SSMB29 Release Date Locked: All Details Revealed
SSMB29 release date locked! Check complete updates about Mahesh Babu and SS Rajamouli's much-awaited pan-India film only on Telugu Filmy

సూపర్ స్టార్ మహేష్ హీరోగా తాజాగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29. ఈ మూవీ పై సూపర్ స్టార్ మహెష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లాక్ అయిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్రతో పాటు భారీ స్థాయి యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ రేంజ్ లో అదిరిపోతాయట.
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ సినిమా విడుదల తేదీ ఖరారు!
ఇప్పటికే పలు హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ ని ప్రత్యేకంగా కలిసిన రాజమౌళి, తమ సినిమా యొక్క ఔట్పుట్ విషయమై వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారట. ఇటీవల రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీ యొక్క యొక్క లేటెస్ట్ షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిలిం సిటీలో జరుగనుంది. అనంతరం టీమ్ మొత్తం కెన్యా, సౌత్ ఆఫ్రికా, బల్గెరియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్తుందట.
అక్కడ భారీ స్థాయిలో పలు సీన్స్ తీయనున్నారని టాక్. ఇక ఇటీవల తీసిన సీన్స్ లో ఒక గ్రాండియర్ సాంగ్ ని ప్రత్యేకంగా పిక్చరైజ్ చేసారని, దానికి రాజు సుందరం డ్యాన్స్ కంపోజ్ చేసారని తెలుస్తోంది. ఇక ఈమూవీ కోసం ప్రత్యేకంగా ఎంతో జాగ్రత్తగా సాంగ్స్ కంపోజ్ చేయాల్సి వస్తోందని, భారతీయ సినిమా చరిత్రలో ఇటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ సినిమా రాలేదని, తొలిసారిగా సూపర్ స్టార్ తో వర్క్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి.
ఇక SSMB29 మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా కొందరు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న SSMB 29
ముఖ్యంగా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బాడీతో పాటు హెయిర్, గడ్డం పెంచారు సూపర్ స్టార్ మహేష్. ఈ ప్రతిష్టాత్మక సినిమాని రెండు పార్టులుగా తీయనున్నారు అని కొన్నాళ్ల క్రితం వార్తలు రాగా తాజాగా అప్ డేట్ ప్రకారం ఇది కేవలం ఒకటే మూవీగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. తాను చెప్పదల్చుకున్న కథ మొత్తం కూడ ఒక్క పార్ట్ కె కుదించి ఆడియన్స్ ని అద్భుతంగా థ్రిల్ చేసేలా జక్కన్న అండ్ టీమ్ రేయింబవళ్లు ఈ మూవీ కోసం కష్టపడుతోందట.
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ కానుకగా మార్చి 25న గ్రాండియర్ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే SSMB29 మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ కి సంబంధించి రెండు నిమిషాల నిడివి గల చిన్న గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసి అందులోనే విడుదల దీదీ కూడా జత చేయనున్నారట.
SSMB 29 తాజా అప్డేట్స్, షూటింగ్ డిటేల్స్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్
అయితే ఏప్రిల్ నెలలోనే ఈ మూవీ యొక్క అప్ డేట్ వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మే రెండవ వారానికి వాయిదా వేసారట జక్కన. ఇప్పటికే ఈ గ్లింప్స్ టీజర్ ని హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలో వర్క్ చేస్తున్నారని టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే పక్కాగా ఈ మూవీ రిలీజ్ అనంతరం భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖిండం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ఇప్పటికే టాలీవుడ్ లో తిరుగులేని శిఖరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రీజినల్ సినిమాలతో చక్రవర్తిలా అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలుకొట్టి దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ రిలీజ్ అనంతరం తన క్రేజ్, రేంజ్ ని గ్లోబల్ రేంజ్ కి పెంచుకోవడం ఖాయంగా కనపడుతోంది.
What's Your Reaction?






