Top South Indian Actresses – Famous South Heroines & Their Names
Get a complete list of leading South Indian heroines like Nayanthara, Samantha, Anushka Shetty, Sai Pallavi and more dominating Telugu, Tamil, Malayalam & Kannada cinema

తెలుగు సినిమా పరిశ్రమని పరిశీలిస్తే తొలితరం నటీమణులైన సావిత్రి,,జమున, అంజలీదేవి, షావుకారు జానకి, బి సరోజా దేవి, రాజశ్రీ, కృష్ణకుమారి వంటి వారు అందరూ కూడా ఎక్కువగా అప్పటి టాప్ స్టార్స్ అందరి సినిమాల్లో చేస్తూ కొనసాగారు. అందరూ కూడా తమ తమ అత్యద్భుత నటన, అందంతో అందరినీ మెప్పించారు.
అయితే రాను రాను కాలం మారడంతో పాటు అనంతరం మరొక తరం నటీమణులు వచ్చారు. అప్పుడు కాంచన, వాణిశ్రీ, విజయనిర్మల, మంజుల, జయచిత్ర, లక్ష్మి ఇలా చెప్పుకుంటూపోతే పలువురు వచ్చారు. వారు కూడా ఆ సమయంలో స్టార్ నటుల సరసన నటించారు. అలానే వారు పలు ఇతర భాషల్లో కూడా నటించి అలరించారు. ఇక అక్కడి నుండి మెల్లగా హీరోయిన్స్ యొక్క క్యారెక్టర్స్ సినిమాల్లో కొంత మారుతూ వచ్చాయి.
దక్షిణ భారత ప్రముఖ హీరోయిన్‌ల పేర్ల సంపూర్ణ జాబితా
ఇక ఇటీవల కొన్నేళ్లుగా మనం అందరం చూస్తూనే ఉన్నాము. హీరోతో పోలిస్తే హీరోయిన్ పాత్రలు పరిమితంగా ఉండడంతో పాటు ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ తో పాటు అక్కడక్కడా పలు సీన్స్ కి మాత్రమే వారు పరిమితం చేయబడుతున్నారు. అయితే ఇప్పటికే కొందరు దర్శకులు మాత్రం నేటి హీరోయిన్స్ ని తాము రాసుకున్న పాత్రల్లో చక్కగా చూపిస్తున్నారు. కాగా నేడు నయనతార, అనుష్క శెట్టి, కాజల్, తమన్నా, సమంత ఇలా చెప్పుకుంటూపోతే అనేకమంది కథానాయికలు తమ టాలెంట్ తో రీజినల్ గానే కాక నేషనల్ వైడ్ గా విశేషమైన క్రేజ్ తో దూసుకెళ్తున్నారు.
Nayanthara Samantha Rashmika Tamannaah Sreeleela
అయితే తొలితరం నటీమణుల నుండి నేటివరకు అనేకమంది సౌత్ లోని దాదాపుగా అనేక భాషల్లో నటించినవారే. ఆ విధంగా తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా వారు మెప్పించారు. ముఖ్యంగా కొన్నేళ్లుగా సోషల్ మీడియా మాధ్యమాల యొక్క వినియోగం మరింతగా పెరగడంతో హీరోలు హీరోయిన్స్ యొక్క క్రేజ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే నేటి సౌత్ హీరోయిన్స్ లో అందరూ ఎక్కువగా చిత్రాల్లో నటించనప్పటికీ కూడా తమకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ ఆకట్టుకునే అభినయంతో మెప్పిస్తున్నారు. ఆ విధంగా నేటి స్టార్ హీరోయిన్స్ ఎవరెవరు ఏ ఏ సినిమాలు చేసారు ఎంతమేర క్రేజ్ తో సక్సెస్ లతో కొనసాగుతున్నారు అనేది ఈ ఆర్టికల్ లో మొత్తంగా చూద్దాం.
South Indian Heroines
సమంత రూత్ ప్రభు : (Samantha Ruth Prabhu)
ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత మహేష్ తో దూకుడు, ఎన్టీఆర్ తో బృందావనం, రాజమౌళి ఈగ వంటి బ్లాక్ బస్టర్స్ హీరోయిన్ గా ఆమెకు విశేషమైన క్రేజ్ తీసుకువచ్చాయి. అలానే ఇటీవల బేబీ, యశోద, శాకుంతలం వినతి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనదైన ఆకట్టుకునే అందం, అభినయంతో మంచి సక్సెస్ లు అందుకునాన్రు సమంత. ఇక కెరీర్ బిగినింగ్ లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని అనేక సక్సెస్ లు అందుకున్న సమంత రూత్ ప్రభు ని టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా చెప్పుకునేవారు. ఆ తరువాత తమిళ్ లో కూడా ఆమె పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసి అక్కడి స్టార్స్ సరసన కూడా అవకాశాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం సమాయత్తం అవుతున్నారు సమంత. అటు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అకౌంట్స్ కలిగిన సమంత ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో తన సినీ, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు.
నయనతార : (Nayanthara)
తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా ద్వారా కోలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు నయనతార. అయితే ఫస్ట్ మూవీనే సూపర్ స్టార్ ప్రక్కన నటించడంతో పాటు ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడంతో హీరోయిన్ గా నయనతార విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరువాత నుండి తమిళ్ తో పాటు తెలుగులో కూడా పలు అవకాశాలు అందుకున్న నయనతార పలు మలయాళ సినిమాలు కూడా చేసారు. ఆ విధంగా అటు తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం లో కూడా నటిగా దూసుకెళ్లారు. అలానే ఇటీవల ఐరా, అనామికా, ఇమైక్కా నొడిగళ్, ఆరం, కోలమవు కోకిల, అన్నపూర్ణయ్ వంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు నయనతార. ఇక ఆమె తన వ్యక్తిగత, సినిమా విషయాలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు విషయాలు ఫ్యాన్స్, ఆడియన్సు తో పంచుకుంటూ ఉంటారు.
కీర్తి సురేష్ : (Keerthy Suresh)
తొలిసారిగా తెలుగులో నేను శైలజ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేష్. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీని కిశోర్ తిరుమల తెరకెక్కించారు. అప్పట్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాగానే సక్సెస్ అవడంతో పాటు హీరోయిన్ గా కీర్తి కి మంచి పేరు తీసుకువచ్చింది. అక్కడి నుండి తెలుగులో నాని తో నేను లోకల్, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఆపైన సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి మూవీలో నటించి ఏకంగా ఉత్తమ జాతీయ నటిగా అవార్డు కూడా అందుకున్నారు. ఇక అక్కడి నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి సక్సెస్ లతో దూసుకెళ్హున్న కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి. కీర్తి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించిన సంగతులు పంచుకుంటూ ఉంటారు.
Telugu Actresses List
కాజల్ అగర్వాల్ : (Kajal Aggarwal)
లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఆ తరువాత రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర మూవీలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. అప్పట్లో భారీ విజయం అందుకున్న ఆ మూవీ స్టార్ నటిగా ఆమెకు విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి సూపర్ స్టార్ మహేష్ తో బిజినెస్ మ్యాన్, ఎన్టీఆర్ తో బృందావనం, ప్రభాస్ తో డార్లింగ్, పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ ఇలా పలు భారీ ప్రాజక్ట్స్ ని అందుకున్నారు. అలానే అటు తమిళ్ లో కూడా అలరించిన కాజల్ అక్కడి స్టార్స్ నటన కూడా మంచి ఆవేశాలు సొంతం చేసుకున్నారు. అటు హిందీలో కూడా ఆమె పలు ప్రాజక్ట్స్ తో కొనసాగారు. ఇక ప్రస్తుతం వివాహం అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చి అటు ఫామిలీ లైఫ్ ని ఇటు సినిమాలని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. అటు సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉండే కాజల్ చేతిలో పలు మంచి ప్రాజక్ట్స్ ప్రస్తుతం ఉన్నాయి.
నాయనతారా, సమంత, అనుష్క శెట్టి, సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్‌లు
తమన్నా భాటియా : (Tamannaah Bhatia)
శ్రీ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు తమన్నా. ఆ తరువాత శేఖర్ కమ్ముల అందరూ కొత్తవారితో తీసిన హ్యాపీ డేస్ మూవీ సంచలన విజయం హీరోయిన్ గా తమన్నాకు బాగా పేరు తీసుకువచ్చింది. అక్కడి నుండి హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు సొంతం చేసుకున్నారు తమన్నా. ఆపైన సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా అందరితో పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ కొనసాగారు. అలానే అటు తమిళ్ తో పాటు హిందీలో కూడా పలు సినిమాలు చేసారు తమన్నా. ఆ విధంగా తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో నటిగా తన ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించిన తమన్నా ఇతర హీరోయిన్స్ మాదిరిగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. మొదటి నుండి తనకు వచ్చిన అవకాశాలు చక్కగా వినియోగించుకుంటూ సక్సెస్ లతో కొనసాగుతున్న తమన్నా భాటియా చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి.
Tamil Malayalam Kannada Actresses
శృతి హాసన్ : (Shruti Haasan)
స్టార్ సీనియర్ నటుడు కమల్ హాసన్ కూతురిగా తెలుగులోకి తొలిసారిగా అనగనగా ఒక ధీరుడు మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ మూవీలో ఛాన్స్ అందుకున్నారు. ఆ మూవీ అప్పట్లో సంచలన విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా తెలుగులో విశేషమైన క్రేజ్ ని శృతి కి తీసుకువచ్చింది. అనంతరం తెలుగులో స్టార్ నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల సరసన పలు సీనెంస్లు చేసి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు శృతి. ఇక ఆ తరువాత అటు తమిళ్ లో కూడా ఆమెకు పలు అవకాశాలు తెచ్చిపెట్టాయి. అలానే హిందీలో సైతం అవకాశాలు అందుకుని వాటిని విజయాలుగా మలుచుకుని మంచి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు శృతి హాసన్. ఇక తనకు వచ్చిన పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి నటించే శృతి హాసన్ సింగర్ గా అలానే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మల్టి టాలెంట్ కల్గిన వారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటారు.
రష్మిక మందన్న : (Rashmika Mandanna)
తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా ఛలో మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ తరువాత భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మరొక రెండు విజయాలు సొంతం చేసుకున్నారు. కన్నడ భామ అయిన రష్మిక తెలుగులో మెల్లగా అవకాశాలు అందుకుని ఇటీవల అల్లు అర్జున్ సరసన పుష్ప, పుష్ప 2 సినిమాలతో భారీ విజయాలు అందుకుని నేషనల్ వైడ్ ఆడియన్సు యొక్క మనసు దోచారు. ఇక ప్రతి సినిమాలో కూడా గ్లామర్ తో పాటు తన పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించే రష్మిక మందన్న ఆ తరువాత హిందీలో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఆనిమల్ మూవీలో నటించి మరొక భారీ విజయం అందుకున్నారు. అటు తమిళ్ లో కూడా దూసుకెళ్తున్న రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం పలు భాషల యొక్క సినిమాలు ఉన్నాయి. అలానే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా అకౌంట్స్ కల్గిన రష్మిక సరదాగా తన సినీ, వ్యక్తిగత విషయాలు ఫ్యాన్స్, ఆడియన్సు తో పంచుకుంటూ ఉంటారు.
రష్మిక మందన్న, కీర్తి సురేష్, పూజా హెగ్డే, శ్రీలీల ఇతర ప్రముఖ తారలు
త్రిష : (Trisha Krishnan)
కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష తెలుగులో నీ మనసు నాకు తెలుసు ద్వారా పరిచయం అయ్యారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరించబడిన ఈ మూవీలో తరుణ్ హీరోగా నటించారు. ఆ తరువాత వర్షం సినిమా హీరోయిన్ గా ఆమెకు విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈమూవీ అనంతరం తెలుగులో మహేష్ బాబుతో అతడు, పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, చిరంజీవితో స్టాలిన్, ఎన్టీఆర్ తో దమ్ము వంటి సినిమాలతో దూసుకెళ్లారు త్రిష. అయితే తెలుగులో కొన్నాళ్లుగా పెద్దగా సినిమాలు చేయని త్రిష, అటు తమిళ్ లో స్టార్స్ అందరి సరసన నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించారు. ముఖ్యంగా తనకు వచ్చిన పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి నటించే త్రిష చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ్ వంటి భాషల్లో కొన్ని సినిమాలు ఉన్నాయి.
పూజా హెగ్డే : (Pooja Hegde)
తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా నాగచైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా లాంచ్ అయిన ముకుంద తో పాటు మరొక్కసారి ఆయనతో కలిసి గద్దలకొండ గణేష్ మూవీ కూడా చేసారు. వీటితో నటిగా సూపర్ సక్సెస్ లతో పాటు మంచి క్రేజ్ కూడా అందుకున్నారు పూజా హెగ్డే.ఆ తరువాత ఎన్టీఆర్ తో ఆమె చేసిన అరవింద సమేత, మహేష్ తో చేసిన మహర్షి, అల్లు అర్జున్ తో చేసిన అలవైకుంఠపురములో సినిమాలతో భారీ విజయాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ నటిగా మంచి పేరు అందుకున్నారు పూజా హెగ్డే. ఆ విధంగా తనకి లభించిన ప్రతి మూవీ అవకాశాన్ని వినియోగించుకుని పెర్ఫార్మన్స్ తో అలరించిన పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇక అటు హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ అక్కడి ఆడియన్స్ నుండి కూడా మన్ననలు అందుకుంటున్న పూజా చేతిలో ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజక్ట్స్ ఉన్నాయి.
ఫిదా సినిమా ద్వారా తొలిసారిగా తెలుగుకి ఎంట్రీ ఇచ్చారు మలయాళ భామ సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తీసిన ఈ మూవీతో పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఆ తరువాత నానితో ఎం సి ఏ తో పాటు మరొక్కసారి ఆయనతోనే శ్యాం సింగ రాయ్ సినిమాలు కూడా చేసి రెండు విజయాలు అందుకున్నారు. అలానే నాగచైతన్య తో లవ్ స్టోరీ, ఇటీవల తండేల్ సినిమాలు చేసి మరొక రెండు విజయాలు అందుకున్నారు. అటు తమిళ్ లో కూడా స్టార్స్ సరసన నటించి ఆకట్టుకుంటూ విజయాలు కూడా సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు సాయి పల్లవి. ముఖ్యంగా సాయి పల్లవి అద్భుతమైన యాక్టింగ్ అలరించే డ్యాన్స్ తో ఫ్యాన్స్ ని ఆడియన్సు ని అలరిస్తూ కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె తెలుగు తో పాటు తమిళ్ సహా తొలిసారిగా హిందీలో అతి పెద్ద ప్రాజక్ట్ రామాయణ లో సీతగా నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు సాయి పల్లవి.
2025 Trending South Heroines
మొత్తంగా వీరితో పాటు మృణాల్ ఠాకూర్, రాశి ఖన్నా, ఆషిక రంగనాథ్, శ్రీలీల సహా మరికొంతమంది యువ నటీమణులు సౌత్ సినిమా పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ తో మంచి విజయాలతో కొనసాగుతున్నారు. ఇక వీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని కొనసాగాలని మా తెలుగు మూవీ మీడియా టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా విజయాభినందనలు తెలియచేస్తోంది.
What's Your Reaction?






