War 2 Movie Review – Hrithik Roshan & Jr NTR’s High-Octane Spy Thriller
Read War 2 movie review starring Hrithik Roshan and Jr NTR. A power-packed spy thriller with action, emotion, and stunning visuals.

'వార్ - 2' మూవీ రివ్యూ (War 2 Movie Review) : అలరించే స్పై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్
విడుదల తేదీ : 14 ఆగష్టు 2025
రేటింగ్ : 3 / 5
నటీనటులు : ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అశుతోష్ రానా, అనిల్ కపూర్ తదితరులు
దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
నిర్మాత : ఆదిత్య చోప్రా
సంగీతం : ప్రీతం
సినిమాటోగ్రఫీ : బెంజమిన్ జాస్పర్
తొలిసారిగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ల కలయికలో యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. ఈ మూవీని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.
Hrithik Roshan Jr Ntr War 2 Review
ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన వార్ 2 మూవీ నేడు గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఆడియన్సు యొక్క అభిప్రాయం ఏంటి అనేది పూర్తి రివ్యూలో ఇప్పుడు చూద్దాం.
కథ :
ఇక ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే ఇండియన్ రా ఏజెన్సీ లో ఎంతో గొప్ప పేరు కలిగిన కబీర్ (Hrithik Roshan) సడన్గా సీరియల్ కిల్లర్ గా మారి పలు హత్యలు చేస్తూ ఉంటాడు. అనంతరం ఇతర దేశాలైన శ్రీలంక, చైనా, బాంగ్లాదేశ్, మయన్మార్, రష్యా కలిసి భారతదేశాన్ని ఎలాగైనా పఠనం చేయాలని కాళీ పేరిట ఒక కుట్ర పన్నుతారు.
వార్ 2 మూవీ సమీక్ష – హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎంటర్‌టైనర్
అయితే ఇంతటి పెద్ద మిషన్ కి కబీర్ సరైన వాడు అని భావించి అతడిని నియమిస్తారు. మరి ఎంతో గొప్ప రా ఏజెన్సీ వ్యక్తి అయిన కబీర్ భారతదేశాన్ని పతనం చేయడానికి సిద్దమైనపుడు అతడిని అడ్డుకోవడానికి సరైన సమర్ధుడు కావాలి. ఆ విధంగా అన్నివిధాలా సమర్ధుడైన విక్రమ్ చలపతి (NT Ramarao Jr) ని కబీర్ ని ఆపేందుకు రంగంలోకి దిగుతాడు.
War 2 Public Talk in Telugu
ఇక అక్కడి నుండి కథ ముందుకు ఎలా సాగింది. మధ్యలో విక్రమ్ కి కబీర్ కి మధ్య సంబంధం ఏంటి, మరి ఫైనల్ గా కలి నుండి భరత్ కు ఉన్న ముప్పుని ఎవరు ఆపారు, మరి ఈ క్రమంలో భారత వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (Kiara Advani) పాత్ర ఏమిటి, చివరికి కథ ఏవిధంగా మలుపులు తిరిగింది అనేది మొత్తం కూడా వేడితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముందుగా ఇటువంటి స్పై యాక్షన్ డ్రామా మూవీస్ లో మంచి థ్రిల్లింగ్ యాక్షన్ మూమెంట్స్ ని ప్రేక్షకుల ఆశించవచ్చు. ఆ విధంగా సినిమా ప్రారంభంతో పాటు మధ్యలో పలు భారీ యాక్షన్ సీన్స్ అందరినీ అలరిస్తాయి. అలానే టెక్నీకల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అలానే మధ్యలో వచ్చే ట్విస్టులతో పాటు పలు ఎమోషన్స్ కూడా బాగానే పండాయి.
ఈ మూవీ ద్వారా కీలకమైన కబీర్ పాత్రలో తన మార్క్ అద్భుత పెర్ఫార్మన్స్ తో హీరో హృతిక్ రోషన్ అదరగొట్టారు. వార్ 1 కి కొనసాగింపుగా సాగిన తన పాత్రలో ముఖ్యంగా పలు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన డైలాగ్స్ సూపర్ అని చెప్పకతప్పదు. ఇక తొలిసారిగా బాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది.
ఏజెంట్ విక్రమ్ గా తన మార్క్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కనబరిచిన ఎన్టీఆర్, కీలక యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో అలరించారు. ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం కూడా బాగుంటుంది. మూవీ కోసం ఆయన ఎంచుకున్న పాయింట్ తో పాటు కథనాన్ని కూడా కూడా ఆకట్టుకునే రీతిన నడిపి అందరినీ ఆకట్టుకున్నారు.
కథ, యాక్షన్ సీన్స్ & నటన విశ్లేషణ
మూవీ లో ప్రధానంగా యాక్షన్ సీన్స్ తో పాటు ఫైట్స్, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ తో పాటు ఎన్టీఆర్, హృతిక్ ల స్పెషల్ డ్యాన్స్ నెంబర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. విజువల్స్ ఎంతో గ్రాండ్ గా ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కీలక సీన్స్ లో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగానే సాగుతుంది. అవి ఈ మూవీకి ప్లస్. క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఇద్దరు స్టార్స్ మధ్య వచ్చే ఫైట్ ఎమోషనల్ గా కూడా సాగుతుంది. ఇక సపోర్ట్ పాత్ర చేసిన అశుతోష్ రానా కూడా ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
అయితే ఇటువంటి మూవీస్ లో స్ట్రాంగ్ ఎమోషన్స్ కోరుకునే వారికి మాత్రం ఈ మూవీ యావరేజ్ గా అనిపించవచ్చు. ఇద్దరు హీరోల నడుమ వచ్చే యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ దేశభక్తి సన్నివేశాలు అంతగా లేవు. ఇక నటులిద్దరి మధ్య సంఘర్షణకు సంబందించిన సీన్స్ మరింత బలంగా రాసుకుని ఉంటె బాగుండేది.
మూవీలో మెయిన్ విలన్ స్ట్రాంగ్ గా లేకపోవడం కొంత మైనస్. సెకండ్ హాఫ్ లో కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నాయి. అయితే క్లైమాక్స్ సీన్స్ వచ్చే వరకు అక్కడక్కడా కొన్ని సీన్స్ సాగతీతగా ఉంటాయి. కియారా అద్వానీ పాత్ర చాలా చిన్నది, అనిల్ కపూర్ పాత్ర బాగున్నప్పటికీ కొంత సాగిన అనంతరం కావాలని ఆ పాత్రని ఇరికించి పొడిగించినట్లుగా ఉంటుంది.
War 2 Spy Universe Review
ఎన్టీఆర్ పాత్ర కొంత నెగటివ్ గా ఆ తరువాత పాజిటివ్ గా మారడం అనేది గతంలో పలు సినిమాల్లో చూసినట్లే సాగుతుంది. అన్ని యాక్షన్ సీన్స్ బాగున్నా సెకండ్ హాఫ్ లో హృతిక్ ని ఎన్టీఆర్ ఛేజ్ చేసే ఒక సీన్ మాత్రం మనకు కొంత సిల్లీగా అనిపిస్తుంది. ఇక దాదాపుగా కథ, కథనాలు బాగానే సాగాయి.
సాంకేతిక వర్గం :
ముందుగా వార్ 2 మూవీ గురించి చెప్పుకోవాల్సింది దర్శకుడు అయాన్ ముఖర్జీ గురించి. ఆకట్టుకునే కథ, కథనాలతో మూవీని బాగానే ముందుకు నడిపించారు. పలు యాక్షన్ సీన్స్, విజువల్స్ తెరకెక్కించిన తీరు బాగుంది. పలు ట్విస్టులు కూడా బాగానే రాసుకున్నారు. ఇద్దరు హీరోలని బాగానే హ్యాండిల్ చేయడంతో పాటు ఎన్టీఆర్ పాత్రని బాగా చూపించారు.
ఫ్యాన్స్ రియాక్షన్స్ & మొదటి రోజు టాక్
ఆయనకి డిజైన్ చేసిన కొన్ని సీన్స్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటాయి. అయితే సెకండ్ హాఫ్ కథనంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు గురించి మాట్లాడుకుంటే భారీ స్థాయిలో ఖర్చు చేసిన ఈ మూవీ యొక్క యాక్షన్ సీన్స్ స్క్రీన్ పై ఆకట్టుకుంటాయి. ఫోటోగ్రఫి తో పాటు ప్రీతం సాంగ్స్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ విభాగం మరింతగా పని చేయాల్సింది.
తీర్పు :
ఇక తొలిసారిగా టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భారీ స్పై యాక్షన్ మూవీ వార్ 2 యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇద్దరు హీరోల లుక్స్, యాక్షన్ సీన్స్ వంటివి బాగున్నాయి. అయితే కంటెంట్ సెకండ్ హాఫ్ లో మరింత దృష్టి పెట్టాల్సింది. చివరిగా పెద్దగా లాజిక్స్ లేకుండా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కోరుకునే వారికి ఈ మూవీ ఎంతో నచ్చుతుంది. ఇద్దరు హీరోల స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ వార్ 2 కి మరింత ప్రధాన ఆకర్షణ.
మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, రివ్యూస్, గాసిప్స్, గ్యాలరీస్, న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా (Telugu Movie Media) సైట్ ని తరచు చూస్తూ ఫాలో అవుతూ ఉండండి.
What's Your Reaction?






