Samantha in Saree Photos – Latest HD Images & Stunning Looks

Samantha in Saree Photos టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ నటీమణుల్లో అందాల కథానాయిక సమంత రూత్ ప్రభు ఒకరు. తొలిసారిగా నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి ఆమె ఎంట్రీ ఇచ్చారు

Samantha in Saree Photos – Latest HD Images & Stunning Looks
టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ నటీమణుల్లో అందాల కథానాయిక సమంత రూత్ ప్రభు ఒకరు. తొలిసారిగా నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి ఆమె ఎంట్రీ ఇచ్చారు. కేరళ కు చెందిన సమంత అప్పట్లో అక్కడి స్థానికి కేబుల్ ఛానల్ లో యాడ్స్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. వాటి ద్వారా ఆమెకు మంచి పేరు లభించింది. తెలుగులో ఫస్ట్ మూవీ ఏమాయ చేసావేలో జెస్సి గా తన ఆకట్టుకునే అందం అభినయంతో ఆకట్టుకున్నారు. 

ఆపైన బాన కాతడి, మాస్కోవిన్ కావేరీ వంటి తమిళ సినిమాల్లో ఆమెకు హీరోయిన్ గా అవకాశం లభించింది. అవి మంచి విజయం అందుకుని తమిళనాట నటిగా ఆమెకు బాగానే పేరు అందించాయి. అనంతరం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి తీసిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బృందావనంలో ఒక హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు సమంత.

కాజల్ మరొక హీరోయిన్ గా నటించిన ఆమూవీ సక్సెస్ కూడా సమంతకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీనువైట్ల తీసిన దూకుడు మూవీలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ రావడం, అది రిలీజ్ అనంతరం అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో సమంత క్రేజ్ అమాంతం పెరిగింది.

Samantha in Saree Photos – Latest HD Images & Gorgeous Looks

ముఖ్యంగా అప్పట్లో యువత తో పాటు మాస్, క్లాస్ ఆడియన్స్ లో కూడా బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు సమంత రూత్ ప్రభు. ఆపైన రాజమౌళి తీసిన ఈగలో నానికి జోడీగా నటించి మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు సమంత. ఆ తరువాత నుండి వరుసగా మహేష్ బాబు తో మరొక్కసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా, నాగ చైతన్యతో మనం వంటి సినిమాలు ఆమెకు మరింతగా పేరు తీసుకువచ్చాయి.

ఇందులో పలు సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకోగా మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా టాలీవుడ్ లో సమంత తిరుగులేని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్ళసాగారు. ముఖ్యంగా అప్పట్లో అవకాశం వచ్చిన సినిమాలు జాగ్రత్తగా చేస్తూ కొనసాగిన సమంత రూత్ ప్రభు, ఎక్కువగా సక్సెస్ లని అందుకోవడంతో టాలీవుడ్ లో ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని అనేవారు.

ఇక అటు తమిళ్ లో కూడా అక్కడి సూపర్ స్టార్స్ అయిన సూర్య, విజయ్, విక్రమ్ వంటి వారి సినిమాలు చేసి అక్కడా కూడా తన ఆకట్టుకునే అందం, అభినయంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు సమంత రూత్ ప్రభు. అలానే ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన బేబీ, యూ టర్న్ సినిమాలు అప్పుతో విజయాలు అందుకుని ఆమెకు మరింత పేరు తీసుకువచ్చాయి.

Samantha Traditional Saree Photos – Ethnic Elegance

అయితే ఆ తరువాత రామ్ చరణ్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ లో ఊ అంటావా మావా ఊఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ లో నటించి ఆకట్టుకున్నారు సమంత. అయితే రిలీజ్ అనంతరం పుష్ప మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు అల్లు అర్జున్ తో కలిసి ఆమె చిందేసిన ఆ స్పెషల్ సాంగ్ యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని సమంత క్రేజ్ మరింత పెంచింది.

ఇక తాను ఇష్టపడ్డ నాగ చైతన్యని ప్రేమించి వివాహం చేసుకున్న సమంత, ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆయన నుండి అధికారికంగా విడిపోయి ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి విడిగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత ఎంతో ఆవేదన ఎదుర్కొన్నానని అన్నారు.

Samantha Modern Saree Styles – Trendy & Stylish Avatars

అయితే విడాకుల సమయంతో పాటు అనారోగ్య సమయంలో తనకు ఫ్యాన్స్ తో పాటు కుటుంబం, శ్రేయోభిలాషులు ఎంతో అండగా నిలిచారని, వారి యొక్క తోడ్పాటు, అందించిన ధైర్యం ఎప్పటికా మర్చిపోలేని అంటారు సమంత. ఇక ఇటీవల పలు పుణ్యక్షేత్రాలు తిరిగిన సమంత తనకు ప్రస్తుతం శారీరకంగా మానసికంగా కొంత ప్రశాంతత లభించిందని అన్నారు.

అలానే అటు అమెజాన్ ప్రైమ్ వారి ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో రాజీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు సమంత. ఆ సిరీస్ తో సమంతకు నేషనల్ వైడ్ గా ఎంతో క్రేజ్ అందుకున్నారు. ఆపైన ఆమె ప్రధాన పాత్రలో గుణశేఖర్ తీసిన మైథలాజికల్ ఎమోషనల్ డ్రామా మూవీ శాకుంతలం పెద్దగా విజయం అందుకోనప్పటికీ అందులో టైటిల్ రోల్ అయిన శకుంతల పాత్రలో సమంత నటనకు అందరి నుండి మంచి పేరు లభించింది.

అలానే సమంత నటించిన యశోద మూవీ పాన్ ఇండియన్ రేంజ్ ఆడియన్స్ ముందుకి వచ్చి బాగానే విజయం అందుకుంది. ఆ మూవీతో కూడా సమంత మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక తన పర్సనల్ విషయాలకు వెళితే ఎక్కుగా ట్రెండీ అండ్ లేటెస్ట్ అవుట్ ఫిట్స్ వాడే సమంత, మధ్యలో పలు వేడుకలు , శుభకార్యాల సమయంలో చీరకట్టులో దర్శనం ఇస్తుంటారు.

Samantha in Silk Saree – South Indian Beauty in Ethnic Wear

ముఖ్యంగా చీరకట్టులో సమంత మరింత ఆకట్టుకుంటారని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు కూడా. ఆ విధంగా ఏ విధమైన కాస్ట్యూమ్ లో అయినా తన అందంతో అందరినీ మెప్పిస్తారు సమంత. ఎప్పుడూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగితేనే జీవితంలో మనం ముందుకు సాగగలం అని, అదే మనకు సమస్యలు వచ్చినపుడు కృంగిపోతే అక్కడే ఆగిపోయి అంతా కూడా చీకటిగా అనిపిస్తుందని అంటారు సమంత. తన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుకొన్నప్పటికీ ఎప్పటికప్పుడు తనలో మనోనిగ్రహంతో జీవిత గమనాన్ని సాగిస్తానని చెప్తారు సమంత.

Best Samantha Saree Photoshoot Moments & Social Media Trends

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow