Latest Telugu Movies Box Office Collections
Get updated with daily box office collections of Telugu movies including re-releases, premieres, and theatrical performance reports

ఈ 2025 ఏడాది ఇప్పటికే గడచిన ఐదు నెలల్లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి రాగా అందులో కొన్ని మంచి విజయం అందుకున్నాయి. మరికొన్ని ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు మొదలుకుని తాజాగా ఇటీవల రిలీజ్ అయిన పలు సినిమాల యొక్క బాక్సాఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.
Sankranthiki Vasthunam
విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మించగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈమూవీ అందరి అంచనాలను మించి అతిపెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేష్ కి పెద్ద ప్లస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క పల్స్ ని పట్టుకుని అందరినీ అలరించేలా దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీని అద్భుతంగా తెరకెక్కించి మంచి పేరు, కలెక్షన్ సొంతం చేసుకున్నారు. ఇక ఓవరాల్ గా ఈమూవీ రూ. 300 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకుని వెంకటేష్ కెరీర్ లో అద్భుత రికార్డు కొట్టింది.
Daaku Maharaaj
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాధ్, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా కీలక పాత్రల్లో రూపొందిన ఈ మూవీని యువ దర్శకుడు బాబీ తెరకెక్కించారు. ఇక ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు. ఇక డాకు మహారాజ్ మూవీలో మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేసి తన అద్భుత నటన, డైలాగ్స్ తో అదరగొట్టారు నందమూరి బాలకృష్ణ. మొత్తంగా అందరినీ అలరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 140 కోట్ల మేర బాక్సాఫీస్ కలెక్షన్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కి బాగానే పేరు తీసుకువచ్చింది.
తెలుగు సినిమాల తాజా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు
Game Changer
మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ భారీ పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించగా ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అనంతరం అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే రామ్ చరణ్ మాత్రం తన రెండు పాత్రల్లో పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. ఇక ఈ మూవీ ఫస్ట్ డే నుండి నెగటివ్ టాక్ మూటగట్టుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 190 కోట్ల కలెక్షన్ రాబట్టింది.
Thandel
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా అందాల నటి సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, అల్లు అరవింద్ గ్రాండ్ గా నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించింది. ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవి ల నటన, లవ్ సీన్స్, సాంగ్స్, ఎమోషన్స్ వంటివి ఫ్యాన్స్ ని ఆడియన్సు ని ఎంతో ఆకట్టుకుని మూవీని విజయవంతం చేసాయి. ఇక తండేల్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 110 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని నాగచైతన్య కెరీర్ కి మంచి బూస్ట్ అందించింది.
రిలీజ్ తేదీ, థియేటర్ వసూళ్లు, హిట్ టాక్
Mad Square
రామ్ నితిన్, విష్ణు ఓఐ, నార్నె నితిన్, సంగీత్ శోభన్ వంటి యువ నటులు హీరోలుగా ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీని కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. ఐతే అంతకముందు రిలీజ్ అయిన మ్యాడ్ మూవీ పెద్ద విజయం సొంతం చేసుకోవడంతో మ్యాడ్ స్క్వేర్ పై మంచి అంచనాలు ఏర్పడడం, అనంతరం ఇది కూడా ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయం అందుకోవడం జరిగింది. ఆకట్టుకునే కథ, కథనాలు కామెడీ తో రూపొందిన ఈమూవీ రిలీజ్ అనంతరం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.
Court
యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా కోర్ట్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీలో విలక్షణ నటుడు శివాజీ, సీనియర్ నటులు రోహిణి, శుభలేఖ సుధాకర్, సాయి కుమార్, యువ నటుడు ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు చేసారు. ఆకట్టుకునే ఒక చిన్న పాయింట్ తో అలరించే కథనంతో రూపొందిన కోర్ట్ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క పాత్రధారి యొక్క నటనతో పాటు, కథ, కథనాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇందులో అందరినీ అలరించాయి. వాల్ పోసేర్ సినిమా సంస్థ పై నాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.
రోజువారీ, ఓవర్సీస్, రీ రిలీజ్ కలెక్షన్ వివరాలు
Single
యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా కామెడీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగిల్. గతంలో సామజవరగమనా వంటి కామెడీ ఎంటర్టైనర్ తో అందరినీ అలరించి విజయం అందుకున్న శ్రీవిష్ణు, మరొక్కసారి సింగిల్ తో కూడా ఆకట్టుకున్నారు. ఈ మూవీలో ఆయన కామెడీ టైమింగ్, సరదా కామెడీ సీన్స్ వంటివి యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించాయి. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించినా సింగిల్ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ యొక్క మెప్పు సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 38 కోట్ల గ్రాండ్ ని సొంతం చేసుకుంది.
Hit The Third Case
నాచురల్ స్టార్ నాని నాచురల్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా మూవీ హిట్ 3. గతంలో హిట్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాల విజయంతో దీని పై అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ఫైనల్ గా రిలీజ్ అనంతరం అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుని హిట్ 3 మూవీ. దీనిని ప్రశాంతి తిపిర్నేని తో కలిసి నాని గ్రాండ్ గా నిర్మించారు. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటనతో పాటు సైల్లేష్ కొలను ఆకట్టుకునే కథ, కథనాలు ప్రధాన బలంగా నిలిచి మూవీకి పెద్ద సక్సెస్ అందించాయి. మొత్తంగా హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట గ్రాస్ ని కొల్లగొట్టింది.
What's Your Reaction?






