Pawan Kalyan’s Hari Hara Veera Mallu Review: Goosebumps Guaranteed or Letdown?
Pawan Kalyan’s Hari Hara Veera Mallu is finally here! Does it deliver the power-packed period action we expected? Full review, rating & highlights inside

'హరి హర వీర మల్లు' రివ్యూ : ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్
సినిమా పేరు : హరి హర వీర మల్లు
విడుదల తేదీ : 24 జులై 2025
తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ రేటింగ్ : 3 / 5
నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, సునీల్, నాజర్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ
నిర్మాత : ఏ ఎం రత్నం
సంగీతం : ఎం ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస
హరి హర వీర మల్లు సమీక్ష – పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ గా ఉందా ? పండుగా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ అందాల నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ అన్ని ఆకట్టుకుని మూవీ పై మరింత అంచనాలు ఏర్పరిచాయి. ఇక నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఎంతరమేర ఆకట్టుకుంది అనేది ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ :
1650లో అప్పటికే మొఘలుల ఆధిపత్యంలో ఉన్న కొల్లూరు ప్రాంతంలో కోహినూర్ వజ్రం వశం చేసుకోవడంతో పాటు భారతదేశ ప్రజలు పూర్తిగా తమ మతంలోకి మారితే తప్ప వారికి మనుగడ లేదని వారిని పలు రకాలుగా చిత్రహింసలకు గురిచేస్తూ పలువురిని హతమారుస్తుంటాడు క్రూరుడైన ఔరంగజేబు (Sunny Deol). అయితే ఆ వజ్రాన్ని తీసుకురాగలిగేది గజ దొంగ వీరమల్లు (Pawan Kalyan) మాత్రమేనని అతడిని పిలిపించి దానిని తిరిగి తీసుకువచ్చేలా అతడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా (Sachin Khedekar).
మరి అంతటి కష్టతరమైన కార్యాన్ని హరి హర వీర మల్లు పూర్తి చేశాడా లేదా, అసలు ఎవరు ఈ వీరమల్లు, అతడి గతం ఏంటి. మధ్యలో తారసపడ్డ పంచమి (Nidhhi Agerwal) ఎవరు, అనంతరం ఏమి జరిగింది, అసలు వీరమల్లు కోహినూర్ కోసమే వచ్చాడా లేక ఔరంగజేబుతో వేరేదైనా బలమైన కారణం ఉందా. అనేటువంటి ఈ అంశాలు అన్నిటికీ కూడా సమాధానాలు తెలియాలి అంటే వెండితెరపై మూవీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీ ద్వారా మరొక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మార్క్ ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు. ముఖ్యంగా హరి హర వీర మల్లు గా పలు సీన్స్ లో ఆయన పలికిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఎంతో బాగున్నాయి .ఇక పంచమి పాత్రలో కనిపించి తన ఆకట్టుకునే అభినయంతో హీరోయిన్ నిధి అగర్వాల్ మెప్పించింది. కీలకమైన ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయి నటించారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.
కథలో ఉన్న పౌరాణిక శక్తి – పాత్రలు, యాక్షన్ & డైరెక్షన్ ఎలావున్నాయి?
ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ తో పాటు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రెండు సాంగ్స్ సినిమాలో అందరినీ అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి. అప్పట్లో సనాతన ధర్మం కోసం జరిగే కొన్ని ఉదంతాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంతో పాటు ఆ సీన్స్ లో ఎమోషన్ మనల్ని కదిలిస్తుంది. కొన్ని సీన్స్ ని దర్శకులు క్రిష్ తో పాటు జ్యోతికృష్ణ డీల్ చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ విజువల్స్ ఫస్ట్ హాఫ్ లో బాగున్నాయి.
Hari Hara Veera Mallu Review Telugu
మైనస్ పాయింట్స్ :
నిజానికి హరి హర వీర మల్లు కోసం తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంతగా అలరించదు.ముఖ్యంగా చాలాచోట్ల ఊహించిన తరహాలోనే సాగుతుంది, పెద్దగా థ్రిల్ అనిపించదు. ఇక ముఖ్యంగా ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో వచ్చే విజువల్స్, విఎఫ్ఎక్స్ ఎంతో నాసిరకంగా ఉన్నాయి. అయితే మొదటి రోజుతో పోలిస్తే ఇవాళ్టి నుండి సెకండ్ హాఫ్ విజువల్స్ ని మరింత బెటర్ చేసింది టీమ్. దీనితో మూవీ పై మంచి పాజిటివ్ బజ్ వస్తోంది. సినిమా పలుమార్లు వాయిదా పడడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కాని మేజర్ గా విఎఫ్ఎక్స్ ఈ మూవీకి మైనస్ అయింది.
Hari Hara Veera Mallu Rating
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా ఈ మూవీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గురించి చెప్పుకోవాలి. హీరో ఎంట్రీ సీన్ దగ్గరి నుండి క్లైమాక్స్ వరకు చాలా కీలక సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం ఎంతో బాగుంది. హీరో ఎలివేషన్ సీన్స్ లో వచ్చే బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్ బాగానే ఉన్నాయి, రెండు సాంగ్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే ఎంతో గ్రాండియర్ గా నిర్మాత ఏ ఎం రత్నం ఖర్చు పెట్టి తెరకెక్కించిన హరి హర వీర మల్లు మూవీలో విఎఫ్ఎక్స్ బాగా నాసిరకంగా ఉండడం మూవీకి పెద్ద మైనస్. దర్శకులు ఇద్దరూ కూడా కథ కథనాలు బాగానే నడిపించినా సెకండ్ హాఫ్ లో సినిమా అక్కడక్కడా సాదాసీదాగా సాగినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ బాగున్నాయి.
సాంకేతిక విభాగాలు, పాటలు, ఫైనల్ రేటింగ్
తీర్పు :
మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా ఏడేళ్ల అనంతరం ఆడియన్స్ ,ముందుకి వచ్చిన హరి హర వీర మల్లు మూవీ ఆకట్టుకునే యాక్టింగ్, కథ, కథనాలతో బాగానే సాగింది. ముఖ్యంగా సాంగ్స్, యాక్షన్ సీన్స్, రెండు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే నాసిరకమైన విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం మూవీకి మైనస్. అయితే లేటెస్ట్ గా సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ ని టీమ్ కొంత మార్చి బెస్ట్ ఇవ్వడంతో మూవీ పై పాజిటివిటీ పెరుగుతోంది. వీలైతే తప్పకుండా మీ సమీప థియేటర్స్ లో హరి హర వీర మల్లు మూవీని కుటుంబసమేతంగా చూసి ఆనందించండి.
Pawan Kalyan Movie Review
ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, గాసిప్స్, రివ్యూస్, గ్యాలరీ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ఫాలో అవ్వండి
What's Your Reaction?






