Top Telugu Actress List 2025 | Photos, Movies, Profiles

Check out the most popular Telugu actresses in 2025 with photos, hit movies, personal profiles, and social media buzz. Updated regularly

Top Telugu Actress List 2025 | Photos, Movies, Profiles

Samantha Ruth Prabhu 

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్, స్టార్డంతో కొనసాగుతున్న హీరోయిన్స్ లో సమంత రూత్ ప్రభు ఒకరు. తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టారు. నాగచైతన్య హీరోగా నటించిన ఆ మూవీని గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం, నానితో ఈగ సినిమాలు చేసి మరొక మూడు సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో అక్కడి నుండి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత, అనంతరం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్టార్స్ నటన ఛాన్స్ లు సొంతం చేసుకుని అక్కడ కూడా విజయాలు అందుకున్నారు. ఆపైన అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శితం అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో కూడా నటించారు. ఇటీవల అందులోనే ప్రసారం అయిన సిటాడెల్ హానీ బన్నీ సిరీస్ ద్వారా కూడా అలరించారు. ఇటీవల నిర్మాతగా శుభం మూవీ తీసిన సమంత ప్రస్తుతం పలు ప్రాజక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 

Famous Telugu heroines

Anushka Shetty 

టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టి తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ మూవీ ద్వారా నటిగా పరిచయం అయ్యారు అనంతరం పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న అనుష్క శెట్టి, ఆపైన కోడి రామకృష్ణ తీసిన హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అరుంధతి ద్వారా భారీ విజయం సొంతం చేసుకుని స్టార్ నాటినా విశేషమైన క్రేజ్ అందుకున్నారు. అక్కడి నుండి కెరీర్ పరంగా ఆమె వెనుదిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, కింగ్ నాగార్జున, నటసింహం బాలకృష్ణ ఇలా పలువురు స్టార్స్ తో సినిమాలు చేసిన అనుష్క అటు తమిళ్ లో కూడా స్టార్ నటులు సూర్య, విజయ్, అజిత్ లతో కూడా పలు సినిమాలు చేసారు. ఇక కొన్నేళ్ల క్రితం ప్రభాస్ హెరొగా రాజమౌళి తీసిన బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలో దేవసేనగా అద్భుత నటనతో నేషనల్ వైడ్ ఆడియన్స్ ని అలరించారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఆమె ఘాటీ మూవీ చేస్తున్నారు. 

Telugu heroine Instagram followers

Sai Pallavi 

శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. ఆ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా రిలీజ్ అనంతరం మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. అందులో ఆకట్టుకునే అందం, అభినయం, డ్యాన్స్ తో అందరినీ అలరించిన సాయి పల్లవి అక్కడి నుండి వరుసగా పలు అవకాశాలు అందుకున్నారు. తెలుగులో  పలువురు యువ నటుల సరసన ఆమె చేసిన సినిమాలు చాలావరకు విజయవంతం అయ్యాయి. అటు మలయాళంలో తొలిసారిగా ప్రేమం మూవీతో భారీ విజయం అందుకున్న సాయి పల్లవి తమిళ్ ల కూడా విజయాలు అందుకుని అక్కడి ఆడియన్స్ ని కూడా అలరించారు. ఇటీవల తమిళ్ లో అమరన్, తెలుగులో తండేల్ మూవీ అఖండ విజయాలు హీరోయిన్ గా సాయి పల్లవికి విశేషమైన క్రేజ్ తీసుకువచ్చాయి. 

Top Tollywood actress 2025

Shruti  Haasan 

లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో ఎన్నో అవకాశాలతో అలానే సక్సెస్ లతో స్టార్ నటిగా కొనసాగుతున్నారు. తొలిసారిగా తెలుగులో సిద్దార్థతో కలిసి ఆమె చేసిన ఫాంటసీ యాక్షన్ మూవీ అనగనగా ఒక ధీరుడు. ఆ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది. అక్కడి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా పలువురు స్టార్స్ తో సినిమాలు చేసి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు శృతి హాసన్.  ఆపైన అటు తమిళ్ లో కూడా పలువురు స్టార్స్ నటించి విజయాలు అందుకున్న ఆమె, హిందీలో కూడా అనేక సినిమాలు చేసారు. ఓవైపు తన ఆకట్టుకునే గ్లామర్, యాక్టింగ్ తో అందరినీ అలరించిన శృతి హాసన్, మరోవైపు తన టాలెంట్ తో సింగర్ గా అలానే మ్యూజిక్ కంపోజర్ గా కూడా పేరు అందుకున్నారు. ప్రస్తతం ఆమె పలు క్రేజీ ప్రాజక్ట్స్ చేస్తున్నారు. 

టాప్ తెలుగు హీరోయిన్ లిస్ట్ 2025

Tamannaah Bhatia 

స్టార్ నటి తమన్నా భాటియా చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ్ తో పాటు హిందీ లో కూడా సినిమాలు ఉన్నాయి. తొలిసారిగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన శ్రీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు తమన్నా. ఆ తరువాత హ్యాపీ డేస్ మూవీ భారీ విజయం ఆమెకు కెరీర్ పరంగా బ్రేక్ అందించింది. అక్కడి నుండి అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా దాదాపుగా అందరు స్టార్స్ తో నటించి మెప్పించిన మిల్కీ బ్యూటీ తమన్నా, అటు హిందీలో కూడా స్టార్స్ తో కలిసి వర్క్ చేసి విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక హిందీలో కూడా తమన్నా పలు సక్సెస్ లు అందుకోవడమా విశేషం. అలానే అక్కడక్కడా పలు సినిమాల్లో తమన్నా చేసిన ప్రత్యేక డ్యాన్స్ నంబర్స్ ఫ్యాన్స్ ని యువతని మాస్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని ఆమెకు మరింత పేరు తీసుకువచ్చాయి. 

Trending Tollywood actresses

Kajal Aggarwal 

లక్ష్మి కళ్యాణం మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత కృష్ణవంశీ తీసిన చందమామ మూవీతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. అనంతరం రామ్ చరణ్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మగధీర మూవీ హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ అందించింది. ఇక అక్కడి నుండి దాదాపుగా అందరు స్టార్స్ తో నటించి పలు సక్సెస్ లు అందుకున్న కాజల్ అగర్వాల్, ఆపైన తమిళ్ కూడా అవకాశాలు అందుకున్నారు. అక్కడ కూడా ఆమెకు క్రేజ్ తో పాటు సక్సెస్ లు కూడా బాగా పేరు తీసుకువచ్చాయి. వీటితో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసిన కాజల్, ఇటీవల గౌతమ్ కిచ్లు తో వివాహం అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఎంతో సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. 

Beautiful Telugu film heroines

Rashmika Mandanna 

ప్రస్తుతం నేషనల్ వైడ్ గా విపరీతమై పేరు క్రేజ్ తో కొనసాగుతున్న రష్మిక మందన్న చేతిలో తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి. తెలుగులోకి నాగ శౌర్య సరసన ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ తరువాత నితిన్ తో భీష్మ మూవీతో మరొక విజయం అందుకున్నారు. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆమె చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా పెద్ద విజయం అందుకుంది. ఇక అక్కడి నుండి దూసుకెళ్లిన రష్మిక మందన్న ఆపైన పుష్ప, పుష్ప 2, ఆనిమల్ సినిమాల భారీ విజయాలతో జాతీయ స్థాయిలో పేరు అందుకున్నారు. అలానే ఆ మూవీస్ లో ఆమె కనబరిచిన నటనకు ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి ఎంతో మంచి పేరు లభించింది. ఇక అటు కన్నడలో కూడా ఓవైపు పలు సినిమాలు జాగ్రత్తగా ఎంచుటకంటూ కొనసాగుతున్న రష్మిక మందన్న రాబోయే సినిమాలతో ఎంతమేర క్రేజ్ అందుకుంటారో చూడాలి. 

హిట్ మూవీస్, బయో డేటా, సోషల్ మీడియాలో క్రేజ్

Keerthy Suresh 

స్టార్ నటి కీర్తి సురేష్ ఇటీవల ఆంటోనీ తట్టిల్ తో వివాహానంతరం ఎంతో జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. తొలిసారిగా తెలుగులో ఆమె చేసిన సినిమా నేను శైలజ. ఈమూవీలో రామ్ పోతినేని హీరోగా నటించారు. ఆ మూవీ మంచి విజయవంతం అయింది. అనంతరం ఒక్కొక్కటిగా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దూసుకెళ్లిన కీర్తి సురేష్, ఆపైన నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఒకప్పటి తెలుగు దిగ్గజ నటి సావిత్రి బయోపిక్ మహానటి ద్వారా భారీ విజయం అందుకోవడంతో పాటు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకోవడం విశేషం. అక్కడి నుండి తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా అనేక్ష్యం చేస్తూ కొనసాగుతున్న కీర్తి, ఇటీవల బేబీ జాన్ మూవీ ద్వారా హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో పలు క్రేజీ సినిమాలు ఉన్నాయి. 

Pooja Hegde 

స్టార్ నటి పూజా హెగ్డే అటు తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల అవకాశాలతో మంచి పేరుతో దూసుకెళ్తున్నారు. తొలిసారిగా నాగచైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీకి ఇచ్చారు. అక్కడి నుండి డీజే, గడ్డలకొండ గణేష్, అరవింద సమేత, అలవైకుంఠపురములో, మహర్షి సినిమాల భారీ విజయాలతో స్టార్ నటిగా విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆమె అందుకున్నారు. ఆపైన తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తాజాగా సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తీసిన రెట్రో మూవీ ద్వారా మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు పూజా హెగ్డే. తమిళ్ లో విజయ్ వంటి స్టార్స్ తో నటించి అక్కడి ఆడియన్స్ ని కూడా తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించారు పూజా హెగ్డే. 

Telugu actress name list with images

Raashi Khanna 

అందాలా యువ నటి రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా పలు సినిమా, సిరీస్ లలో అవకాశాలతో కొనసాగుతున్నారు. నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల తీసిన ఊహలు గుసగుసలాడే మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ తోనే మంచి పేరు, విజయం అందుకున్న రాశి ఖన్నా, ఆపైన తెలుగులో తనకు వచ్చిన అవకాశాలు అన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నారు. కెరీర్ పరంగా పలు పాత్రలతో ఆకట్టుకున్న రాశి ఖన్నా చేతిలో ప్రస్తుతం అనేక సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ఆ విధంగా తెలుగులో మాత్రమే కాకుండా పలు ఇతర భాషల ఆడియన్స్ యొక్క మెప్పు కూడా అందుకున్నారు రాశి ఖన్నా. 

తాజా ఫోటోలు మరియు అభిమానుల స్పందనలు

Nidhhi Agerwal 

యువ నటి నిధి అగర్వాల్, కొన్నేళ్ల క్రితం నాగచైతన్య హీరోగా రూపొందిన సవ్యసాచి మూవీ ద్వారా హీరోయిన్ గా తెలుగుకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అఖిల్ హీరోగా రూపొందిన మిస్టర్ మజ్ను మూవీ  విజయం అందుకోవడంతో పాటు ఆమెకు బాగా పేరు తీసుకువచ్చింది. అనంతరం ఉస్తాద్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయంతో నిధి అగర్వాల్ మరింతగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన ఆకట్టుకునే గ్లామర్ తో పాటు యాక్టింగ్ లో కూడా ఆకట్టుకుంటున్న అందాల నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు, ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమాలు చేస్తున్నారు. ఇవి ప్రస్తుతం పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. 

కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ తెలుగు మూవీ న్యూస్, అప్ డేట్స్, రివ్యూస్, గ్యాలరీ, బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్ కోసం ఎప్పటికప్పుడు మన Telugu Movie Media ని ఫాలో అవుతూ ఉండండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow