Laxman Utekar Apologises to Shirke Descendants Over ₹100 Crore 'Chhaava' Defamation Lawsuit Threat
Laxman Utekar apologises after Shirke descendants threaten a ₹100 crore defamation lawsuit over Chhaava. Read the full controversy and his response.

తాజాగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగిస్తూ దూసుకెళ్తున్న మూవీ ఛావా (Chhaava). ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీలో విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించగా అగ్ర కథానాయిక నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో హీరోయిన్ గ నటించారు. మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత భారీగా నిర్మించిన ఈమూవీని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దీనికి స్వరాలు సమకూర్చారు.
Laxman Utekar Issues Apology to Shirke Descendants Over 'Chhaava' Controversy
కథ పరంగా చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) మరణంతో ఆయన రాజ్యాన్ని కైవశం చేసుకోవాలని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హఠాత్తుగా దాడి చేస్తారు, అయితే అదే సమయంలో శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అతడిని అడ్డుకుని ఏవిధంగా వీరోచితంగా పోరాడి రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటారు అనే కథాంశంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు లక్ష్మణ్ దీనిని అద్భుతంగా తెరకెక్కించారు.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు నాడు గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీ బాలీవుడ్ ఆడియన్స్ నుండి విశేషమైన రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ అద్భుత పెర్ఫార్మన్స్ కి అందరి నుండి విశేషంగా ప్రసంశలు కురుస్తున్నాయి.
Why Shirke Descendants Threatened a ₹100 Crore Defamation Lawsuit
అలానే ఆయన భార్యగా యేసు భాయి భోంస్లే గా కనిపించిన రష్మిక మందన్న తో పాటు ఔరంగజేబుగా నటించిన అక్షయ్ ఖన్నా ల కు కూడా ఆడియన్స్ నుండి మంచి మార్కులు పడుతున్నాయి. హిందీలో రిలీజ్ అయి అదరగొడుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు పలు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ అనేకమంది ఇతర ఆడియన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తూ కోరుతున్నారు.
కీలకమైన యాక్షన్, ఎమోషనల్, యుద్ధ సన్నివేశాలతో పాటు గ్రాండియర్ విజువల్స్, ఏ ఆరా రహమాన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీ యొక్క భారీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మొదటి రోజు ఇండియాలో రూ. 32 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఛావా మూవీ రెండు, మూడు రోజుల్లో మరింత అద్భుతంగా రాబట్టింది.
Chhaava Box Office Collection
నేటి 12వ రోజు ఈ మూవీ రూ. 17 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా 12 రోజులకు గాను ఈ మూవీ రూ. 362.25 కోట్ల కలెక్షన్ రాబట్టి త్వరలో రూ. 500 కోట్ల మార్క్ దిశగా కొనసాగుతోంది. అంతా బాగున్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం ఛావా చిత్రం ఒకింత సమస్యల్లో ఇరుక్కోవలసి వచ్చింది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఛావా మూవీలో గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ క్షమాపణలు చెప్పాలని కోరారు.
Laxman Utekar’s Response and Official Statement
ఈ సినిమాలో తమ పూర్వీకులని తప్పుగా చూపించారని వారికి సంబందించిన సన్నివేశాల్లో తగు మార్పులు చేయకపోతే ఊరుకునేది లేదు సరికదా న్యాయ పోరాటానికి దిగి కోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అనంతరం దర్శకుడు లక్ష్మణ్ కు నోటీసులు కూడా పంపించారు. కాగా తాజగా వాటి పై స్పందించిన దర్శకుడు లక్షణ్ ఉటేకర్ మాట్లాడుతూ.
నిజానికి గానోజీ, కన్హోజీ లను తప్పుగా చూపించాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఈ మేరకు వారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పానని అన్నారు. అందుకే సినిమాలో గానోజీ, కన్హోజీ ఏ ప్రాంతానికి చెందిన వారు, వారికి సంబందించిన వివరాలు ఏంటి అనేవి ఏవి కూడా సినిమాలో చూపించడం జరగలేదని తెలిపారు. మొత్తంగా అందరి నుండి ఛావా మూవీ పై మంచి ప్రసంశలు కురుస్తుండడంతో పాటు మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుండడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
Impact on ‘Chhaava’ Movie and Legal Implications
What's Your Reaction?






