Akhil Akkineni Wedding Photos – Shared Stunning Pics on Social Media

Akhil Akkineni shares beautiful wedding photos on social media. Fans can’t stop showering love. Check unseen pics and family moments here

Akhil Akkineni Wedding Photos – Shared Stunning Pics on Social Media

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ నుండి ఆయన అనంతరం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక నటుడిగా ఎన్టీఆర్ తో దాదాపుగా సమానంగా క్రేజ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో కొనసాగారు అక్కినేని. నటుడిగా ఆయనకు విశేషమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక కెరీర్ పరంగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన మెప్పించిన నాగేశ్వరరావు తరువాత హీరోగా విక్రమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. 

అఖిల్ అక్కినేని పెళ్లి ఫోటోలు – సోషల్ మీడియాలో వైరల్

ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే నటుడిగా తనని తాను నిరూపించుకున్నారు నాగ్. ఇక అక్కడి నుండి నటుడిగా వచ్చిన అవకాశాలు అన్ని వినియోగించుకున్న ఆయన వేగంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా దూసుకెళ్లారు. అనంతరం ఇటీవల ఆయన కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరూ కూడా హీరోస్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Akhil Akkineni Wedding

తొలిసారిగా జోష్ మూవీతో చైతు, అలానే అఖిల్ మూవీతో అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అటు తాతయ్య తండ్రి మాదిరిగా తమ ఆకట్టుకునే నటనతో ఫస్ట్ మూవీస్ తో మంచి పేరు అందుకున్నారు ఈ ఇద్దరు నటులు. అలానే క్రేజ్ పరంగా మంచి పేరుతో ఈ ఇద్దరూ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఏ మాయ చేసావే సినిమాతో పెద్ద విజయం అందుకున్న చైతన్య, ఆ మూవీలో తనకు జోడీగా నటించిన సమంత రూత్ ప్రభుని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. 

అయితే నాలుగేళ్ళ వివాహానంతరం ఆయన కొన్ని కారణాల రీత్యా ఆమె నుండి విడిపోయారు. ఇటీవల శోభిత ని చైతన్య రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అఖిల్ విషయానికి వస్తే కొన్నాళ్ల క్రితం అఖిల్ కు శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. అయితే కొన్ని కారణాల రీత్యా వారిద్దరి పెళ్లి కాలేదు. 

అనంతరం పూర్తిగా తన కెరీర్ పైన ఫోకస్ పెట్టిన అఖిల్, తాజాగా 2025 జూన్ 6న తన స్నేహితురాలు అయిన జైనబ్ రవ్జీ ని వివాహం చేసుకున్నారు. తమ కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో పరిమితంగా వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. అనంతరం వీరి రిసెప్షన్ వేడుకని హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేయగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులని ఆశీర్వదించారు. 

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో మధురమైన క్షణాలు

అనంతరం నాగార్జున కూడా తన కుమారుడి యొక్క వివాహ విషయంలో ఎంతో ఆనందము వ్యక్తం చేస్తూ పలు ఫొటోస్ వీడియోస్ షేర్ చేసారు. అయితే అసలు విషయం ఏమిటంటే, పెళ్లి తరువాత తొలిసారిగా నేడు అఖిల్ అక్కినేని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పెళ్లి ఫోటోలని ఫ్యాన్స్, ఆడియన్స్ కి షేర్ చేయడంతో పాటు తన జీవితంలో ఇది ఎంతో మధురమైన జ్ఞాపకంగా అభివర్ణించారు. 

Akhil Akkineni Marriage Photos

ముఖ్యంగా నా జీవితంలోని అత్యుత్తమ రోజుల లోని కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానైకి అనిపించింది అంటూ భార్య జైనబ్ తో కలిసి పెళ్లివై వేడుకలో ఎంజాయ్ చేసిన ఫోటోలని పోస్ట్ చేస్తూ క్యాప్షన్ పెట్టారు. కాగా ఆ ఫోటోల పై పలువురు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ స్పందిస్తూ నూతన జంట కలకాలం ఎంతో ప్రేమానురాగాలతో, చిరునవ్వులు ఆనందంతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

Akhil Akkineni Marriage Photos

ప్రస్తుతం అఖిల్ పోస్ట్ చేసిన ఫోటోలు అలానే పోస్ట్ సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతున్నాయి. కాగా అఖిల్ కెరీర్ విషయానికి వస్తే రెండున్నరేళ్ల క్రితం అఖిల్ ఎంతో కష్టపడి చేసిన మూవీ ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అవ్వడంతో ఇకపై చేసే సినిమాల విషయమై ఆయన ఎంతో శ్రద్ధ పెట్టారు. 

వాస్తవానికి కెరీర్ బిగినింగ్ లో వచ్చిన అఖిల్ మొదలుకుని ఆపైన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు చేసి నటుడిగా ప్రతి సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకున్నారు అఖిల్. అయితే ఆయన స్థాయి సక్సెస్ తో పాటు ఫ్యాన్స్ ఆశించిన మాస్ యాక్షన్ సక్సెస్ఫుల్ మూవీ మాత్రం ఆయన నుండి రాలేదు. అక్కడి నుండి అఖిల్ తో పాటు నాగార్జున కూడా మంచి స్క్రిప్ట్స్ ని వెతుకుతుండడంతో పాటు పలువురు దర్శకుల నుండి కథలు కూడా విన్నారు. 

ఫ్యాన్స్ రియాక్షన్స్ – లైక్స్ & కామెంట్స్ తో ఫుల్ హ్యాపీ

మొత్తంగా ప్రస్తుతం కొంత గ్యాప్ అనంతరం ప్రస్తుతం ఒక మూవీ చేస్తున్నారు అఖిల్ అక్కినేని. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫేమ్ మురళి కిషోర్ దర్శకత్వంలో అఖిల్ ఒక మూవీ చేస్తున్నారు. 

Akhil Social Media Pics

లెనిన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ రూరల్ యాక్షన్ కమర్షియల్ మాస్ డ్రామా మూవీలో తొలుత యువ అందాల నటి శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చేసి కొన్ని సీన్స్ కూడా తీశారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆమె ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఆమె హీరోయిన్ గా చేస్తున్నారు. 

కాగా ఆ మూవీ యొక్క డేట్స్ క్లాష్ కావడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకోగా ఆమె స్థానంలో మిస్టర్ బచ్చన్ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ని హీరోయిన్ గా ఎంపిక చేసిందట లెనిన్ టీమ్. దీనిపై వారి నుండి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ మూవీ తప్పకుండా తమ అక్కినేని ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు సహా టీమ్ అంతా ఎంతో శ్రద్ధ తో తెరకెక్కిస్తున్నారని, ఇక తాను కూడా ఈమూవీతో అందరినీ మంచి విజయం అందించాలనే కసితో హీరో అఖిల్ కూడా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Tollywood Latest News

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో లెనిన్ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తంగా అక్కినేని ఫ్యామిలీ మూడవ తరం హీరో అక్కినేని అఖిల్ అటు ఫ్యామిలీ లైఫ్ లో ఆనందంగా కొనసాగాలని అలానే కెరీర్ పరంగా లెనిన్ మూవీతో పెద్ద విజయం సొంతం చేసుకుని అక్కడి నుండి నటుడిగా మరింతగా కెరీర్ పరంగా దూసుకెళ్లాలని మా Telugu Movie Media టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు శుభాభినందనలు తెలియచేస్తోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow