Kiara Advani's Met Gala 2025 Debut: Embracing Motherhood in Gaurav Gupta's 'Bravehearts' Gown

Kiara Advani dazzled at Met Gala 2025 in Gaurav Gupta's 'Bravehearts' gown, featuring a gold breastplate symbolizing motherhood with two hearts connected by an umbilical cord.

Kiara Advani's Met Gala 2025 Debut: Embracing Motherhood in Gaurav Gupta's 'Bravehearts' Gown

ప్రస్తుతం అటు బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న నటీమణుల్లో కియారా అద్వానీ (kiara Advani) కూడా ఒకరు. తొలిసారిగా తెలుగు మూవీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా కొరటాల శివ తీసిన భరత్ అనే నేను (Bharat Ane Nenu) మూవీ ద్వారా ఆమె ఇక్కడి ఆడియన్స్ ముందుకి వచ్చారు. 

అప్పట్లో ఆ మూవీ అతిపెద్ద విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా కియారా అద్వానీకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో కియారా అందరినీ మెప్పించి అలరించారు. ఆ తరువాత తెలుగులో మరొక్కసారి ఆమె చేసిన మూవీ వినయ విధేయ రామ. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కనిపించగా బోయపాటి శ్రీను దీనిని గ్రాండ్ గా తెరకెక్కించారు. 

2025 మెట్ గాలా: కియారా అద్వానీ మాతృత్వం ప్రతిబింబించిన 'బ్రేవ్‌హార్ట్స్' గౌన్‌లో మెరిసిన తీరు

అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అనంతరం తాజాగా మరొక్కసారి రామ్ చరణ్ (Ram Charan) తో ఆమె చేసిన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించగా శంకర్ షణ్ముగం తెరకెక్కించారు. అయితే గేమ్ చేంజర్ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. 

ఇక మరోవైపు పలు బాలీవుడ్ ప్రాజక్ట్స్ తో ప్రస్తుతం ఆమె బిజీ బిజీగా కొనసాగుతున్నారు. హిందీలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తీసిన కబీర్ సింగ్ (Kabir Singh) లో ఆమె నటనకు అక్కడి ఆడియన్స్ నుండి మంచి పేరు లభించింది. తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) కి ఇది అఫీషియల్ రీమేక్. 

ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr) , బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ల కలయికలో యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తీస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2 (War 2) లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఇటీవల గర్భం దాల్చిన కియారా కొంతమేర షూటింగ్స్ కి విరామం పలికి ఎక్కువగా ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. 

గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన గోల్డ్ బ్రెస్ట్‌ప్లేట్‌తో కియారా అద్వానీ ప్రత్యేకత

కొన్నాళ్ల క్రితం భర్త సిద్దార్థ మల్హోత్రాతో కలిసి ఆమె ఒక ఆసుపత్రికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే కేవలం అవసరం అయిన ఒకటి రెండు వేడుకల్లో మాత్రమే కియారా అద్వానీ సందడి చేస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా జరుగుతున్న మెట్ గాల 2025 (Met Gala 2025) ఈవెంట్ లో భాగంగా కియారా అద్వానీ సందడి చేసారు. ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ బ్లాక్, గోల్డ్ దుస్తుల్లో అందరినీ ఆమె ఆకట్టుకున్నారు. 

అయితే ఆమె ధరించిన ఆ అద్భుతమైన దుస్తులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితం వాటికి సంబంధించి దిగిన ప్రత్యేక ఫోటోషూట్ ఫోటోలని కూడా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు కీసర అద్వానీ. కాగా ఆ దుస్తుల్ని ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా (Garurav Gupta) ఎంతో అద్భుతంగా డిజైన్ చేసారు. 

అండ్రే లియోన్ టాలీకి అంకితంగా రూపొందించిన వైట్ కేప్‌తో కియారా అద్వానీ లుక్

అయితే ఆ డ్రెస్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా గౌరవ్ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ముఖ్యంగా ఆ దుస్తుల్లోని అందమైన నలుపు, బంగారు వర్ణాలని మీరు అర్ధం చేసుకున్నారని భావిస్తున్నాను అన్నారు. వాటి యొక్క లోతు అర్ధం మీరు తెలుసుకుంటే దానిని మరింతగా ఇష్టపడతారని తెలిపారు. 

ఆ దుస్తుల యొక్క బ్రేవ్ హార్ట్స్ సవాలు, వారసత్వం, నూతన ప్రారంభాలు నివాళి అని అన్నారు. బ్రేవ్ హార్ట్స్ అనేది డాండి స్ఫూర్తి పై నిర్మించబడింది. దయ, బలం, వ్యక్తిత్వం, స్ఫూర్తిని అవి కలుగచేస్తాయి. అలానే బంగారు రంగు కవచంలోని రెండు హృదయాలు ఒకటి తల్లి, రెండవది బిడ్డని అనుసంధానం చేస్తూ బొద్దు తాడు కలిపిన విధంగా డిజైన్ చేసినట్లు తెలిపారు. కాగా కియారా అద్వానీ ధరించిన వైట్ కేప్ డిజైన్ ఆండ్రే లియోన్ టాలీకి గౌరవ చిహ్నంగా తాయారు చేసారు. కాగా ఆయన మెట్ గాలలో బ్రాండెడ్ కేప్స్ ధరించే స్టైల్ కి ప్రసిద్ధి చెందినవారు అనేది తెలిసిందే.

మొత్తంగా అయితే ఆ బ్లాక్ అండ్ గోల్డ్ దుస్తులు ధరించి మీట్ గాల 2025 ఈవెంట్ లో బేబీ బంప్ తో పాటు మెరిసిన హీరోయిన్ కియారా అద్వానీ అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు. సో, ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్, బాలీవుడ్ మూవీ అప్ డేట్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్, మూవీ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన Telugu Movie Media వెబ్ సైట్ ని సందరిస్తూ ఉండండి.   

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow