SSMB29 Director SS Rajamouli Net Worth – Tollywood Update
Explore SSMB29 director SS Rajamouli net worth, income sources, and lifestyle. Discover how the Tollywood filmmaker built his massive fortune with blockbusters.

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) అందరికంటే అత్యున్నత స్థాయిలో వరుసగా విజయాలతో దూసుకెళ్తున్నారు. తొలుత చిన్న తెలుగు సీరియల్స్ తీసి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన సినీ కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎదిగిన జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తొలిసారిగా యంగ్ టైగర్ హీరోగా రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమకి దర్శకుగా మెగాఫోన్ పట్టారు. 2002లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో బాగా సక్సెస్ అయింది. ఆకట్టుకునే కథ, కథనాలతో అలరించే సాంగ్స్, ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్ తో రూపొందిన ఈ మూవీ అనంతరం ఒక్కొక్కటిగా తనకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుని దర్శకుడిగా గొప్ప స్థాయికి ఎదిగారు రాజమౌళి.
SS Rajamouli Biography
Koduri Sri Saila Rajamouli 10 అక్టోబర్ 1973 లో వి విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథకుడిగా దర్శకుడిగా మన తెలుగు ప్రేక్షకులకి ఎంతో సుపరిచితం. ఆయన కథని అందించిన బాలీవుడ్ కండలవీరుడు Salman Khan నటించిన Bhajarangi Bhaijaan అప్పట్లో పెద్ద విజయం అందుకుని ఆయనకు కథకుడిగా విశేషమైన క్రేజ్, పేరు తీసుకువచ్చింది. ఇక కుమారుడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం అక్కడి నుండి ఆయన సినిమాలకు వరుసగా కథలు అందిస్తూ వచ్చారు రాజమౌళి.
దర్శకుడిగా ఒక్కో సినిమాతో ఆనందంతా ఎత్తుకి ఎదిగిన SS Rajamouli Movie Biography గురించి మాట్లాడుకుంటే ప్రతి సినిమాని ఒక యజ్ఞం మాదిరిగా ఆయన తీయడం గమనించవచ్చు. ఆయన ఒక సీన్ కోసం ఎంతలా కష్టపడతారు అనేది అనేకమంది ఆయనతో వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎన్నో సార్లు చెప్పడం విన్నాము. తాను తీసుకున్న ఒక కథని ఎంత చక్కగా ఎంత కష్టపడి తెరపైన చూపితే ఆడియన్సు నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది అలానే ఆ సినిమా ద్వారా తనకు పేరు రావడంతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ కూడా సంతోషంగా ఉంటారు అనే ఆలోచనతో నిరంతరం నిత్యా కృషీవలుడిగా పనిచేస్తుంటారు ఎస్ ఎస్ రాజమౌళి.
ముందుగా తెలుగు సినిమా పరిశ్రమకు పాన్ ఇండియన్ మూవీస్ ని పరిచయం చేసి Bollywood కి ధీటుగా మనం కూడా భారీ సినిమాలు ఆకట్టుకునే కథ, కథనాలతో తీస్తే తప్పకుండా అన్ని భాషల ఆడియన్సు యొక్క మెప్పు సొంతం చేసుకోవచ్చని తొలిసారిగా Prabhas, Anushka Shetty, Tamannah Bhatia ల కలయికలో అయన తీసిన భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ Baahubali :TheBeginning. ఆ మూవీ అప్పట్లో అందరి అంచనాలు మించి పెద్ద విజయం సొంతం చేసుకుని Baahuabali Total Collection Worldwide రూ. 650 కోట్లని సొంతం చేసుకుంది. అనంతరం దానికి సీక్వెల్ అయిన Baahubali : The Conclusion మూవీ అంతకు మించి విజయం సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ మరింతగా బాక్సాఫీస్ వద్ద రాణించింది.
Baahubali2 Collection Worldwide రూ. 1810 కోట్లని రాబట్టింది. ఇటీవల ఆయన తీసిన RRR మూవీ లోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో దర్శకధీరుడుగా రాజమౌళి గ్లోబల్ ఆడియన్సు యొక్క మన్ననలు అందుకున్నారు. RRR Total Worldwide Collection రూ. 1450 కోట్లు. RRR ఆ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ Superstar Mahesh Babu తో ఆయన తీస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. తన సినిమాల ద్వారా ఊహకందని అద్భుత సృష్టి చేసే జక్కన్న ఈ మూవీతో సూపర్ స్టార్ ని ఏవిధంగా చూపిస్తారో, అలానే ఈ మూవీతో భారతీయ సినిమా స్థాయిని ఇంకెంతటి ఉన్నత శిఖరాలకి చేరుస్తారో చూడాలి.
SS Rajamouli Filmography
Student No 1 :
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గజాల హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ 2002లో వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్, డైలాగ్స్ ఎంతో బాగున్నాయి. రాజీవ్ కనకాల ఒక నెగటివ్ రోల్ చేసిన ఈమూవీలో దివంగత నటుడు Kota Srinivasarao మెయిన్ విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి
Simhadri :
జూనియర్ ఎన్టీఆర్ తోనే మరొక్కసారి రాజమౌళి తీసిన ఈ మూవీలో Bhumika Chawla, అంకిత హీరోయిన్స్ గా నటించగా నాజర్, సీత, భానుచందర్ కీలక పాత్రలు చేసారు. ఈమూవీలో నమ్మిన బంటు సింహాద్రిగా ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్, డైలాగ్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషన్స్ ఎంతో వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా సింహాద్రి అప్పట్లో అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకుంది.
Sye :
యువ నటుడు నితిన్, యువ నటి Genelia హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో రాజీవ్ కనకాల, నాజర్, శశాంక్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా దీని ద్వారా ప్రదీప్ రావత్ విలన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సై మూవీ పెద్ద విజయం అందుకుంది. రగ్బీ ఆట ప్రధానంగా సాగె ఈమూవీలో సాంగ్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి.
Chatrapathi :
తొలిసారిగా రెబల్ స్టార్ Prabhas తో రాజమౌళి చేసిన ఈ మూవీలో Shriya Saran హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి భానుప్రియ కీలక పాత్ర చేసారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరంతో పాటు తల్లి కొడుకుల ప్రేమ అనే కథాంశంతో యాక్షన్ అంశాలను మిక్స్ చేసి జక్కన్న ఈ మూవీ తీశారు. ఇందులో ప్రభాస్ యాక్టింగ్ తో పాటు సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్, ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుని దీనికి విజయాన్ని అందించాయి.
Vikramarkudu :
మాస్ మహారాజ Raviteja హీరోగా లేడీ సూపర్ స్టార్ Anushka Shetty హీరోయిన్ గా రాజమౌళి తీసిన ఈమూవీలో విక్రమ్ రాథోడ్ పాత్రలో రవితేజ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మరోవైపు అత్తిలి సత్తిబాబుగా కామెడితో కూడా ఆయన అదరగొట్టారు. యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీలో సాంగ్స్ తో పాటు డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి.
Yamadonga :
ముచ్చటగా మూడోసారి JrNtr ఎన్టీఆర్ తో రాజమౌళి పని చేసిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ యమదొంగ. ఈ మూవీలో Priyamani, Mamatha Mohan Das హీరోయిన్స్ గా నటించారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒకప్పటి ఫాంటసీ బ్లాక్ బస్టర్ మూవీ Yamagola మూవీ స్ఫూర్తితో దీనిని చక్కగా తెరకెక్కించి మరొక విజయం అందుకున్నారు జక్కన్న. ఈ మూవీలో యాంగ్ యముడి పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం. అలానే కళాప్రపూర్ణ Mohan Babu యమధర్మ రాజుగా అద్భుతంగా నటించారు. అప్పట్లో పెద్ద విజయం అందుకుంది ఈ మూవీ.
Magadheera :
ఫస్ట్ మూవీ Chirutha అనంతరం మెగాపవర్ స్టార్ Ram Charan తో రాజమౌళి తీసిన ఈ మూవీ రెండు జన్మల కథగా రూపొందింది. ఇక రెండు పాత్రల్లో రామ్ చరణ్ చక్కగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో అందాల నటి Kajal Aggarwal హీరోయిన్ గా నటించగా దివంగత రియల్ స్టార్ Srihari ఒక కీలక పాత్ర చేసారు. కీరవాణి అందించిన సాంగ్స్ తో పాటు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ తో రూపొందిన మగధీర దర్శకుడిగా రాజమౌళికి హీరోగా రామ్ చరణ్ కు ఎంతో పేరు తీసుకువచ్చింది.
Maryada Ramanna :
వరుసగా భారీ సినిమాలు తీస్తూ వచ్చిన రాజమౌళి ఒక్కసారిగా రూటు మార్చి కమెడియన్ సునీల్ ని హీరోగా పెట్టి తీసిన మూవీ మర్యాద రామన్న. ఈ మూవీలో సలోని హీరోయిన్ గా నటించగా నాగినీడు విలన్ పాత్ర చేసారు. ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీగా రూపొంది బాక్సాఫీస్ వద్ద బాగా విజయంతం అయింది ఈ మూవీ. కామెడీ, ఎమోషన్స్ రెండిట్లో సునీల్ నటన ఎంతో బాగుంటుంది. హీరోగా సునీల్ కి ఇక్కడి నుండి హీరోగా అవకాశాలు పెరిగాయి.
Eega :
తొలిసారిగా రాజమౌళి తీసిన ప్రయోగాత్మక మూవీ ఈగ. ఈ మూవీ నాచురల్ స్టార్ Nani హీరోగా నటించగా అందాల నటి Samantha Ruth Prabhu హీరోయిన్ గా నటించారు. ప్రేమ కోసం తనను చంపిన విలన్ మీద చనిపోయిన వ్యక్తి ఈగగా తదుపరి జన్మలో ఏవిధంగా పాగా తీర్చుకున్నాడు అనే కథగా రూపొందిన ఈ మూవీలో ఈగతో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేయించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు జక్కన్న.
Baahubali TheBeginning :
తొలిసారిగా రాజమౌళి తీసిన పాన్ ఇండియన్ మూవీ బాహుబలి. ఈమూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి గా ప్రభాస్ నటనతో పాటు దేవసేనగా అనుష్క శెట్టి, అవంతికగా తమన్నా, ముఖ్యంగా కట్టప్ప గా సత్యరాజ్, శివగామిగా రమ్యకృష్ణ, భల్లాల దేవుడిగా రానా దగ్గుబాటి ల అద్భుత నటనతో పాటు భారీ గ్రాండియర్ విజువల్స్, హృద్యమైన ఎమోషన్స్, అలరించే పాటలు, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఈమూవీకి భారీ విజయం అందించాయి. భారత దేశంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా బాహుబలి సంచలనం సృష్టించింది.
Baahuabli The Conclusion :
ఇక ఫస్ట్ పార్ట్ ని మించేలా జక్కన్న తీసిన బాహుబలి 2 అంతకు మించేలా భారీ విజయం అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని యావత్ ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పింది. Baahubali Total Worldwide Collection చూసుకుంటే రూ. 1810 కోట్లు. ఆ విధంగా అనేక ఏరియాల్లో ఈ మూవీ అద్భుత సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాల తరువాత దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌలి పేరు ఖండాలు దాటి మరింతగా దూసుకెళ్లింది.
RRR :
తొలిసారిగా మెగా నందమూరి ఫ్యామిలీస్ నుండి హీరోలని కలిపి రాజమౌళి తీసిన పేట్రియాటిక్ యాక్షన్ ఎమోషనల్ మూవీ RRR. ఇందులో JrNtr కొమురం భీం గా Ram Charan అల్లూరి సీతారామరాజుగా నటించారు. Hollywood నటులు Ray Stevenson, Alison Doody, Olivia Morris కీలక పాత్రలు చేసిన ఈ మూవీ దాదాపుగా రూ. 1450 కోట్లు కొల్లగొట్టడంతో పాటు ఇందులోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీతో గ్లోబల్ గా దర్శకుడిగా తిరుగులేని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు జక్కన్న. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా Priyanka Chopra, Prithviraj Sukumaran కీలక పాత్రల్లో ఆయన తీస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ మూవీ SSMB29. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుండగా దీనిని వీలైనంత వేగంగా పూర్తి చేసి 2027 ప్రథమార్ధంలో ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ దాదాపుగా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రొఊపొందుతున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం మనం ఎస్ ఎస్ రాజమౌళి నెట్ వర్త్ గురించి మాట్లాడుకుందాం.
SS Rajamouli Net Worth
దర్శకుడిగా ఫస్ట్ మూవీ నుండి వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న రాజమౌళి బాహుబలి సిరీస్ సినిమాలతో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ మూవీస్ అనంతరం ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా ఎదిగిన ఎస్ ఎస్ రాజమౌళి RRR కి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు Tollywood వర్గాల టాక్. ముఖ్యంగా రాజమౌళి ప్రస్తుతం యావత్ India లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాప్ ప్లేస్ లో నిలిచారు.
తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం ఆయన ఒక మూవీకి రూ. 100-రూ. 150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. అలానే దర్శకుడిగా మెల్లగా తనకంటూ ప్రత్యేకత సంతరించుకుని మంచి రెమ్యునరేషన్ అందుకున్న అనంతరం లేటెస్ట్ కార్స్ తో పాటు పెద్ద ఇల్లు కూడా ఆయన తన కుటుంబం కోసం Hyderabad లో కట్టించారు. పనినే నిత్యం దైవంగా భావించే రాజమౌళి వ్యక్తిత్వం కూడా ఎంతో మంచిదని, ఆయన కొన్ని గుప్తదానాలు చేసిన పలు సందర్భాలు కూడా ఉన్నాయని పలువురు చెప్పడం జరిగింది.
ఇక అటు సినిమాలతో పాటు ప్రఖ్యాత ఇంటర్నేషనల్ సంస్థల యొక్క యాడ్స్ లో కూడా నటించారు రాజమౌళి. ఇక SS Rajamouli Net Worth 2025 లెక్కల్లో రూ. 550-రూ. 660 కోట్లవరకు ఉంటుందని అంచనా. మరి గ్లోబల్ యాక్షన్ మూవీ SSMB 29 భారీ విజయవంతం అయితే దర్శకుడిగా ఆయన వరల్డ్ వైడ్ గా టాప్ లో దూసుకెళ్లడం ఖాయం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కాగా దర్శకుడిగా జక్కన్న రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకుని కెరీర్ పరంగా తారాస్థాయికి చేరాలని మన సైట్ తరపున ప్రత్యేకంగా కోరుకుంటూ ముందస్తు విజయాభినందనలు తెలియచేస్తున్నాము.
What's Your Reaction?






