Rashmika Mandanna's Family: Background, Members, and Rare Facts

Know about Rashmika Mandanna's family members, her personal background, and rare facts about her private life.

Rashmika Mandanna's Family: Background, Members, and Rare Facts

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న నటి నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఫస్ట్ టైం తెలుగులో ఆమె నటించిన సినిమా ఛలో. యువ నటుడు నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 

అలానే తొలి సినిమా తోనే తెలుగు ఆడియన్స్ నుండి హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న రష్మిక, ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు. ఆపై గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం మూవీ లో హీరోయిన్ గా నటించారు రష్మిక. 

రష్మిక మందన్న కుటుంబం గురించి పూర్తి సమాచారం

ఆ సినిమా రిలీజ్ తరువాత అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. అనంతరం టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరసన సరిలేరు నీకెవ్వరు మూవీ లో నటించే ఛాన్స్ పట్టేసిన రష్మిక, గత ఏడాది రిలీజ్ అయిన ఆ మూవీ ద్వారా మరొక సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. 

ఆపై యువ నటుడు నితిన్ నటించిన భీష్మలో కూడా హీరోయిన్ గా నటించి మరొక సక్సెస్ అందుకున్నారు రష్మిక. తెలుగులో ప్రస్తుతం శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలు చేశారు రష్మిక మందన్న. ముందుగా పుష్ప 1 మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి ఆమెకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. 

అనంతరం గత ఏడాది దానికి కొనసాగింపుగా రిలీజ్ అయిన పుష్ప 2 ది రూల్ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సొంతం చేసుకుని కెరీర్ పరంగా రష్మిక కు పెద్ద విజయం అందించింది. ఆ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకోవడంతో పాటు అందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. 

రష్మిక కుటుంబ సభ్యుల వివరాలు

ఇక అటు హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో ఆమె చేసిన ఆనిమల్ మూవీ రూ. 930 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని బాలీవుడ్ లో కూడా ఆమెకు బాగా క్రేజ్ తీసుకువచ్చింది. అనంతరం ఇటీవల విక్కీ కౌశల్ హీరోగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఛావా మూవీలో నటించారు.

అందులో ఆమె శంభాజీ భార్య యేసుబాయ్ భోంస్లే పాత్రలో తన ఆకట్టుకునే నటనతో అందరినీ మెప్పించారు. ఆ కూడా బాక్సాఫీస్ వద్ద బాగా విజయవంతం అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భాషల యొక్క క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగులో ఛలో కంటే ముందు ఆమె కన్నడలో కిరిక్ పార్టీ అనే మూవీలో నటించారు. 

రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అక్కడ సూపర్ హిట్ కొట్టి కన్నడ ఆడియన్స్ లో ఫస్ట్ సినిమానే ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే అదే సంయమలో హీరో రక్షిత్ తో ప్రేమలో పడ్డ రష్మిక, అతడితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే కొన్ని అనుకోని కారణాల వలన వారిద్దరి వివాహం మాత్రం జరుగకుండా నిలిచిపోయింది. 

ఆ తరువాత నుండి పూర్తిగా సినిమాల్లో బిజీ అయిపోయిన రష్మిక ప్రస్తుతం కన్నడ, తెలుగు తో పాటు తమిళ్, హిందీ సినిమా పరిశ్రమల్లో కూడా అవకాశాలతో కొనసాగుతోంది. కర్ణాటక లోని కొడగు జిల్లా వజ్రపేట్ లో జన్మించిన రష్మిక, సైకాలజీ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అలానే ఎమ్ ఎస్ రామయ్య కాలేజీ లో ఇంగ్లీష్ లిటరేచర్ కూడా పూర్తి చేసిన రష్మిక ఆపై మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. 

రష్మిక కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆమె తండ్రి ఎమ్ ఏ మందన్న, తల్లి సుమన్ మందన్న. ఇక రష్మిక కు ఒక చెల్లెలు కూడా ఉన్నారు, తన పేరు షిమా మందన్న. మొదటి నుండి అన్ని విషయాల్లోనూ రష్మిక ఎంతో చురుకుగా ఉండేదని, అందుకే తనకు మోడలింగ్ అంటే ఇష్టం కాబట్టి చదువుల అనంతరం  ఆమెను ఆ ఫీల్డ్ కు పంపామని, అయితే ఆ తరువాత అనుకోకుండా తొలిసారిగా తనకు కిరిక్ పార్టీ మూవీ లో ఛాన్స్ రావడంతో, అనూహ్యంగా ఆ మూవీ సూపర్ హిట్ కొట్టి ఫస్ట్ సినిమా ద్వారానే ఆమెకు నటిగా మంచి పేరు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు రష్మిక మందన్న తల్లితండ్రులు. 

ఇక ఎప్పటికప్పుడు తన సినీ, ఫ్యామిలీ విషయాలను గురించి ఫ్యాన్స్ తో సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకునే అలవాటున్న రష్మిక, తరచు తన తల్లిదండ్రుల గురించి సరదాగా గడిపిన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అటు హ్యాపీగా ఫ్యామిలీ తో గడుపుతూ ఇటు సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు రష్మిక. ఇక ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో హీరోయిన్ గా రష్మిక కు మరింత క్రేజ్ తో పాటు మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow