Aishwarya Rajinikanth Visits Tirumala with Son – Exclusive Temple Darshan Photos

Aishwarya Rajinikanth Visited Tirumala with Her Son తమిళ స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ మూవీతో పాటు మరొక దర్శకుడు టీజె జ్ఞానవేల్

Aishwarya Rajinikanth Visits Tirumala with Son – Exclusive Temple Darshan Photos

తమిళ స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ మూవీతో పాటు మరొక దర్శకుడు టీజె జ్ఞానవేల్ తీసిన వేట్టయాన్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన రజని వాటితో మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. 

Aishwarya Rajinikanth Visited Tirumala with Her Son – Full Details

ఆ రెండు సినిమాల అనంతరం తాజాగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో భారీ పాన్ ఇండియన్ మూవీ కూలి చేస్తున్నారు. ఈ మూవీతో పాటు తాజాగా జైలర్ 2 ని కూడా ఆరంభించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. 

ఇక రజినీకాంత్ కి ఐశ్వర్య, సౌందర్య అనేది తెలిసిందే. ఇక పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ 2003 లో అజిత్ హీరోగా నిర్మాతగా రూపొందిన 3 మూవీకి దర్శకత్వం వహించి మంచి విజయం అందుకున్నారు. ఈ మూవీ ద్వారా యువ సంగీత తరంగం అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ మూవీ సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. 

Aishwarya Rajinikanth’s Special Tirumala Temple Visit – Highlights

ఇక 3 మూవీలోని కొలవెరి డి సాంగ్ యూట్యూబ్ లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక అదే సమయంలో ధనుష్ ని ప్రేమించి 2004లో ఆమె వివాహమాడారు. వారిద్దరికీ ఇరువురు కుమారులు. ఆ తరువాత 2015లో గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్స్ గా రూపొందిన వై రాజా వై మూవీకి దర్శకత్వం వహించారు ఐశ్వర్య. 

ఇక ఇటీవల తండ్రి రజినీకాంత్ ఒక ముఖ్య పాత్రలో అలానే విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ లాల్ సలాం తెరకెక్కించారు. అయితే రిలీజ్ అనంతరం ఈ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. కాగా గత ఏడాది నవంబర్ లో తన భర్త ధనుష్ నుండి ఆమె అధికారికంగా చట్టపరంగా విడాకులు పొందారు.

Aishwarya Rajinikanth & Son’s Darshan Photos Go Viral 

అక్కడి నుండి తన కెరీర్ ని ఆపకుండా మరింతగా సక్సెస్ లు అందుకునేలా త్వరలో మరొక మంచి ప్రాజక్ట్ ని ఐశ్వర్య రజినీకాంత్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల టాక్. 

విషయం ఏమిటంటే నేడు తన చిన్న కుమారుడితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఐశ్వర్య. కాగా వారిద్దరికీ సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాగా ఇకపై తన కెరీర్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ఐశ్వర్య ఆ వేంకటేశ్వరుని దీవెనల కోసం నేడు తిరుమల వెళ్లారనేది మీడియా వర్గాల టాక్. ఏది ఏమైనప్పటికీ ఇకపై ఐశ్వర్య రజినీకాంత్ నుండి రానున్న సినిమాలు మంచి విజయం అందుకుని కెరీర్ పరంగా ఆమెకు బాగా పేరు, క్రేజ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముందస్తు శుభాభినందనలు తెలియచేద్దాం. 

Celebrities Who Recently Visited Tirumala – Latest Updates

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow