Telugu Movie Box Office Collection Today: Hits & Records

Live Telugu box office collection report – today’s earnings & top grossers.

Telugu Movie Box Office Collection Today: Hits & Records

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ ఏడాది ఇప్పటికే గడిచిన నాలుగు నెలల్లో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి రాగా వాటిలో పలు సినిమాలు పెద్ద విజయవంతం కాగా మరికొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయిన పలు సినిమాల యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్ డీటెయిల్స్ ని ఇప్పుడు వివరంగా చూద్దాం. 

గేమ్ చేంజర్ (Game Changer) :

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తీసిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ కథని అందించిన ఈ మూవీకి రాక్ స్టార్ థమన్ స్వరాలు సమకూర్చారు. అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. మొత్తంగా గేమ్ ఛేంజర్ మూవీ రూ. 200 కోట్ల వరకు మాత్రమే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అందుకుంది. 

తెలుగు బాక్సాఫీస్ కలెక్షన్ (ఈ రోజు)

డాకు మహారాజ్ (Daaku Maharaaj) :

బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా కీలక పాత్రలో కనిపించగా హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ కనిపించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అనంతరం బాగా సక్సెస్ సాధించింది. బాలకృష్ణ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి బాగా పేరు వచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ డాకు మహారాజ్ మూవీ రూ. 185 కోట్ల గ్రాస్ అందుకుంది. 

సంక్రాంతికి వస్తున్నాం : (Sankranthiki Vasthunam)      

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తీసిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షిచౌదరి హీరోయిన్స్ గా నటించగా భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించారు. ఓవరాల్ గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకోవడం విశేషం. 

తండేల్ (Thandel) :

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా అందాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అనంతరం విజయఢంకా మ్రోగించి రూ. 100 కోట్లు కొల్లగొట్టింది. 

ఛావా  (Chhaava) :

విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా యువ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఛావా. ఈ మూవీలో మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ పై దినేష్ విజన్ గ్రాండ్ గా నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో విక్కీ కౌశల్ యాక్షన్ కి మంచి పేరు దక్కింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ మూవీ అదరగొట్టింది. ఛావా మూవీ తెలుగులో రూ. 17 కోట్ల కలెక్షన్ ఆర్జించింది. 

ఎంపురాన్ (L2 Empuraan)

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎంపురాన్. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న లూసిఫర్ కి ఇది కొనసాగింపు. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అనంతరం పెద్ద విజయం అందుకుని హీరోగా మోహన్ లాల్ కు దర్శకుడిగా పృథ్వీరాజ్ కు మరింత మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు లో కూడా ఎంపురాన్ మూవీ బాగానే ఆర్జించింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 260 కోట్లు కొల్లగొట్టింది.

టాప్ 5 సినిమాల కలెక్షన్స్

కోర్ట్ : (Court)    

యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేఇ జంటగా యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీలో ప్రియదర్శి పులికొండ, సాయి కుమార్, రోహిణి, శివాజీ తదితరులు ముఖ్య పాత్రలు చేసారు. చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించింది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 70 కోట్ల అందుకుంది. 

మాడ్ స్క్వేర్ (Mad Square) :

యువ నటులు నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, సంగీత్ శోభన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్. అంతకముందు రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న మాడ్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన మాడ్ స్క్వేర్ కూడా భారీ విజయం అందుకుంది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 70 కోట్లు కొల్లగొట్టింది. 

గుడ్ బాడ్ అగ్లీ (Good Bad Ugly) 

అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుడ్ బాడ్ అగ్లీ. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అజిత్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో పాటు యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక గుడ్ బాడ్ అగ్లీ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 245 కోట్ల గ్రాస్ అందుకుంది. 

హిట్ మరియు ఫ్లాప్ చిత్రాలు

తుడరుమ్ (Thudarum)   

మోహన్ లాల్, శోభన హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తుడరుమ్. ఈ మూవీని రేజపుత్ర విజువల్ మీడియా సంస్థ గ్రాండ్ గా నిర్మించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అయితే ఇటీవల అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అందరి నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా రూ. 165 కోట్లు రాబట్టింది. 

హిట్ 3  (Hit The Third Case) 

నాని హీరోగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీని యూనానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు నిర్మించాయి. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో నాని యాక్టింగ్ అదరగొట్టగా మూవీ ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ. 92 కోట్లు కలెక్షన్ అందుకుని రూ. 100 కోట్లకు పరుగెడుతోంది. మరి ఓవరాల్ గా హిట్ 3 ఎంత మేర రాబడుతుందో చూడాలి. 

ఇటువంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్ డేట్స్, బాక్సాఫీస్ కలెక్టన్స్ డీటైల్స్ కోసం తరచు మన Telugu Movie Media వెబ్ సైట్ ని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి, ధన్యవాదములు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow