SSMB29: Mahesh Babu and SS Rajamouli’s Film Shooting Begins in Odisha!

Mahesh Babu and SS Rajamouli’s highly anticipated film SSMB29 has begun shooting in Odisha. Check out the latest updates on this grand project!

SSMB29: Mahesh Babu and SS Rajamouli’s Film Shooting Begins in Odisha!

 సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ ఎంట్రటైనేర్ మూవీ SSMB29. భారతీయ సినిమా చరిత్రలో పాన్ ఇండియన్ ని మించేలా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతోన్న ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు గ్లోబల్ గా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

SSMB29 Grand Shooting Kickstarts in Odisha

ఈ మూవీలో మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక పవర్ పాత్ర చేస్తుండగా పలువురు ఇండియా తో పాటు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇక తన పాత్ర కోసం ఇప్పటికే ఫుల్ గా గడ్డం, క్రాఫ్ పెంచిన మహేష్ బాబు మరోవైపు ఫుల్ గా బాడీ కూడా పెంచుతున్నారు. 

ఆయన మూవీలో పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. లోకం చుట్టేవీరుడిగా ఇందులో మహేష్ కనిపించనుండగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని టాక్. గతంలో మహేష్ బాబు డేట్స్ ని లాక్ చేసిన ఎస్ ఎస్ రాజమౌళి, ఆయనని అడవిరాజు సింహంతో పోలుస్తూ దానిని జైలులో బందిస్తూ పాస్ పోర్ట్ లాక్కున్న చిన్న సరదా గ్లింప్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు జక్కన్న. 

ఆ వీడియో దాదాపుగా 50 మిలియన్ కి పైగా వ్యూస్ తో వరల్డ్ వైడ్ విశేషమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఆయన గ్లింప్స్ వీడియో క్రింద, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన కామెంట్ కూడా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఆ విధంగా వినోత్నంగా ఈ ప్రాజక్ట్ యొక్క పనులు ప్రారంభించిన రాజమౌళి, దీని యొక్క షూటింగ్ ని కూడా ఎప్పటికప్పుడు వేగవంతంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

Mahesh Babu’s New Look Creates Buzz

ఇప్పటికే SSMB 29 మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక గ్రాండ్ సెట్టింగ్ లో జరిపారు, తాజగా అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుండి ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని ఒడిశా లోని కోరాపుట్ లో జరుపనున్నారు. కాగా తూర్పు కనుమలలో భాగమైన కోరాపుట్ ప్రాంతంలో అద్భుతమైన సుసంపన్నమైన ఖనిజ నిక్షేపాలు మరియు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. 

అక్కడి పలు ప్రత్యేక ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకునేందుకు ఇప్పటికే జక్కన్న అండ్ టీమ్ అక్కడి స్థానిక ప్రభుత్వం యొక్క అనుమతి కూడా తీసుకుందట. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రియాంక కొన్నేళ్ల గ్యాప్ అనంతరం ఈ మూవీ ద్వారా మళ్ళి మన భారతీయ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

Rajamouli’s Vision for a Visual Spectacle

అలానే మలయాళ స్టార్ నటుడు, దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ మూవీలో ఒక ముఖ్య పాత్ర చేయనున్నారు. తాజాగా ఒడిశా చేరుకునేందుకు పయనమైన తన భర్త మహేష్ బాబుని ప్రత్యేకంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా పంపేందుకు నమ్రత కూడా విచ్చేసిన వీడియో నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరోవైపు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా అక్కడికి చేరుకోగా, కేరళ నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒడిశా ఎయిర్ పోర్ట్ లో ఆయన తన భార్యతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

త్వరలో అనగా ఏప్రిల్ మొదటి వారంలో ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్. ఇక ఈ మూవీలోని ఇతర పాత్రల యొక్క ఇప్పటికే ఒక హాలీవుడ్ క్యాస్టింగ్ సంస్థతో రాజమౌళి ఒప్పందం చేసుకున్నారు. త్వరలో మిగతా పాత్రధారుల యొక్క డీటెయిల్స్ కూడా వెల్లడి కానున్నాయి. 

High-Budget Action Sequences Planned

శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow