SSMB29 Latest News, Shooting Updates, Cast and Crew Details

Stay updated with the latest news and exclusive updates of SSMB29 movie starring Mahesh Babu and directed by S.S. Rajamouli

SSMB29 Latest News, Shooting Updates, Cast and Crew Details

టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ చేసారు. ఈ మూవీలో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ మూవీ మంచి విజయం అందుకుని హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ని అమాంతంగా పెంచేసింది. 

ఇక  మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ SSMB29. ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే పదిహేను శాతం పూర్తి అయింది. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలిసారిగా తమ అభిమాన సూపర్ స్టార్ చేస్తున్న గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో దీని పై అందరికంటే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. 

SSMB29 తాజా షూటింగ్ అప్‌డేట్స్

బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ సృష్టికర్త జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో ఎంతో భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ పరంగా డిఫరెంట్ స్టైల్ లో సిద్దమైన మహేష్ బాబు, తన కెరీర్ లో ఇటువంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదని అంటున్నారు. 

త్వరలో ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో కోట్ల ఖర్చుతో వేసిన కాశీ సెట్టింగ్ లో జరుగనుందట. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని వి విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. 

మహేష్ బాబు పాత్ర వివరాలు

అలానే ఈ మూవీలోని ఇతర ముఖ్య పాత్రల కోసం పలువురు హాలీవుడ్ నటుల్ని కూడా తీసుకోనున్నారట. ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ ద్వారా ఆ నటుల యొక్క ఎంపిక ఇప్పటికే పూర్తి అయినట్లు చెప్తున్నారు. అయితే ఇటీవల జరిగిన SSMB29 రెండవ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ఒక పాటని కూడా చిత్రీకరించారట. 

రాజు సుందరం ఈ సాంగ్ కి ప్రత్యేకంగా డ్యాన్స్ కంపోజ్ చేసినట్లు టాక్. దేవా కట్టా ఈ ప్రతిష్టాత్మక మూవీకి డైలాగ్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ మూవీ నుండి ఇటీవల ఒక చిన్న వీడియో క్లిప్ లీక్ కావడంతో వెంటనే అప్రమత్తమైన టీమ్ వాటిపై గట్టిగా చర్యలు తీసుకుని అది మరింత వ్యాప్తం కాకుండా చూసారు. 

చిత్రానికి సంబంధించిన తాజా వార్తలు

ఇకపై తమ కంటెంట్ ఏమాత్రం బయటకు పొక్కకుండా టీమ్ వారు మూడంచెల భద్రత విధానం ద్వారా పకడ్బందే చర్యలు చేపట్టారట. ఇక ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి కూడా రేయింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారని, ఈ మూవీ రిలీజ్ అనంతరం భారతీయ సినీ చరిత్రలో పెద్ద సంచలనం సృష్టించడం ఖాయం అని టాలీవుడ్ వర్గాల టాక్. 

ఇక త్వరలో మూడవ షెడ్యూల్ అనంతరం టీమ్ మొత్తం కూడా విదేశాలకు వెళ్తుందట. సౌత్ ఆఫ్రికా, కెన్యా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, బల్గెరియా దేశాల్లో మూవీ యొక్క కీలక యాక్షన్ సీన్స్ తీయనున్నారని, హాలీవుడ్ నల్లజాతి నటుడు ఇందులో మెయిన్ విలన్ గా ఎంతో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్తున్నారు. 

ఓవరాల్ గా అయితే ఇంకా పూర్తిగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్న ఈమూవీ యొక్క అప్ డేట్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే నాడు రానుండగా మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారట. ఇక ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, తెలుగు సినిమా న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media వెబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow