ కోసం ప్రత్యేకంగా డైట్ తీసుకోవడంతో పాటు వినూత్నంగా గడ్డం పెంచారు, ఫుల్ బల్క్ గా బాడీ కూడా పెంచుతున్నారు, అలానే ఫుల్ క్రాఫ్ తో ఆయన మరింత అందంగా కనపడుతున్నారు.
అయితే అక్కడక్కడా ఒకటి రెండు లీక్స్ మూవీ నుండి బయటకు రావడంతో మూవీ టీమ్ అప్రమత్తమై ఇకపై అటువంటివి జరుగకుండా పూర్తిగా గట్టి జాగ్రత్తలు తీసుకుందట. ఫైనల్ గా చెప్పాలి అంటే ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇప్పుడే ఇంతలా ప్రభంజనం రేపుతోంటే రేపు అనౌన్స్ మెంట్ వచ్చి, టైటిల్ ప్రకటించి అక్కడి నుండి మూవీకిస్ సంబంధించి ఒక్కొక్క అప్ డేట్ బయటకు రావడం, చివరిగా మూవీ రిలీజ్ టైం కి ఆకాశమే హద్దుగా ఇంకా అంతకు మించేలా ఊహకందరి స్థాయిలో దీనిపై అంచనాలు ఏర్పడుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.
మన భారతీయ సినిమా ఖ్యాతిని మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా పరిశ్రమ యొక్క కీర్తిని హాలీవుడ్ స్థాయికి చాటి చెప్పేందుకు సిద్దమైన ఈ ప్రతిష్ఠాత్మక మూవీ అతిపెద్ద విజయం అందుకుని భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగు మూవీ మీడియా వారు ముందస్తుగా ఆ టీమ్ కి ప్రత్యేకంగా విజయాభినందనలు తెలుపుతోంది.
What's Your Reaction?






