Samantha New Tamil Movie Update – Title, Cast & Release Details
Samantha New Tamil Movie Update. Know the title, cast, director, and release date in this latest Tollywood update

స్టార్ నటీమణి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాలు కూడా చేసి అక్కడి ఆడియన్స్ యొక్క మనసు కూడా దోచారు. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన తొలిచిత్రం ఏ మాయ చేసావే ఇక్కడ సూపర్ హిట్ కొట్టడంతో పాటు అటు తమిళ్ లో కూడా విజయవంతం అయింది.
అయితే గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన ఈమూవీ తెలుగు వర్షన్ లో అక్కినేని నాగచైతన్య, సమంత రూత్ ప్రభు హీరో హీరోయిన్స్ గా నటించగా తమిళ్ లో శింబు, త్రిష నటించారు. విశేషం ఏమిటంటే, తమిళ్ లో ఆ మూవీ Vinnaithaandi Varuvaayaa అనే టైటిల్ తో రూపొందిగా అందులో ఒక చిన్న క్యామియో పాత్రలో నటించారు సమంత.
సమంత కొత్త తమిళ చిత్రం వివరాలు
ఆ తరువాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు మూవీతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమంత రూత్ ప్రభు, అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనంతో భారీ విజయం కూడా అందుకున్నారు. అనంతరం జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈగ మూవీలో సమంత హీరోయిన్ గా నటించి మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక అక్కడి నుండి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సమంతకు అవకాశాలు క్యూ కట్టాయి. అదే సమయంలో తమిళ్ లో Baana Kaathadi మూవీలో కూడా నటించి అక్కడ మంచి విజయం అందుకున్నారు. ఆ తరువాత Moscowin Kavery, Neethaane En Ponvasantham, Theeya Velai Seiyyanum Kumaru సినిమాలు చేసి తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు.
ఆపైన ఇలయదళపతి విజయ్ తో మురుగదాస్ దర్శకత్వంలో ఆమె చేసిన Kaththi మూవీ భారీ విజయం హీరోయిన్ గా సమంత రూత్ ప్రభు కు తమిళ్ లో విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. ఆ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేసారు. అదే సమయంలో విలక్షణ నటుడు సూర్యతో ఆమె చేసిన మూవీ Anjaan కూడా బాగానే విజయవంతం అయింది.
అనంతరం మరొక్కసారి విజయ్ తో Theri, అలానే సూర్య తో 24 సినిమాలు చేసిన సమంత వాటితో మరొక రెండు మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఆపైన విజయ్ తో ముచ్చటగా మూడోసారి Mersal మూవీ చేసి దానితో కూడా సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు సమంత రూత్ ప్రభు.
కథా నేపథ్యం, డైరెక్టర్ ఎవరు?
ఆ తరువాత యువ నటుడు శివకార్తికేయన్ తో Seemaraja, లేడీ ఓరియెంటెడ్ మూవీ U Turn లతో కూడా విజయాలు అందుకున్నారు. ఆలా తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా అనేక సక్సెస్ లతో అక్కడ కూడా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్నారు సమంత.
అలానే విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర చేసిన Super Deluxe తో పాటు Kaathuvaakula Rendu Kaadhal సినిమాలు చేసారు. కాగా అవి రెండు కూడా మంచి విజయాలు అందుకుని హీరోయిన్ గా ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. అయితే మధ్యలో చియాన్ విక్రమ్ హీరోగా ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన 10 Endrathukulla సినిమాలో డ్యూయల్ రోల్ చేసి అందులో ఒక నెగటివ్ రోల్ ద్వారా ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించి మంచి పేరు సొంతం చేసుకున్నారు సమంత రూత్ ప్రభు.
ఆ విధంగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎప్పటికప్పుడు పలు సక్సెస్ లు అందుకుని దూసుకెళ్లారు సమంత రూత్ ప్రభు. అయితే ఇటీవల మాయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుని ఇకపై తన సినీ కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టిన సమంత తాజాగా శుభం అనే మూవీ ద్వారా నిర్మాతగా మారి ఫస్ట్ మూవీతోనే విజయం అందుకున్నారు.
విడుదల తేదీ, స్ట్రీమింగ్ డీటెయిల్స్
త్వరలో తెలుగులో మా ఇంటి బంగారం అనే మూవీ ద్వారా ఆమె ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు త్వరలో హిందీ లో Rakt Brahmand : The Bloody Kingdom అనే సిరీస్ కూడా చేస్తున్నారు. అలానే Chennai Story అనే హాలీవుడ్ మూవీ కూడా చేసేందుకు సిద్ధమయ్యారు సమంత రూత్ ప్రభు, ఈమూవీని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్నారు.
వీటితో పటు పలువురు తమిళ్ డైరెక్టర్స్ కూడా సమంతని ఎప్పటికప్పుడు కలుస్తున్నారని, త్వరలోనే ఆమె నటించనున్న తమిళ్ మూవీస్ యొక్క డీటెయిల్స్ కూడా ఒక్కొక్కటిగా వెల్లడవుతాయని లేటెస్ట్ మూవీ వర్గాల టాక్. మొత్తంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మంచి పేరుతో కొనసాగుతున్న సమంత ఇకపై మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకోవాలని కోరుకుందాం.
What's Your Reaction?






