OG vs Akhanda 2 Box Office Clash – What Really Happening ?
Did Pawan Kalyan’s OG and Balakrishna’s Akhanda 2 really clash at the box office? Here’s the actual truth about both movies & trade buzz

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం సుజీత్ తీస్తున్న భారీ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో పవన్ నటిస్తుండగా ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి గత ఏడాది రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఒక్కసారిగా విశేషమైన ఆసక్తిని ఏర్పరిచింది.
OG vs Akhanda 2 Box office Clash
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఓజి మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్సు సైతం ఎంతో ఎదురుచూస్తున్నారు.
OG vs అఖండ 2 – బాక్సాఫీస్ క్లాష్ లో ఎవరు గెలుస్తారు?
ఇటీవల పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన హరి హర వీర మల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడంతో తప్పకుండ ఈ మూవీ అంచనాలు అందుకుని తమ హీరోకి భారీ విజయం అందించడం ఖాయం అని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇటీవల ఓజి నుండి రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ తో పాటు సువ్వి సువ్వి సాంగ్ రెండూ కూడా అందరినీ ఆకట్టుకుని విశేషమైన ఆదరణ అందుకున్నాయి.
మరోవైపు నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుండి ఇందులో ఒమీ బహు పాత్ర చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేయగా అది కూడా ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసింది. ఇక మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియన్ మూవీ అఖండ 2.
ఈ మూవీ ఇటీవల వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న అఖండ కి సీక్వెల్ అనేది తెలిసిందే. అఖండ మూవీ భారీ విజయం అందుకుని దీని పై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్సు లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచాయి. 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈమూవీకి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. యువ అందాల నటి సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అది పినిశెట్టి విలన్ పాత్ర చేస్తున్నాడు.
Akhanda 2 Box office 2025
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ ఈ మూవీలో కూడా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్. కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన అఖండ 2 గ్లింప్స్ కూడా విశేషమైన ఆదరణ అందుకుని మూవీ పై అమాంతంగా అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో బాలకృష్ణ పోషిస్తున్న అఘోర పాత్ర ఆయన ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకుంటుందని, తప్పకుండా మూవీ పెద్ద విజయం ఖాయమని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పవన్ కళ్యాణ్ vs బాలకృష్ణ – ఫ్యాన్స్ లో ఊపిరి బిగపట్టే పోటీ
ఇక అఖండ లో థమన్ అందించిన సాంగ్స్ తో పాటు ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎంతటి పవర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అనేది మనకు తెలిసిందే. అయితే అంతకుమించేలా ఇందులో థమన్ అదరగొడుతున్నారట. ఆ విధంగా అఖండ 2 అందరిలో ఎంతో ఆసక్తిని ఏర్పరిచింది. కాగా ఈ మూవీని కూడా సెప్టెంబర్ 25 న పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్సు ముందుకి తీసుకురానున్నట్లు చాలా రోజుల క్రితం టీమ్ ప్రకటించింది.
దానితో అటు పవన్ కళ్యాణ్ ఓజి, ఇటు బాలకృష్ణ అఖండ 2 బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఖాయం అని అందరూ భావించారు. ఒకవేళ అదే జరిగితే ఓపెనింగ్స్ మొదలుకుని లాంగ్ రన్ వరకు రెండు సినిమాలకు థియేటర్స్ కేటాయింపులు, కలెక్షన్స్ విషయంలో సమస్యలు తలెత్తడం ఖాయం. అయితే అసలు విషయం ఏమిటంటే, తమ సినిమాకు సంబంధించి ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు మరికొన్ని పనుల జాప్యం కారణంగా కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్టు అఖండ 2 మూవీ టీమ్ అఫీషియల్ గా వాయిదాని అనౌన్స్ చేసింది.
Pawan Kalyan vs Balakrishna Clash
మరోవైపు లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం అఖండ 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ ఖాయం అంటున్నారు. అయితే అదే డేట్ కి తమ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ టీమ్ ప్రకటించింది. అయితే ఆ మూవీ కూడా కొన్ని కారణాల రీత్యా వాయిదా పడి వచ్చే ఏడాది అనగా 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దానితో అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కన్ఫర్మ్ అని త్వరలోనే టీమ్ నుండి దీనికి సంబంధించి ప్రకటన కూడా త్వరలోనే రానుందని చెప్తున్నారు.
విడుదల తేదీలు, బాక్సాఫీస్ అంచనాలు
ఆ విధంగా బాక్సాఫీస్ వద్ద అఖండ 2, ఓజి క్లాష్ లేదని స్పష్టం అయింది. కాగా అఖండ 2 విడుదల వాయిదా పై కొందరు బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఓజి రిలీజ్ సెప్టెంబర్ 25 ఫిక్స్ కావడంతో మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ని విశేషముగా జరిపేందుకు డివివి ఎంటర్టైన్మెంట్స్ టీమ్ భారీగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, రెండ్ గ్లింప్స్ టీజర్స్ నుండి ఊహకందని రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో మూవీ పక్కాగా అందరి అంచనాలు అందుకుని విజయం అందుకోవడం ఖాయం అని టీమ్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అలానే అఖండ 2 టీమ్ కూడా తదుపరి అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అనంతరం ఒక్కొక్కటిగా సాంగ్స్ తో పాటు గ్లింప్స్ టీజర్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. ఇక ఈ రెండు భారీ ప్రాజక్ట్స్ ఎంతో గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో రూపొందుతుండడంతో అందరిలో ఈ స్థాయి ఆసక్తి నెలకొంది. మరి సెప్టెంబర్ 25న రానున్న పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ మూవీ ఓజి తో పాటు డిసెంబర్ లో రానున్న భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 రెండూ కూడా అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సొంతం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మా తెలుగు మూవీ మీడియా టీమ్ ఆ రెండు సినిమాల మూవీ టీమ్స్ కి ముందస్తుగా విజయాభినందనలు తెలియచేస్తోంది.
What's Your Reaction?






