Mahesh Babu's Luxury Caravan: Cost, Interior, and Stunning Features
Discover Mahesh Babu's luxurious caravan features, interior designs, and the total cost details. A glimpse into Tollywood's stylish star life.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ పై ఎంతో భారీ ఎత్తున నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ పాత్ర చేస్తుండగా ఇందులో ఆయనకు జోడిగా ఒక ప్రముఖ నటి నటిస్తోంది.
మహేష్ బాబు కారవాన్ ఖర్చు వివరాలు
పీఎస్ వినోద్ కెమెరా మ్యాన్ గా పని చేస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే తన సినిమా కెరీర్ పరంగా వరుసగా డబుల్ హ్యాట్రిక్స్ తో సూపర్ హిట్స్ అందుకున్న మహేష్, మంచి జోరుమీద ఉన్న విషయం తెలిసిందే.
జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకుని మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. దీని తరువాత పలు భారీ పాన్ వరల్డ్ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు.
మహేష్ బాబు లగ్జరీ వాన్ లో ప్రత్యేకతలు
ముఖ్యంగా SSMB 29 మూవీ రిలీజ్ అనంతరం హీరోగా మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా నటుడిగా భారీ క్రేజ్ ని అలానే మార్కెట్ ని సొంతం చేసుకోవడం ఖాయం. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారం కీలక పాత్రలు చేస్తున్న ఈమూవీ ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని జరుపుకుంది.
త్వరలో మూవీ టీమ్ సౌత్ ఆఫ్రికా, కెన్యా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు వెళ్లి అక్కడ పలు కీలక సీన్స్ చిత్రీకరించనున్నారు. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ కానుకగా మార్చి చివర్లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, అతడు సినిమా సమయంలో తొలిసారిగా క్యారవ్యాన్ ని కొనుగోలు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పట్లో అత్యధిక ధర పెట్టి దానిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
ఒక్కోసారి షూటింగ్ సమయంలో పలు లొకేషన్స్ విజిట్ చేయాల్సి వస్తుందని అటువంటి సందర్భంలో యూనిట్ వారిని పెద్దగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని మహేష్, షూటింగ్ విరామ సమయంలో తన ప్రత్యేక క్యారవ్యాన్ లో ప్రశాంతంగా గడిపేవారు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, కొన్నేళ్ల నుండి ఒకే క్యారవ్యాన్ వాడుతున్న సూపర్ స్టార్, ఇటీవల ఒక వారం రోజుల క్రితం మరొక సరికొత్త క్యారవ్యాన్ ని కొనుగోలు చేయడం జరిగింది.
మహేష్ బాబు కారవాన్ లో ఉన్న ప్రత్యేక డిజైన్స్ మరియు ఫీచర్స్
కాగా అది ప్రస్తుతం పలు ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది. మరిన్ని అధునాతన హంగులతో, లేటెస్ట్ టెక్నాలజీ తో ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన ఈ లేటెస్ట్ మోడల్ క్యారవ్యాన్ దాదాపుగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీ లోనే మరొక నటుడు ఎవరికీ కూడా లేదని అంటున్నారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం దీని ధర రూ.10.5 కోట్లవరకు ఉంటుందని అంటున్నారు. ఇక రెండు రోజుల క్రితం దానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన మహేష్, ప్రస్తుతం వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తన సరికొత్త క్యారవ్యాన్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు మరొక్కసారి టాక్ ఆఫ్ ది సౌత్ మూవీ ఇండస్ట్రీ గా మారారు.
ఎంతైనా సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని పలువురు మహేష్ ఫ్యాన్స్, ఆడియన్స్ మహేష్ బాబు ని ఉద్దేశించి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ సూపర్ ఫ్యాన్స్ లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






