Naga Chaitanya New Movie Director Revealed | Latest Update

Get the latest update on Naga Chaitanya’s next movie and the announcement of the new director attached to the project

Naga Chaitanya New Movie Director Revealed | Latest Update

యువ నటుడు అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తొలిసారిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు జోష్ (Josh) సినిమా ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు. ఈమూవీలో చైతన్యకి జోడీగా ప్రముఖ సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. 

యువ దర్శకడు వేణు శ్రీరామ్ తీసిన జోష్ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది. ఆ తరువాత సమంత (Samantha Ruth Prabhu) హీరోయిన్ గా గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే (Ye Maaya Chesave) సినిమాతో హీరోగా మంచి పేరుతో పాటు పెద్ద విజయం సొంతం చేసుకున్నారు చైతన్య. 

నాగ చైతన్య కొత్త సినిమా అప్‌డేట్

ఇక అక్కడి నుండి తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగిన ఈ యువ హీరో, అనంతరం సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 100% లవ్ (100% Love) మూవీ చేసారు. 

ఈ మూవీలో తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. ఆకట్టుకునే లివ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించి హీరోగా చైతన్య కెరీర్ కి మంచి బూస్ట్ ని అందించింది. 

అనంతరం దేవా కట్ట దర్శకత్వంలో ఆటోనగర్ సూర్య, సుధీర్ వర్మతో దోచేయ్, విక్రమ్ కె కుమార్ తో మనం (Manam) వంటి సినిమాలతో కూడా విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి చేసిన రారండోయి వేడుక చూద్దాం, మరొకసారి సమంత తో కలిసి చేసిన మజిలీ (Majili), వెంకటేష్ తో కలిసి బాబీ తెరకెక్కించిన వెంకీ మామ సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 

NC24 దర్శకుడి వివరాలు

వాటి తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ అందాల నటి సాయి పల్లవి (Sai Pallavi)కి జోడీగా నాగ చైతన్య నటించిన మూవీ లవ్ స్టోరీ (Love Story). అప్పట్లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం అందుకుంది. అలానే తండ్రి నాగార్జున (Nagarjuna Akkineni) తో కలిసి నాగ చైతన్య నటించిన మూవీ బంగార్రాజు (Bangarraju). ఇది కూడా విజయవంతం అయింది. 

ఇక ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) తో కలిసి నాగ చైతన్య నటించిన మూవీ లాల్ సింగ్ చడ్డా (Lal SIngh Chadda). ఈ మూవీ హిందీలో చైతుకి బాగానే పేరు తీసుకువచ్చింది. ఇక వాటి అనంతరం లేటెస్ట్ గా చందూ మొండేటి తీసిన తండేల్ (Thandel) మూవీలో నటించారు చైతన్య. మరొక్కసారి ఈ మూవీ ద్వారా సాయి పల్లవితో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ మావోయి ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పాగా కలెక్షన్ రాబట్టింది. ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ అనంతరం విరూపాక్ష (Virupaksha) దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu)తో తన కెరీర్ 24వ మూవీ చేస్తున్నారు చైతన్య. NC24 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి వృష కర్మ (Vrusha Karma) అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలిపారు నాగ చైతన్య. 

మిథికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకునే కథ కథనాలతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. అలానే ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని ఎంతో గ్రాండ్ గా డిజైన్ చేసి రిలీజ్ చేయగా అది అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచింది. 

H4: సినిమా ప్రారంభ తేదీ

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ పై బివిఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి సుకుమార్ కూడా నిర్మిస్తున్నారు. ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానున్నట్లు తెలుస్తోంది. 

చైతన్య కెరీర్ లో ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీ తప్పకుండా అక్కిని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం అని, ఆ విధంగా దర్శకుడు కార్తీక్ స్క్రిప్ట్ ని అద్భుతంగా సిద్ధం చేసారని అంటోంది. మరి వృష కర్మ మూవీ నాగ చైతన్య కెరీర్ లో ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్ డేట్స్ కోసం తరచు మా Telugu Movie Media సైట్ తరచు చూస్తూ ఉండండి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow