Boyapati Next Movie Heroine Revealed – Check Who It Is
Director Boyapati Sreenu’s upcoming movie heroine confirmed. Check who is starring opposite the lead hero in this powerful action entertainer

తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా భద్ర ద్వారా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మెగాఫోన్ పట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu). అంతకముందు పలు సినిమాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసిన బోయపాటికి మాస్ మహారాజా రవితేజ దర్శకుడిగా తొలిసారిగా అవకాశం ఇచ్చారు.
ఇక అక్కడి నుండి దర్శకుడిగా తనకు వరుసగా వచ్చిన అవకాశాలు వినియోగించుకోవడంతో పాటు దర్శకుడిగా ప్రతి చిత్రంతో మంచి క్రేజ్ అందుకుని కొనసాగారు బోయపాటి శ్రీను. ఆ తరువాత వెంకటేష్ తో ఆయన తీసిన మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తులసి కూడా భారీ విజయం సొంతం చేసుకుంది.
బోయపాటి శ్రీను తాజా సినిమా – హీరోయిన్ ఫిక్స్
అనంతరం ఎన్టీఆర్ తో తీసిన దమ్ము పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఆ తరువా బాలకృష్ణ తో తీసిన సింహా మూవీతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను యొక్క కెరీర్ గ్రాఫ్ గమనిస్తే మొత్తంగా ఆయన బాలకృష్ణ తో తీసిన మూడు మూవీస్ అయిన సింహా, లెజెండ్, అఖండ అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి.
Balakrishna Akhanda 2 Latest Update
ముఖ్యంగా బోయపాటి శ్రీను మూవీస్ లో ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్కువగా మాస్ యాక్షన్ అంశాలు కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తొలిసారిగా బోయపాటి తీసిన మూవీ సరైనోడు పెద్ద విజయం అందుకోవడంతో పాటు దాని యొక్క హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో అతి పెద్ద విజయం అందుకుని హీరోగా అల్లు అర్జున్ కి అలానే దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి నార్త్ లో బాగా క్రేజ్ తీసుకువచ్చాయి.
ప్రధాన పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ నటి ఎవరో తెలుసా?
అనంతరం యువనటుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఆయన తీసిన జయ జానకి నాయక మూవీ కూడా తెలుగులో బాగా ఆడగా దానియొక్క హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా యూట్యూబ్ లో అదరగొట్టింది. ఇక ఇటీవల యువ నటుడు రామ్ పోతినేనితో తొలిసారిగా బోయపాటి శ్రీను తీసిన పాన్ ఇండియన్ మూవీ స్కంద.
Akhanda 2 Release Date
అయితే ఇది మాత్రం ఆశించిన స్థాయి అంచనాలు అందుకోలేకపోయింది. ఇక బోయపాటి శ్రీను మూవీస్ లో హీరోయిన్స్ పాత్రలు కూడా ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా వారి పాత్రలకు అందంతో పాటు అభినయానికి కూడా వీలుంటుంది. ఆ విధంగా తన సినిమాల హీరోయిన్స్ యొక్క పాత్రలు రాసుకుంటూ ఉంటారు బోయపాటి.
సినిమా వివరాలు, నటీనటులు, విడుదల సమాచారం
ఇక తాజాగా బాలకృష్ణ తో ఆయన తీస్తున్న మూవీ అఖండ 2 (Akhanda 2). ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ సంస్థ పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అఖండ 2 మూవీలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ సంయుక్తా మీనన్ నటిస్తుండగా ప్రగ్య జైస్వాల్ కూడా మరొక పాత్ర చేస్తున్నట్లు టాక్.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో కూడా హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) యొక్క పాత్ర ఎంతో బాగుటుందని టాక్. ముఖ్యంగా అఖండ 1 ని మించేలా ఇందులో భారీ మాస్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్ ని కూడా సిద్ధం చేశారట దర్శకుడు బోయపాటి శ్రీను. మొత్తంగా అఖండ 2 రిలీజ్ అనంతరం పార్ట్ 1 ని మించేలా మరింత పెద్ద విజయం ఖాయం అని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్.
What's Your Reaction?






