Vijay Deverakonda Kingdom Trailer Release, Review and Public Response
Watch Vijay Deverakonda's Kingdom movie trailer and read detailed reviews and first public response to the action-packed teaser

యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakoknda) తాజాగా తన సినిమాల లైనప్ పై ఎంతో శ్రద్ధ పెట్టారు. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పెట్ల తీసిన ది ఫ్యామిలీ స్టార్ (The Family Star) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయి అయితే అందుకోలేకపోయారు విజయ్.
అనంతరం కొంత గ్యాప్ తీసుకుని గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో ఆయన చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్ (Kingdom). ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత స్థాయిలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగ వంశీ (Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
కింగ్‌డమ్ ట్రైలర్ విడుదల వివరాలు
ఇప్పటికే కింగ్డమ్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గిరీష్ గంగాధరన్, జొమోన్ టి జాన్ కలిసి సంయుక్తంగా ఈ మూవీ యొక్క ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ హృదయం లోపల సాంగ్ ని అనిరుద్ తో కలిసి అనుమిత నదేశన్ అద్భుతంగా పాడారు.
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ (Youtube) లో మంచి వ్యూస్ అండ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పటివరకు సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెంచింది. ఇక ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో విలక్షణ నటుడు సత్యదేవ్, కౌశిక్ మహతా కనిపించనున్నారు.
గౌతమ్ తిన్ననూరి స్వయంగా కథని అందించిన ఈమూవీ పై హీరో విజయ్ తో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఎంతో శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. జులై 4న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానున్న ఈ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ విజయ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు ని కూడా ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కింగ్‌డమ్ ట్రైలర్ విశ్లేషణ
ముఖ్యంగా కింగ్డమ్ ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ లుక్ ని బట్టి చూస్తే ఇది పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని కొంతవరకు మనకి అర్ధం అవుతుంది. అయితే విషయం ఏమిటంటే, కింగ్డమ్ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ (Kingdom Trailer) ని జూన్ మూడవవారంలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.
ముఖ్యంగా త్వరలో రిలీజ్ చేయనున్న మిగతా సాంగ్స్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ తరువాత కింగ్డమ్ మూవీ పై అందరిలో అంచనాలు విపరీతంగా పెరగడం ఖాయం అంటున్నారు. అలానే తప్పకుండా మూవీ ఆ అంచనాలకు మించి ఉండేలా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు.
ప్రేక్షకుల తొలి స్పందన
మరి ఈ మూవీ విజయ్ దేవరకొండ కి ఎంత మేర సక్సెస్ అందిస్తుందో చూడాలి. అయితే ఈ మూవీ అనంతరం ఇప్పటికే మరొక రెండు మూవీస్ ని లైన్ లో పెట్టారు విజయ్. అందులో ఒకటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందనున్న రౌడీ జనార్ధన (Rowdy Janardhana) కాగా మరొకటి రాహుల్ సంకృత్యాన్ తీయనున్న మూవీ.
ప్రస్తుతం ఈ రెండు మూవీస్ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ రూపొందుతోంది. అలానే వీటి తరువాత పెళ్లి చూపులు (Pelli Choopulu) దర్శకుడు తరుణ్ భాస్కర్ తో కూడా ఒక మూవీ చేసేందుకు విజయ్ దేవరకండ సిద్దమవుతున్నట్లు. ఇటువంటి లేటెస్ట్ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అప్ డేట్స్ కోసం తరచు మా Telugu Movie Media వెబ్ సైట్ చెక్ చేస్తూ ఉండండి.
What's Your Reaction?






