Highest Grossing Telugu Movies in USA (North America) – Tollywood Box Office
Discover the highest grossing Telugu movies in USA with full Tollywood box office collections. Find out which films broke records at the North American market

తెలుగు సినిమాలు (Tollywood) గత పది పదిహేనేళ్ల లో మెల్లగా మన మార్కెట్ ని మరింతగా పెంచుతూ కొనసాగుతున్నాయి. ముందుగా 2015 లో వచ్చిన టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ బాహుబలి Baahubali పార్ట్ 1 ఎంతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ వైడ్ గా రూ. 650 కోట్లు రాబట్టింది.
ఈ మూవీలో ప్రభాస్ (Prabhas) డ్యూయల్ రోల్ పోషించగా ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దీనిని తెరకెక్కించారు. ఇక ఈమూవీలో అనుష్క శెట్టి (Anushka Shetty), తమన్నా (Tamannaah Bhatia), రమ్యకృష్ణ (Ramya Krishnan), సత్యరాజ్ (Satyaraj), రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్రలు చేశారు. అనంతరం 2017లో దీనికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 మూవీ మరింత పెద్ద విజయం అందుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పింది.
Telugu Movies in USA Highest Grossing Collections (North America)
ఈ మూవీ ఏకంగా రిలీజ్ అనంతరం సంచలన విజయం అందుకోవడంతో పాటు వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్ల కలెక్షన్ ని రాబట్టింది. ముఖ్యంగా ఇక్కడి నుండి ఇతర సౌత్ భాషలు సహా హిందీ వారు సైతం మన తెలుగు సినిమాల వైపు చూడసాగారు. అటు నార్త్ లో సైతం బాహబలి సినిమాలు బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించడం విశేషం.
ఆ తరువాత నుండి పలు తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ రేంజ్ లో చిత్రీకరించబడి మంచి విజయవంతం అయ్యాయి. అయితే ఆ తరువాత 2021 ఎండింగ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు ఆ మూవీలో సహజంగా నటించిన అల్లు అర్జున్ కి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తీసుకువచ్చింది.
USA Highest Grossing Collections of Tollywood Movies (North America)
ఇక అక్కడి నుండి నటుడిగా జాతీయ స్థాయిలో తన క్రేజ్ పెంచుకున్న అల్లు అర్జున్, ఆపైన ఇటీవల దానికి సీక్వెల్ గా చేసిన మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ అయితే మరింత భారీ విజయం సొంతం చేసుకుని దేశవిదేశాల్లో పెద్ద స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంది. అటు నార్త్ బెల్ట్ లో పుష్ప 2 మూవీ ఏకంగా దాదాపుగా రూ. 950 కోట్ల నెట్ కలెక్ష సొంతం చేసుకోవడం అద్భుత విషయం.
ఇప్పటివరకు ఏ ఒక్క భారతీయ సినిమా కూడా ఈ ఫీట్ ని అందుకోలేకపోయాయి. ఇక అంతకముందు ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.), రామ్ చరణ్ లతో రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ RRR కూడా వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది.
Tollywood Movies Highest Collectionin USA (North America)
ఆ మూవీ ఏకంగా రూ. 1450 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టడంతో పాటు అందులోని నాటు నాటు (Naatu Naatu) సాంగ్ కి ఆస్కార్ (Oscar Award) అవార్డు కూడా సొంతం చేసుకుని భారతీయ సినిమా ఖ్యాతిని ఆకాశం అంత ఎత్తుకి తీసుకువెళ్ళింది. అలానే ఎన్టీఆర్ నటించిన దేవర, ప్రభాస్ నటించిన సలార్ (Salaar), కల్కి 2898 ఏడి సినిమాలు కూడా భారీ విజయాలు అందుకోగా, వీటిలో కల్కి మూవీ రూ. 1150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పలు బడా పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ గ్లొబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB29, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ తీస్తున్న AA22, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తీస్తున్న Peddi, ఎన్టీఆర్ హీరోగా KGF సిరీస్, Salaar సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ Dragon, మరోవైపు ప్రభాస్ తో త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయనున్న Spirit సినిమాలు అన్ని కూడా దాదాపుగా పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ స్థాయిలో అత్యధిక క్వాలిటీతో పాటు హై బడ్జెట్ తో రూపొందుతున్నవే.
మరి ఇవి రేపు రిలీజ్ తరువాత వరల్డ్ వైడ్ గా ఇంకెంతమేర సంచలనం సృష్టిస్తాయో చూడాలి. ఇక అసలు విషయం ఏమిటి అంటే, ఇటీవల కొన్నేళ్లుగా మన తెలుగు సినిమాలు అటు యూఎస్ఏ లో మరింతగా అదరగొడుతూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ మన స్టార్స్ అందరికీ కూడా మంచి ప్రీమియర్స్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ వస్తుంటాయి. అయితే అక్కడ టాప్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యధిక సినిమాలతో టాప్ లో ఉండగా ఆయన అనంతరం నాచురల్ స్టార్ నాని (Nani) ఉన్నారు. మొత్తంగా ఇప్పటివరకు యూఎస్ఏ లో ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో రిలీజ్ అయిన మన తెలుగు సినిమాల్లో ఏది ఎక్కువ గ్రాస్ ని కొల్లగొట్టింది అనేది క్లియర్ గా కలెక్షన్ డీటెయిల్స్ ప్రకారం చూద్దాం.
Highest Grossing Tollywood Movies in USA (North America) - 1 Million $ Club
1.Baahubali The Conclusion - $ 20778 K
2. Kalki 2898 AD - $ 18574 K
3. RRR - $ 15342 K
4. Pushpa 2 : The Rule - $ 15266 K
5. Salaar Part 1 : Ceasefire - $ 8927 K
6. Baahubali The Beginning - $ 8479 K
7. Devara : Part 1 - $ 6078 K
8. Hanu-Man - $ 5313 K
9. Ala Vaikunthapurramuloo - $ 3636 K
10. Rangasthalam - $ 3513 K
11. Bharat Ane Nenu - $ 3416 K
12. Saaho - $ 3234 K
13. Tillu Square - $ 2938 K
14. Sankrathiki Vasthunam - $ 2935 K
15. Srimanthudu - $ 2883 K
16. Guntur Kaaram -$ 2629 K
17. Syeraa Narasimha Reddy - $ 2625 K
18. Mahanati - $ 2595 K
19. Saripodhaa Sanivaaram - $ 2490 K
20. Pushpa : The Rise Part 1 - $ 2484 K
21. Geetha Govindam - $ 2464 K
22. A..Aa.. - $ 2449 K
23. Khaidi No. 150 - $ 2447 K
24. Bheemla Nayak - $ 2436 K
25. Kuberaa - $ 2418 K
26. Waltair Veerayya - $ 2342 K
27. Sarkaru Vaari Paata - $ 2341 K
28. HIT: The Third Case - $ 2310 K
29. Sarileru Neekevvaru - $ 2289 K
30. Aradinva Sametha - $ 2182 K
31. F2 (Fun & Frustration) - $ 2135 K
32. Game Changer - $ 2094 K
33. Fidaa - $ 2074 K
34. Radhe Shyam - $ 2067 K
35. Agnyaathavaasi - $ 2066 K
36. Dasara - $ 2049 K
37. Nannaku Prematho - $ 2022 K
38. Atharintiki Daaredi - $ 1898 K
39. Hi Nanna - $ 1894 K
40. Maharshi - $ 1891 K
41 Kushi - $ 1823 K
42. Miss Shetty Mr. Polishetty - $ 1822 K
43. Janatha Garage - $ 1800 K
44. Arjun Reddy - $ 1682 K
45. Gautami Putra Satakarni - $ 1664 K
46. Karthikeya 2 - $ 1655 K
47. Seethamma Vakitlo Sirimalle Chettu - $ 1635 K
48. Kingdom - $ 1625 K
49. Daaku Maharaaj - $ 1579 K
50. Oopiri - $ 1569 K
51. Dookudu - $ 1563 K
52. Spyder - $ 1561 K
53. Jai Lava Kusa - $ 1558 K
54. Manam - $ 1538 K
55. Aagadu - $ 1482 K
56. Dhruva - $ 1473 K
57. Sita Ramam - $ 1441 K
58. Bro - $ 1433 K
59. Bhale Bhale Magadivoy - $ 1430 K
60. Race Gurram - $ 1395 K
61. Mirai - $ 1341 K ( 2 Days)
62. 1 Nenokkadine - $ 1330 K
63. Jersey - $ 1323 K
64. Godfather - $ 1283 K
65. Virupaksha - $ 1280 K
66. Baadshah - $ 1279 K
67. Lucky Baskhar - $ 1279 K
68. F3: Fun & Frustration - $ 1269 K
69. Bhagavanth Kesari - $ 1264 K
70. Mad Square - $ 1261 K (21 Days)
71. Love Story - $ 1258 K
72. S/O Satyamurthy - $ 1254 K
73. Hari Hara Veera Mallu - $ 1227 K
74. Pelli Choopulu - $ 1223 K
75. Ninnu kori - $ 1197 K
76. Katama Rayudu - $ 1162 K
77. Brahmotsavam - $ 1158 K
78. DJ (Duvvada Jagannatham) - $ 1149 K
79. Major - $ 1142 K
80. Ante Sundaraniki - $ 1132 K
81. Veera Simha Reddy - $ 1109 K
82. Bhaagamathie - $ 1108 K
83. Tholiprema - $ 1092 K
84. MCA - $ 1082 K
85. Nenu Local - $ 1080 K
86. Eega - $ 1071 K
87. Sardar Gabbar Singh - $ 1070 K
88. Mathu Vadalara 2 - $ 1066 K
89. Jathi Rathnalu - $ 1059 K
90. Temper - $ 1053 K
91. HIT: The Second Case - $ 1039 K
92. Gabbar Singh - $ 1034 K
93. Oh! Baby - $ 1034 K
94. Akhanda - $ 1034 K
95. Samajavaragamana - $ 1031 K
96. Court: State vs A Nobody - $ 1025 K
97. Hello - $ 1009 K
గమనిక : మాకు లభ్యమైనంతవరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ కలెక్షన్ నంబర్స్ ని ఇవ్వడం జరిగింది.
కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ కలెక్షన్స్, లేటెస్ట్ మూవీ అప్ డేట్స్, రివ్యూస్, అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి.
What's Your Reaction?






