Telugu Movie Box Office Collection 2025 – Hit or Flop Reports

2025 Telugu box office updates: Check daily collections, hits & flops of Tollywood movies with complete reports

Telugu Movie Box Office Collection 2025 – Hit or Flop Reports

2025 ఏడాదిలో ఇప్పటికే గడచిన నాలుగున్నర నెలల్లో పలు సినిమాలు ఆడియన్సు  ముందుకి వచ్చి వారికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. కాగా వాటిలో సంక్రాంతికి వస్తున్నాం మొదలుకుని ఇటీవల సింగిల్ మూవీ వరకు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్నాయి. ముందుగా ఈ ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజెర్ మొదలుకుని పలు బడా, చిన్న సినిమాల యొక్క రిలీజ్ ప్రారంభం అయింది. మరి వాటిలో ఏ ఏ సినిమాలు ఎంతమేర బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి అనేది ఇప్పుడు లిస్ట్ ప్రకారం చూద్దాం. 

2025 తెలుగు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ లిస్ట్

Game Changer 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీలో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, సముద్రఖని కీలక పాత్రలు చేసారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. అయితే ఫస్ట్ డే ఆశించిన స్థాయి టాక్ ని ఈ మూవీ సొంతం చేసుకోలేకపోయింది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే బాగానే కలెక్షన్ సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. 

Daaku Maharaaj  

స్టార్ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ మాస మూవీ డాకు మహారాజ్. ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో శ్రద్ద శ్రీనాథ్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి నటించారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi), సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఫస్ట్ డే నుండే సక్సెస్ టాక్ అందుకున్న డాకు మహారాజ్ మూవీ ఓవరాల్ గా రూ. 140 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకుని బాలకృష్ణ కి మంచి విజయం అందించింది. 

Sankranthiki Vasthunam 

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Raesh) హీరోయిన్స్ గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రీషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ సంక్రాంతికి రిలీజ్ అయి భారీ విజయం అందుకుంది. వెంకీ తో పాటు అనిల్ రావిపూడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈమూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. 

హిట్ & ఫ్లాప్ మూవీ కలెక్షన్లు – డే వైజ్ అప్‌డేట్‌

Thandel 

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా అందాల నటి సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మొదటి నుండి అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన తండేల్ మూవీ రిలీజ్ అనంతరం ఫస్ట్ డే నుండి మంచి హిట్ టాక్ అందుకుంది. ఇక ఓవరాల్ గా క్లోజింగ్ కి వరల్డ్ వైడ్ రూ. 102 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది. 

Mad Square 

నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, సంగీత శోభన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మించగా భీమ్స్ సిసిలోరియో సాంగ్స్ ని అలానే ఎస్ థమన్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సమకూర్చారు. ముఖ్యంగా ఆకట్టుకునే కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలతో రూపొందిన ఈ మూవీ బాగానే విజయవంతం అయింది. ఇక ఇది ఓవరాల్ గా రూ. 66 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

Court 

నాచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా హర్ష్ రోషన్, శ్రీదేవి హీరో  హీరోయిన్స్ గా యువ దర్శకుడు రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీలో శివాజీ, ప్రియదర్శి పులికొండ, సాయి కుమార్, రోహిణి, శుభలేఖర్ సుధాకర్ కీలక పాత్రలు చేశారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ చిన్న సినిమా రిలీజ్ అనంతరం పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు కోర్ట్ డ్రామా సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 58 కోట్ల మేర గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.  

Single 

ఇటీవల నటుడిగా శ్రీవిష్ణు (Sree Vishnu) పలు వైవిధ్యమైన సినిమాలతో మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయన హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగిల్. ఈ మూవీలో డ్రాగన్ మూవీ ఫేమ్ ఇవానా (Ivana), కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ నటించారు. మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ యువతని అయితే మరింత అలరించింది. కాగా ఓవరాల్ గా సింగిల్ మూవీ రూ. 35 కోట్లు కలెక్ట్ చేసింది. 

టాలీవుడ్ మూవీలు ఏ స్థాయిలో కలెక్ట్ చేశాయో తెలుసుకోండి

Hit 3 The Third Case 

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాగా సక్సెస్ సాధించిన హిట్ 1, హిట్ 2 అనంతరం బాగా అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మొత్తంగా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఇందులో అర్జున్ సర్కార్ గా నాని పవర్ఫుల్ యాక్టింగ్ కి బాగా రెస్పాన్స్ లభించింది. ఆకట్టుకునే కథ, కథనాలు యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ మొత్తంగా క్లోజింగ్ లో రూ. 114 కోట్లు రాబట్టింది. 

Arjun Son of Vyajayanthi 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ మూవీ అర్జున్ సొన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి (Vijaya Shanthi) కీలక పాత్ర పోషించగా హీరోయిన్ గా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Sai Manjrekar) కనిపించారు. మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ సొంతం చేసుకుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. కాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ  వరల్డ్ వైడ్ రూ. 15 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Jack & Mazaka 

యువ నటుడు డీజే టిల్లు (DJ Tillu) ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ (SIddu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాక్. ఈ మూవీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొంది ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఓవరాల్ గా యావరేజ్ గా సక్సెస్ అయిన జాక్ మూవీ రూ. 9 కోట్లు రాబట్టింది. అలానే రావు రమేష్, సందీప్ కిషన్, అన్షు, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో త్రినాధరావు తీసిన లేటెస్ట్ కామెడీ మూవీ మజాకా. ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని అలరించి యావరేజ్ సక్సెస్ సొంతము చేసుకుంది. ఇక ఈ మూవీ కూడా ఓవరాల్ గా రూ. 9 కోట్లు రాబట్టింది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow