Latest Tollywood Telugu Cinema News and Interesting Updates
Get real-time Tollywood and Telugu cinema news, actor updates, film releases, and more. Stay updated with trending entertainment news on Telugu Movie Media

టాలీవుడ్ (Tollywood) సినిమాలు ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఏటా హాలీవుడ్ స్థాయికి దూసుకెళ్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన పుష్ప 2 మూవీ ఎంతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసందే. అంతకముందు బాహుబలి సిరీస్ అనంతరం ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ దేవర పార్ట్ 1, కల్కి 2898 ఏడి మూవీస్ అన్ని కూడా ఎంతో పెద్ద బాక్సాఫీస్ సంచలనాలు సృష్టించి బాలీవుడ్ ఆడియన్స్ ని సైతం ఎంతో ఆకర్షించాయి.
కాగా ఈ ఏడాది ఇప్పటికే పలు తెలుగు మూవీస్ మన ఆడియన్స్ ముందుకి వచ్చి వారికి బాగా ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ ఏడాది రిలీజెస్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. మరి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు అలానే త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమాల యొక్క పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
SSMB29
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rjamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 29. ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న సాధారణ ప్రేక్షకుల్లో ఎన్నో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithiviraj Sukumaran) కీలక పాత్రలని చేస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈమూవీలో మహేష్ బాబు తన కెరీర్ లో పోషించని ఒక అద్భుతమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికె పదిహేను శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. అలానే పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు టాక్. వాస్తవానికి రాజమౌళి సినిమాల్లో హీరోతో పాటు విలన్ పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాగా ఆ పాత్ర కోసం ఒక నల్ల జాతీయుడైన హాలీవుడ్ నటుడిని ఇప్పటికే జక్కన్న అండ్ టీమ్ ఎంపిక చేసిందట. కాగా ఈ మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
టాలీవుడ్ – తాజా తెలుగు సినిమా వార్తలు
They Call Him OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) జూన్ 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే దీనితో పాటు మరోవైపు సుజీత్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ ఓజి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఓజి మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఓజి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది. మరి అందరిలో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
Ntr Neel Movie Dragon
టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramaro Jr) ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి అయాన్ ముఖర్జీ తీస్తున్న వార్ 2 (War 2) మూవీ తో పాటు మరోవైపు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ (Dragon) అనే మాస్ పాన్ ఇండియన్ మూవీ కూడా చేస్తన్నారు. దీనిని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా రవి బస్రూర్ స్నాగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని అలానే మూవీ యొక్క బ్యాక్ డ్రాప్ 1980 ల కాలం సమయంలో సాగుతుందని అంటున్నారు. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో అలానే గతంలో తాను తీసిన కెజిఎఫ్ సిరీస్ సినిమాలు, సలార్ సినిమాలని మించేలా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలో ఎన్టీఆర్ నీల్ మూవీ గురించిన పూర్తి వివరాలు అలానే అప్ డేట్స్ ఒక్కొక్కటిగా వరుసగా రానున్నాయి. ఈ మూవీని 2026 జూన్ 25 న గ్రాండ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
ఇండస్ట్రీలో తాజా అప్‌డేట్స్
Peddi
పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇటీవల శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో రాజీవ్ కనకాల, సముద్రఖని, శ్రీకాంత్, అంజలి తదితరులు నటించారు. అయితే ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఏమాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.
అయితే దీని అనంతరం ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పెద్ది. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఒక్కోఅసరిగా అంచనాలు అమాంతంగా పెంచేసింది. ఇక ఈ మూవీని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దీనిని 2026 సమ్మర్ కానుకగా మార్చి 27న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
Spirit
ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి మారుతీ తీస్తున్న ది రాజాసాబ్ (The Rajasaab) కాగా మరొకటి హను రాఘవపూడి తీస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ రెండు సినిమాల్లో ది రాజాసాబ్ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుండగా మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్ (Riddi Kumar), నిది అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా హను రాఘవపూడి మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. అయితే వీటి అనంతరం త్వరలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్.
ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా బాలీవుడ్ అందాల నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హీరోయిన్ గా నటించనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈమూవీని భద్రకాళి మూవీస్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికోలో ప్రారంభించనున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ వైడ్ సాధారణ ప్రేక్షకుల్లో కూడా స్పిరిట్ మూవీ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకడు సందీప్ రెడ్డి వంగా దీనిని తెరకెక్కించనున్నట్లు టీమ్ చెప్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ కానుంది.
స్టార్ హీరోల సినిమాల వివరాలు
AA 22
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఇటీవల గ్రాండ్ గా అనౌన్స్ అయిన AA22 మూవీ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 (Pushpa 2 The Rule) ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన అల్లు అర్జున్ దీని ద్వారా ఇండియా వైడ్ అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అట్లీ తో ఆయన చేస్తున్న మూవీని ప్రముఖ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్, హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్ స్వరాలు సమకూర్చనున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ద్వారా తొలిసారిగా ట్రిపుల్ రోల్ లో అల్లు అర్జున్ కనిపించనున్నట్లు టాక్. అలానే ఈ మూవీలో దీపికా పదుకొనె (Deepika Padukone), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్స్ గా నటించనున్నారని, ఇటీవల వారికి దర్శకుడు అట్లీ స్టోరీ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నట్లు చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన క్రేజీ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీని వేగవంతంగా షూటింగ్ పూర్తి చేసి 2026 చివర్లో రిలీజ్ చేసేందుకు టీమ్ అయితే ప్లాన్ చేస్తోందట.
What's Your Reaction?






