Samantha New Movie 2025: Release Date, Title & Updates
Samantha’s new movie in 2025 – latest teaser, story, and OTT platform details.

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) కి దేశవ్యాప్తంగా ఆడియన్స్ లో ఎంతో మంచి పేరు, క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. 2010లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సమంత రూత్ ప్రభు.
గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ మూవీని ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీకి ఆస్కార్ విజేత ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు.
సమంత కొత్త సినిమా 2025
అయితే రిలీజ్ అనంతరం అప్పట్లో ఈ మూవీ పెద్ద ఘనవిజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులోని సాంగ్స్ తో పాటు సమంత పోషించిన జెస్సి పాత్రకి యువత నుండి విశేషమైన రెస్పాన్స్ లభించింది.
ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టిన సమంత, అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి తీసిన బృందావనం సినిమా అవకాశం అందుకుని దానితో మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీను వైట్ల తీసిన దూకుడు, రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాల భారీ విజయాలు కెరీర్ పరంగా సమంతని ఒక్కసారిగా స్టార్ నటిని చేసాయి.
కథ, నటీనటులు మరియు షూటింగ్ వివరాలు
ఆపైన టాలీవడ్ తో పాటు కోలీవుడ్ లో దాదాపుగా అందరు స్టార్ హీరోస్ సరసన నటించిన సమంత పలు భారీ విజయాలు తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ భామగా పేరు సొంతం చేసుకున్నారు.
అనంతరం యూ టర్న్, బేబీ, యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి తన ఆకట్టుకునే అభినయంతో మరింతగా ఫ్యాన్స్, ఆడియన్స్ యొక్క ప్రేమని అందుకున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం నాగచైతన్య ని పెళ్లి చేసుకుని ఇటీవల ఆయన నుండి విడిపోయిన సమంత, ప్రస్తుతం కుటుంబంతో కలిసి విడిగా జీవిస్తున్నారు.
అయితే ఇటీవల మాయోసైటిస్ వ్యాధి బారిన పడి మెల్లగా కోలుకున్న సమంత, అక్కడి నుండి ఎంతో జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ఆమె చేసిన హానీ బన్నీ వెబ్ సిరీస్ బాగానే పేరు అందుకుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయింది.
అంతకముందు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో రాజీ పాత్రలో సమంత కనబరిచిన నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు కురిశాయి. ఇక ఇటీవల నిర్మాతగా కూడా మారిన సమంత ప్రస్తుతం శుభం అనే కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని నిర్మించారు. త్వరలో ఆ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.
చెన్నై స్టోరీ అనే ఒక హాలీవుడ్ సినిమాలో సమంత నటించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఫిలిప్ జాన్ తెరకెక్కించనుండగా సమంతతో కలిసి వివేక్ కల్రా కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదాని పై క్లారిటీ రావాల్సి ఉంది.
సమంత హాలీవుడ్ మూవీ సమాచారం
ఇక త్వరలో తెలుగులో మా ఇంటి బంగారం అనే మూవీలో కూడా సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్ర చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ మూవీకి సంబంధించి అధికారికంగా న్యూస్ రావాల్సి ఉంది. అలానే తాజాగా నెట్ ఫ్లిక్స్ వారి టెలివిజన్ సిరీస్ Rakt Brahmand : The Bloody Kingdom లో కూడా సమంత నటించనున్న న్యూస్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ నటుడు సిద్దార్థ రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సిరీస్ లో ఆయనకు జోడీగా సమంత కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాజ్ డీకే తో కలిసి రహి అనిల్ బర్వె గ్రాండ్ గా తెరకెక్కించనున్న ఈ హిందీ లాంగ్వేజ్ యాక్షన్ ఫాంటసీ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్స్ గా సాగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇక ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ప్రాజక్ట్స్ అయితే ఇవే. కాగా పలువురు సినీ దర్శకనిర్మాతల నుండి సమంత కథలు వింటున్నారని, అందులో ఏవైనా ఫైనలైజ్ అయితే ఆమె స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ సినీ తారల అప్ డేట్స్, న్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, రివ్యూస్ కోసం మా Telugu Movie Media వెబ్ సైట్ చూస్తూ ఉండండి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పాఠకులకు ప్రత్యేక ధన్యవాదాలు
What's Your Reaction?






