Blockbuster or Flop? Telugu Movies Box Office Collections 2025 List

Track the box office collections of Telugu movies released in 2025. Know which films are hits or flops.

Blockbuster or Flop? Telugu Movies Box Office Collections 2025 List

ఈ ఏడాదిలో ఆడియన్స్ ముందుకి వచ్చిన పలు సినిమాల్లో కొన్ని పెద్ద విజయం అందుకోగా మరికొన్ని అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఆగిపోయాయి. మరి వాటిలో ఏ సినిమా ఎంతమేర రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. 

Game Changer : 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ తీసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, అంజలి కీలక పాత్రలు చేసారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ ఏడాది సంకాంతి కానుకగా రిలీజ్ అయిన ఈమూవీ ఓవరాల్ గా రూ. 190 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది. 

Daaku Maharaaj :

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఒక ముఖ్య పాత్రలో బాలీవుడ్ అందాల నటి ఊర్వశి రౌటేలా కనిపించి అలరించారు. ఇంకా ఈ మూవీలో శ్రద్ధ్ద శ్రీనాథ్, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది. ఇక డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ ఓవరాల్ గా రూ. 175 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. 

2025 తెలుగు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు

Sankranthiki Vasthunam : 

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా యువ అందాల నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీని యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించగా ఇతర ముఖ్య పాత్రల్లో వికె నరేష్, పృథ్వీరాజ్, వైతివి గణేష్, సాయి కుమార్ తదితరులు నటించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సు ఈమూవీకి నీరజాలు పలికారు. ఓవరాల్ గ వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 300 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

Thandel : 

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక తండేల్ మూవీ ఆడియన్స్ ని అక్కినేని ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుని విజయవంతం అయింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఓవరాల్ గా రూ. 100 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకుంది. 

Dragon : 

కోలీవుడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ డ్రామా మూవీ డ్రాగన్. ఈ మూవీలో కయదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి విజయవంతం అయింది. ఇక ఈ మూవీకి యువత విశేషంగా అట్రాక్ట్ అయ్యారు. మొత్తంగా డ్రాగన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 150 కోట్ల మేర గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

Court :

యువ దర్శకుడు రామ్ జగదీశ్ తీసిన ఈ మూవీలో యువ నటీనటులు అయిన హర్ష్ రోషన్, శ్రీదేవి నటించగా ఇతర కీలక పాత్రల్లో ప్రియదర్శి, సాయి కుమార్, రోహిణి, శివాజీ, శుభలేఖర్ సుధాకర్ కనిపించారు. అయితే చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీస్ తో యువత కూడా ఎంతో ఆదరించారు. ఇక కోర్ట్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం. 

హిట్లు, ఫ్లాపులు మరియు కలెక్షన్ వివరాలు

Chhaava :

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా యువ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన లేటెస్ట్ హిస్టారికల్ భారీ యాక్షన్ డ్రామా మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈమూవీలో హీరో విక్కీ కౌశల్ అద్భుత నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు దక్కాయి. మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగులో కూడా అదరగొట్టింది. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఛావా మూవీ రూ. 790 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. 

L 2 : Empuraan : 

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ మూవీ ఎంపురాన్. మలయాళంతో పాటు అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం బాగానే సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. మంజు వారియర్, తోవినో థామస్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలని పోషించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 270 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ అందుకుంది. 

Mad Square : 

యువ నటులు నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు ఐఓ తదితరులు కీలక పాత్రల్లో నటించినాఈ మూవీని కళ్యాణ్ శంకర్ 
తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ గ్రాండ్ గ నిర్మించారు. అయితే ఇటీవల బాగా క్రేజ్ తో ఆడియన్స్ ముందుకి వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా సక్సెస్ సాధించి ఓవరాల్ గా రూ. 70 కోట్ల మేర వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. 

మొదటి వారాంతం కలెక్షన్ల విశ్లేషణ

Hit 3 The Third Case : 

నాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మూవీ నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ తో కొనసాగుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మించాయి. ఈ మూవీలో అర్జున్ సర్కార్ గా నాని నటనకు మంచి ప్రసంశలు కురుస్తున్నాయి. కాగా ఫస్ట్ డే రూ. 47 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొత్తంగా ఎంత మేర రాబడుతుందో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow