10 Unknown Facts About Samantha Ruth Prabhu That Will Surprise You
Explore 10 lesser-known facts about Samantha Ruth Prabhu that even her biggest fans may not know. From personal struggles to secret talents – shocking revelations!

టాలీవుడ్ (Tollywood) స్టార్ నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ప్రాజక్ట్స్ తో కొనసాగుతున్నారు. ఇటీవల శుభం మూవీ ద్వారా నిర్మాతగా కూడా మారిన సమంత, ఆ మూవీ ద్వారా మంచి విజయం సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన వెబ్ సిరీస్ హానీ బన్నీ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో అది ప్రసారం అయింది. మరోవైపు త్వరలో ఒక హాలీవుడ్ మూవీతో పాటు మా ఇంటి బంగారం అనే మూవీ కూడా చేయనున్నారు. అలానే వీటితో పాటు రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే నెట్ ఫ్లిక్స్ వారి సిరీస్ లో కూడా నటిస్తున్నారు.
అయితే నటిగా తన సినిమా ప్రస్థానాన్ని తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఆరంభించారు సమంత రూత్ ప్రభు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన ఆ మూవీలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మించిన ఆ లవ్ స్టోరీ మూవీ పెద్ద విజయం అందుకుంది. కాగా ఏ మాయ చేసావే మూవీలో జెస్సి పాత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు సమంత. ఇక అక్కడి నుండి టాలీవుడ్ లో నటిగా ఒక్కో సినిమా అవకాశం అందుకుంటూ కొనసాగారు సమంత.
Samantha Ruth Prabhu Unknown Facts
అనంతరం టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆమె సినిమాలు చేసి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. అలానే అటు కోలీవుడ్ లో కూడా స్టార్ యాక్టర్స్ అయిన సూర్య, విక్రమ్, విజయ్ లతో కూడా పలు సక్సెసఫుల్ సినిమాలు చేసి అక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ అందుకున్నారు సమంత. ఇక సమంత కి నేషనల్ వైడ్ గా నటిగా అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ విధంగా తొలి చిత్రం నుండి తన యాక్టింగ్, అందంతో అందరి మనసుల్లో ఆమె చోటు సంపాదించారు.
సమంతా గురించి మీకు తెలియని 10 నిజాలు
అలానే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సినిమాలు, వ్యక్తిగత విషయాలు అందరితో షేర్ చేసుకునే సమంత, కొన్నాళ్ల క్రితం తన భర్త నాగచైతన్య నుండి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విడిగా జీవిస్తున్నారు. నటిగా ఎంత ఎదిగినప్పటికీ కూడా ఎంతో మంచి వ్యక్తిత్వం, మంచి మనసు కలిగిన సమంత సెట్స్ లో ఎంతో ఒదిగి ఉంటారు. కష్టాన్ని నమ్మి ఇష్టంగా పని చేస్తే తప్పకుండా విజయం మెల్లగా అయిన వరిస్తుందని ఆమె అంటారు. మరోవైపు సమంత ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో అలానే అటు హిందీలో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తో భారీ రెమ్యునరేషన్ తో దూసుకెళ్తున్నారు.
ఇక ఆమె నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి జోష్ నెలకొని ఉంటుంది. అలానే మూవీ సెట్స్ లో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే సమంత ప్రతి ఒక్కరినీ కూడా సమానంగా చూస్తారని, వారిలో ఎవరికైనా సమస్య వస్తే తనవంతుగా ఆమె ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని పలువురు సినిమా నటులు చెప్తుంటారు. ఆ విధంగా స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి మనసు ఆమె సొంతం. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోతోంది సమంత రూత్ ప్రభు యొక్క 10 ఫ్యాక్ట్స్ చెప్పుకోబోతున్నాం.
1. ముందుగా తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావే తో విపరీతమైన క్రేజ్ అందుకున్న సమంతకు టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు, ఎన్టీఆర్ నటించిన బృందావనం, నాని హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈగ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం అలానే అవి భారీ విజయాలు అందుకోవడంతో హీరోయిన్ గా ఒక్కసారిగా ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది.
10 Unknown Facts about Samantha
2. ముఖ్యంగా సమంత ని టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని అంటున్నారు. అందుకు కారణం ఆమె సినిమాల్లో దాదాపుగా చాలావరకు మంచి విజయం అందుకున్నవే. అదే కెరీర్ బిగినింగ్ లో అయితే ఆమె మరిన్ని విజయాలతో ఎందరో ప్రేక్షకాభిమానుల యొక్క మనస్సులో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. నటిగా ఒక్కో సినిమాతో తన అందంతో మాత్రమే కాదు వచ్చిన పాత్రల్లో తన మార్క్ నటనతో అందరినీ మెప్పించి అలరించారు సమంత రూత్ ప్రభు.
3. నటిగా స్టార్ హీరోయిన్ గా ఎందరో స్టార్స్ తో నటిస్తున్నప్పటికీ కూడా మధ్యలో యు టర్న్, బేబీ, యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియెంటెడ్ సిన్మాలు కూడా చేసారు సమంత. వాటిలో యశోద, శాకుంతలం పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి నటిగా ఆమె స్థాయిని క్రేజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచాయి. వాటిలో యశోద, బేబీ, యు టర్న్ మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.
4. తన సినీ కెరీర్ ఆరంభానికి ముందు అప్పట్లో పలు కేబుల్ ఛానల్స్ లో పలు యాడ్స్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు సమంత. మధ్యలో కొన్ని మోడలింగ్ యాడ్స్ కూడా చేసి అలరించిన సమంతని ఆ సమయంలో దర్శకుడు గాథం వాసుదేవ్ మీనన్ చూసి తాను నాగచైతన్య తో తీయనున్న ఏ మాయ చేసావే లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఆమె సినిమా ఎంట్రీ ఖాయం అయింది.
Samantha Ruth Prabhu Rare Info
5. ఇక తన స్నేహితులు, కుటుంబం, బంధువులతో మంచి అనుబంధం కల్గిన సమంత, ఏక్కువగా ఫ్రీ టైం లో వారితో కలిసి గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఆమెను వారందరూ ముద్దుగా యశోద అని పిలుస్తారట. ఎక్కువగా షూటింగ్స్ లేనప్పుడు ఫ్యామిలీతో కలిసి కూడా సరదాగా వెకేషన్స్ కి వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు సమంత రూత్ ప్రభు.
6. నటి సమంత రూత్ ప్రభు మంచి ఫుడీ కూడా. ఎక్కువగా ఆంధ్ర తో పాటు కేరళ, తమిళనాడు వంటకాలను ఆమె ఇష్టపడుతుంటారు. అలానే ఆమె మరింత ఇష్టంగా తినేది సుషీ. సరదాగా షూటింగ్స్ లేనప్పుడు ఇంట్లో తన తల్లితో కలిసి వంటల్లో కూడా సాయం చేసే సమంత, తనకు ఇంతటి గొప్ప లైఫ్ ఇచ్చిన తల్లి నినెట్టే ప్రభు, జోసెఫ్ ప్రభు లకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటానని చెప్తారు.
సమంతా వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర విషయాలు
7. ఇక తాను ఎక్కువగా ట్రావెల్ చేసే ప్లచెస్, అక్కడి ప్రత్యేకతలు, ఫుడ్ వంటి పలు విషయాలు, సంగతులు గురించి ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు సమంత. అలానే ఆమెకు అన్ని మాధ్యమాల్లో కూడా భారీ స్థాయి ఫాలోవర్స్ ఉన్నారు.
8. తనకు భారతీయ సినిమా పరిశ్రమలో పలువురు నటీమణులు ఎంతో ఇష్టం అని చెప్పే సమంత రూత్ ప్రభు ప్రత్యేకంగా అయితే హాలీవుడ్ నటి ఔడ్రే హేబర్న్ ఇన్స్పిరేషన్ అని చెప్తారు. నటిగా ఆమె అభినయం తనకు ఇష్టం అని చెప్పే సమంత, పాత్రని బట్టి ఆడియన్స్ అందరినీ అలరించేలా నటించేందుకు తాను ఎంతో ప్రయత్నిస్తానని అంటారు. నటిగా తనని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె చెప్తారు.
9. ఓవైపు స్టార్ నటిగా ఎంతో భారీ క్రేజ్ తో కొనసాగుతున్న సమంత మరోవైపు రియల్ లైఫ్ లో కూడా తన మంచి మనసు, దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రత్యూష ఫౌండేషన్ ని నెలకొల్పి పలువురు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ కూడా చేయించారు. అలానే పలువురు ఆర్ధికంగా వెనుకబడ్డ చిన్నారులకు పాఠ్య పుస్తకాలు కొనివ్వడం, ఫీజులు కట్టడం వంటివి చేస్తున్నారు. ఇటీవల కోవిడ్ సమాయంలో తన ఫౌండేషన్ నుండి పలు సహాయాలు కూడా ఆమె చేసారు.
10. ఇక ఇటీవల మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత అనంతరం పలువురు డాక్టర్ల నుండి శస్త్ర చికిత్స తీసుకుని మెల్లగా కోలుకున్నారు. అదే సమయంలో ఆమెకు ఎక్కువగా కుటుంబంతో పాటు శ్రేయోభిలాషులు, స్నేహితులు, ఫ్యాన్స్ ఎంతో గుండె ధైర్యాన్ని అందించారని అన్నారు. చైతన్య తో విడాకుల అనంతరం చాలా రోజుల పాటు ఎంతో డిప్రెషన్ కి లోనయ్యానని, మెల్లగా దాని నుండి బయటపడిన తాను ఇకపై ఎక్కువగా ఫ్యాన్స్, ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
అవార్డులు, కెరీర్ విషయంలో తెలియని అంశాలు
11. అలానే నిత్యం తన ఫిట్ నెస్ కోసం యోగా తో పాటు ప్రత్యేకంగా డైట్, వ్యాయామం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటారు సమంత రూత్ ప్రభు. మన తనువు,మనసు ఎప్పుడూ ప్రశాంతంగా దృఢంగా ఉండే మనం ఎటువంటి పని అయినా చేయగలం అని, అందుకే అందరూ ఆరోగ్యం విషయమై జాగ్రత్త వహించాలని ఆమె చెప్తారు. తనకు ఇష్టమైన ఫుడ్ అప్పుడప్పుడు తింటానని,ఎక్కువగా మాత్రం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్ధాలనే తినడానికి తనకు ఇష్టపడతానని అంటారు.
12. తమిళ దిగ్గజ నటీమణులు జయలలిత, రేవతి అనంతరం ఒకే ఏడాదిలో ఉత్తమ నటిగా తెలుగు, తమిళ భాషల్లో ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న మూడవ నటిగా సమంత రికార్డు నెలకొల్పారు. 2012లో తెలుగులో నాని హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మూవీ ఈగ కి, అలానే తమిళ్ లో జీవ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన నీతానే ఎన్ పొన్వసంతం. ఈ రెండు సినిమాలు విజయం అందుకోవడంతో పాటు సమంత యాక్టింగ్ కి మంచి పేరు లభించింది.
కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ సినిమా అప్ డేట్స్, న్యూస్,గాసిప్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, రివ్యూస్,గ్యాలరీస్ కోసం తరచు మా తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ (Telugu Movie Media) సైట్ ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు
What's Your Reaction?






