Telugu Movies Box Office Collection Worldwide

Complete report of worldwide box office collections of Telugu movies including India, USA, Gulf, and other overseas markets

Telugu Movies Box Office Collection Worldwide

తెలుగు మూవీస్ (Telugu Movies) లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విలయం నమోదు చేసి కలెక్షన్స్ పరంగా ప్రభంజనం సృష్టించాయి. కాగా అటువంటి సినిమాలు ఏవి ఆ విధంగా అంత పెద్ద విజయాలు సొంతం చేసుకున్న స్టార్స్ ఎవరు అనేది మొత్తం కూడా ఇప్పుడు లిస్ట్ ప్రకారం చూద్దాం.  ముందుగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రారంభం అయిన ఈ రికార్డుల జోరు ప్రస్తుతం మరింతగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. అటు బాలీవుడ్ (Bollywood) ని సైతం దాటుకుని మరింతగా తెలుగు మూవీస్ దూసుకెళ్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. 

Baahubali The Conclusion Total Worldwide Collection 

2015లో వచ్చిన బాహుబాలి పార్ట్ 1 కి సీక్వెల్ గా ఇది. ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీలో అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, సత్యరాజ్, సుబ్బరాజు, నాజర్, రానా దగ్గుబాటి తదితరులు నటించారు. ఇక బాహుబలి 2 మూవీ అందరి అంచనాలని అందుకోవడంతో పాటు తెలుగు సహా పలు ఇతర పాన్ ఇండియన్ భాషల్లో అత్యద్భుత విజయం సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవ్యాప్తం చేసింది. ముఖ్యంగా బాహుబలి 2 మూవీ నార్త్ లో కూడా అదరగొట్టడంతో పాటు అక్కడి ఆడియన్స్ ని సైతం విశేషంగా అలరించింది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని కొల్లగొట్టి ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండడం విశేషం. 

Pushpa 2 The Rule Total Worldwide Box Office Collection 

పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ తీసిన ఈ మూవీ అంతకముందు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ అనేది తెలిసిందే. ఇక పుష్ప 2 మూవీ 2024 డిసెంబర్ లో భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద విజయం అందుకోవడం విశేషం. ఇక ఈ మూవీ నార్త్ లో భారీ స్థాయిలో నెట్ కలెక్షన్ అందుకున్న మూవీగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఈమూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని హీరోగా అల్లుల్ అర్జున్ క్రేజ్, మార్కెట్ ని విపరీతంగా పెంచేసింది. 

తెలుగు సినిమాల వరల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు

RRR Total Worldwide Box Office Collection

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించగా హాలీవుడ్ నటులు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ కీలక పాత్రలు చేసారు. 2022 మార్చిలో రిలీజ్ అయిన ఈ భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక రిలీజ్ అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ రూ. 1387 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 

Kalki 2898 AD Total Worldwide Box Office Collection 

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని ప్రముఖ సంస్థ వైజయంతి మూవీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ కార్ కి ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, మృణాల్ ఠాకూర్, శోభన వంటివి వారు కీలక పాత్రలు చేసిన కల్కి మూవీ అందరినీ ఆకట్టుకుని భారీ సక్సెస్ సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వరకు గ్రాస్ కొల్లగొట్టింది. 

Salaar Part 1 Ceasefire Total Collection Worldwide 

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 మూవీలో శ్రియా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బ్రహ్మాజీ, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు చేయగా రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీని ప్రముఖ కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలింస్ వారు గ్రాండ్ గా నిర్మించగా భువన గౌడ ఫోటోగ్రఫి అందించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ మొత్తంగా రిలీజ్ అనంతరం భారీ సక్సెస్ సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వరకు గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

ఓవర్సీస్, ఇండియా కలెక్షన్ డీటెయిల్స్

Baahubali The Beginning Total Worldwide Box Office Collection 

దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా రూపొందిన ఎపిక్ యాక్షన్ డ్రామా మూవీ బాహుబలి పార్ట్ 1. ఈ మూవీలో రమ్యకృష్ణ, రానా దగ్గుబాటి కీలక పాత్రలు చేయగా ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ దీనిని గ్రాండ్ గా నిర్మించింది. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాబుబలి గా ప్రభాస్ రెండు పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక అప్పట్లో తొలిసారిగా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ అయిన బాహుబలి ది బిగినింగ్ అందరినీ ఆకట్టుకుని భారీ విజయం అందుకోవడంతో పాటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

Devara Part 1 Total Collection Worldwide 

టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందించగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మించాయి. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించగా ఇతర కీలక రోల్స్ లో అజయ్, సైఫ్ ఆలీ ఖాన్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, అజయ్ నటించారు. మొత్తంగా అందరినీ ఆకట్టుకుని రిలీజ్ అనంతరం అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న దేవర పార్ట్ 1 మూవీ వరల్డ్ వైడ్ గా ఓవరాల్ బాక్సాఫీస్ వద్ద రూ. 521 కోట్లని రాబట్టింది. 

Saaho Total Worldwide Box Office Collection 

బాహుబలి సిరీస్ సినిమాల అనంతరం పాన్ ఇండియన్ హీరోగా ఎంతో గొప్ప పేరు, క్రేజే, మార్కెట్ సొంతం చేసుకున్న ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ సాహూ. ఈ మూవీలో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో మురళి శర్మ, టిన్ను ఆనంద్, జాకీ ష్రాఫ్, సుప్రీత్ తదితరులు నటించారు. ఈ మూవీలో ఆకట్టుకునే పాత్రలో నటించి అందరినీ మెప్పించిన ప్రభాస్ దీనితో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా టీజర్, ట్రైలర్ తో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన సాహూ మూవీ ఓవరాల్ గా పలు భాషల్లో రిలీజ్ అనంతరం వరల్డ్ వైడ్ గా రూ. 439 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది. 

దినసరి వసూళ్లు, టోటల్ గ్రాస్ మరియు నెట్ కలెక్షన్లు

Adipurush Total Box Office Collection Worldwide 

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ నటి కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీలో రాఘవ గా ప్రభాస్, జానకి గా కృతి సనన్ నటించగా లంకేశ్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. అయితే ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ మూవీ ప్రారంభం నాటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ లో అలానే సాధారణ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరిచి పలు భాషల్లో రిలీజ్ అనంతరం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 392 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. 

Pushpa The Rise Total Worldwide Box Office Collection 

పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప ది రైజ్.ఈ మూవీలో మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు చేయగా తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మించింది. ఇక ఈ మూవీలో పుష్పరాజ్ గా తన అత్యద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక రిలీజ్ అనంతరం పుష్ప ది రైజ్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని రాబట్టింది. 

Hanu-Man Total Worldwide Box Office Collection 

యువ నటుడు తేజ సజ్జ హీరోగా అందాల నటి అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్రఖని వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు చేసారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించిన ఈమూవీకి గౌర హరి, అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన హను మాన్ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow