Telugu Movies OTT Releases – Latest Streaming Updates
Find Telugu Movies OTT Releases list with latest streaming updates, digital premieres, OTT platforms, and watch online details of Tollywood films.

ముఖ్యంగా మనం ఒక్క విషయం గమనిస్తే ఇటీవల కరోనా సమయంలో పూర్తిగా జనాభా అంతా కూడా ఇంటికే ఎక్కువగా పరిమితం అవ్వడంతో మెల్లగా మన జీవితాల్లోకి ప్రవేశించిన OTT Apps కొద్దీ కొద్దిగా మనకు చేరువ అయ్యాయి. అప్పటికే ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన Netflix, Amzaon Prime Video, SonyLiv, zee5, HotStar వంటివి ఉండగా తరువాత Aha, Jio, ETV Win వంటి సంస్థలు మెల్లగా రంగప్రవేశం చేసాయి.
ఇక అక్కడి నుండి ఎక్కువగా ఇళ్లలో ఉన్న వారందరూ కూడా OTT లో సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ వచ్చారు. అదే సమయంలో కొన్ని చిన్న, పెద్ద సినిమాలు ఓటిటి లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యాయి. ఆ విధంగా ఓటిటి మెల్లగా Movie Theatres కి కొంత పరోక్ష దెబ్బ వేస్తూ వచ్చింది. మరిన్ని యాప్స్ రంగప్రవేశంతో పాటు నెలవారీ సబ్ స్క్రిప్షన్స్ ధర కూడా కొన్ని యాప్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో మెజారిటీ ఆడియన్సు ఓటిటి సినిమాల పై మొగ్గుచూపుతున్నారు.
Telugu Movies OTT Release List
వాస్తవానికి ఇటీవల పలు సౌత్ సినిమాలు 4 వారాల్లో అలానే నార్త్ సినిమాలు 8 వారాల్లో ఓటిటి లోకి వచేస్తుండడంతో థియేటర్స్ లో టికెట్ ధరలు పెట్టగలిగిన వారు వెళ్లి చూస్తుంటే మరికొందరు మాత్రం OTT Releases కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పలు పెద్ద సినిమాలు మొదటి వారాల్లో అత్యధిక ధరలు ఉండడం, అటు పలు Multiplex లలో టికెట్ రేట్స్ తో పాటు తినుబండారాల రేట్లు కూడా ఎక్కువ ఉండడంతో దిగువ వర్గాల వారు ఎప్పటికప్పుడు Latest OTT Releases వైపు చూస్తున్నారు.
ఆ విధంగా అటు థియేటర్స్ లో సందడి సి చేసిన అంతరం ఇటు ఓటిటి ;లోకి కూడా వచ్చిన మూవీస్ ఈ విధంగా కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రతి సినిమా రిలీజ్ ముందే Satellite Rights తో పాటు OTT Rights కూడా అమ్ముడవుతుండడంతో కొన్ని సంస్థలు సినిమాల ఒక్క రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేస్తున్నాయి. ఆ విధంగా తాజాగా రిలీజ్ అయిన పలు సినిమాలు ఏవేవి ప్రస్తుతం ఓటిటి లోకి వచ్చాయి, రానున్నాయి అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం.
Paradha : (Paradha OTT Release Date)
యువ అందాల నటి Anupama Parameswaran ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా Parada. ఈ మూవీని యువ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తీసిన ఈ మూవీలో Darshana Rajendran తో పాటు Sangeetha Krish కీలక పాత్రలు చేసారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీని ఆనంద మీడియా సంస్థ పై శ్రీనివాసులు, విజయ్, శ్రీధర్ గ్రాండ్ గా నిర్మించారు. 22 ఆగష్టు 2025న థియేటర్స్ లో రిలీజ్ అయిన పరదా మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఇందులోని సుబ్బు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనబరిచిన సహజ నటనకు అందరి నుండి విశేషమైన ప్రసంశలు కురిసాయి. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం Amzaon Prime Video ద్వారా పలు భాషల ఆడియన్సు కి అందుబాటులో ఉంది. ఓటిటి లో కూడా పరదా మంచి క్రేజ్ అందుకుంటోంది.
Su from So :(Su from So OTT Release Date)
ఇటీవల Kantara, KGF Chapter 1, KGF Chapter 2 సినిమాల అనంతరం తాజాగా అక్కడ తెరకెక్కిన మూవీ Su from So. ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా మూవీని JP Thuminad తెరకెక్కించగా Shaneel Gautham, Raj B Shetty, Sandhya Arakere కీలక పాత్రల్లో నటించారు. ప్రారంభం నుండి మంచి కామెడీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ మూవీ యొక్క బడ్జెట్ రూ. 6 కోట్లు. కాగా రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏకంగా రూ. 125 కోట్లు రాబట్టి Su from So Total Box Office Collection సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్క పాత్రధారి నటన ఇందులో ఎంతో అలరిస్తుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ JioHotsar లో పలు భాషల్లో అందుబాటులో ఉంది. మరోవైపు ఈ సినిమాకి OTT లో కూడా సూపర్ రెస్సాన్స్ లభిస్తోంది.
Coolie : (Coolie OTT Release Date)
Superstar Rajinikanth హీరోగా Shruti Haasan, Upendra, Aamir Khan, Nagarjuna Akkineni, Soubin Shahir కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ Coolie. ఈ మూవీని యువ దర్శకుడు Lokesh Kanagaraj తెరకెక్కించగా ప్రఖ్యాత సంస్థ Sun Pictures గ్రాండ్ గా అత్యధిక వ్యయంతో నిర్మించింది. Anirudh Ravichander సంగీతం అందించిన ఈమూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చింది. రజనీకాంత్ కూలీగా నటించిన ఈమూవీ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయి ఓవరాల్ గా ఎబోవ్ యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. ఇందులో నాగార్జున Simon పాత్రలో విలన్ గా తన నటనతో అందరినీ అలరించారు. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం Amazon Prime లో పలు భాషల్లో అందుబాటులో ఉంది. అటు థియేటర్స్ తో పాటు ఇటు ఓటిటి లో కూడా కూలీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
Latest Digital Premiere & Streaming Updates
F1(Film) : (F1 (film) OTT Release Date)
Hollywood లో ఇటీవల స్టార్ నటుడు Brad Pitt ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ F1. ఈ మూవీని Joseph Kosinski తెరకెక్కించగా Apple Studios, Jerry Bruckheimer Films, Plan B Entertainment, Monolith Pictures, Dawn Apollo Films సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 300 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించగా ఓవరాల్ గా ఇటీవల రిలీజ్ అనంతరం అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకున్న ఈ మూవీ F1 Total Worldwide Collection 630 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథ కథనాలతో ముఖ్యంగా హృద్యమైన ఎమోషనల్ అంశాల ప్రధానంగా రూపొందిన ఈ మూవీ హీరో బ్రాడ్ పిట్ నటనకు మరింత పేరు లభించింది. ఇక తాజాగా F1 మూవీ Amazon Prime Video లో తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా థియేటర్స్ లో ఇండియాలో కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన ఈ మూవీ అటు ఓటిటి లోను విశేషమైన స్పందన అందుకుంటోంది.
War 2 : (War2 OTT Release Date)
తొలిసారిగా Bollywood నటుడు Hrithik Roshan తో కలిసి Tollywood స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జత కట్టిన మూవీ War 2. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో అందాల కథానాయిక Kiara Advani హీరోయిన్ గా నటించగా ప్రముఖ సంస్థ Yashraj Films దీనిని భారీ వ్యయంతో నిర్మించింది. యువ దర్శకుడు అయాన్ ముఖేర్జీ తీసిన ఈమూవీలో ఎన్టీఆర్, హృతిక్ ల ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఓవరాల్ గా ఇంకా థియేటర్స్ లో ప్రదర్శితం అవుతూ యావరేజ్ విజయం అందుకున్న War2 Total Box Office Collection రూ. 430 కోట్లు. ఇక అక్టోబర్ నెలలోనే ఈ మూవీ ఓటిటి లో అందుబాటులోకి రానుంది. Netflix ద్వారా ఈ మూవీ పలు భాషల్లో ఓటిటిలో రిలీజ్ కానుంది. మరి దీనికి ఓటిటి లో ఎంతమేర రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
Bakasura Restaurant : (Bakasura Restaurant OTT Release Date)
యువ దర్శకుడు SJ Shiva తీసిన లేటెస్ట్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బకాసుర రెస్టారెంట్. ఈ మూవీలో ప్రవీణ్, Krishna Bhagawan, Harsha Chemudu, Garuda Ram కీలక పాత్రల్లో నటించగా లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి గ్రాండ్ గా నిర్మించారు. ఇటీవల అనగా 8 ఆగష్టు 2025 న ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఈ మూవీలో హర్ష చెముడు, ప్రవీణ్ సహా కీలక పాత్రధారుల అందరి నటనతో పాటు కథ, కథనాలకు విమర్శకుల నుండి సైతం మంచి పేరు లభించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ తో పాటు Sun Nxt లో కూడా ఓటిటి ఆడియన్సు కి అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాగా రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
Mirai : (Mirai OTT Release Date)
Hanu-Man వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో హీరోగా మంచి పేరు, క్రేజ్ సొంతం చేసుకున్న Teja Sajja హీరోగా రూపొందిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Mirai. ఈ మూవీలో Rithika Nayak హీరోయిన్ గా నటించగా Manchu Manoj విలన్ పాత్ర చేసారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే నుండే మంచి టాక్ తో పాటు ప్రస్తుతం Mirai Box office Collection పరంగా రూ. 100 కోట్ల మార్క్ ని దాటేసి దూసుకెళ్తోంది. హీరో తేజ సజ్జ అలరించే యాక్టింగ్ తో పాటు గ్రాండ్ విజువల్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా బాగా రాబడుతున్న ఈ మూవీ మొత్తంగా ఎనిమిది వారాల అనంతరం OTT Release కానుంది.
OTT Platforms & Online Watch Movies Series Details
Little Hearts (2025 Film) : (Little Hearts OTT Release Date)
యువ నటుడు Mouli Tanuj Prasanth, Shivani Nagaram, Jai Krishna ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన లేటెస్ట్ కామెడీ యూత్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Little Hearts. రిలీజ్ కి ముందుగా ప్రదర్శించిన ప్రీమియర్స్ తోనే అందరి నుండి బాగా రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చి మరింత బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న Little Hearts Box Office Collection రూ. 35 కోట్ల మార్క్ ని దాటేసింది. ముఖ్యంగా ప్రధాన పాత్రధారుల ఆకట్టుకునే నటనతో పాటు కామెడీ సీన్స్, డైలాగ్స్ వంటివి థియేటర్స్ లో ఆడియన్సు ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతున్న లిటిల్ హార్ట్స్ మూవీ అక్టోబర్ చివర్లో ETV Win మాధ్యమం ద్వారా ఓటిటిలో రిలీజ్ కానుంది.
Kishkindhapuri : (Kishkindhapuri OTT Release Date)
బెల్లంకొండ శ్రీనివాస్ BellamKonda Sai Srinivas, Anupama Parameswaran హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన లేటెస్ట్ హర్రర్ జానర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కిష్కింధపూరి. ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ టీజర్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది. ఆపైన రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ ద్వారా బాగా పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ రిలీజ్ రోజు నుండే బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో అదరగొడుతూ కొనసాగుతోంది. ఆకట్టుకునే కథ, కథనాలు, హర్రర్ అంశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి ఈ మూవీలో ప్రధాన హైలైట్. అలానే Sandy Master పాత్ర మరొక బలం. మొత్తంగా ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతూ Kishkindhapuri Box Office Collection అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్ అందుకుంటోంది. ఇక ఈ మూవీ అక్టోబర్ చివర్లో నాలుగు వారాల తరువాత OTT లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
What's Your Reaction?






